ఆగష్టు 14
ఆగష్టు 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 226వ రోజు (లీపు సంవత్సరములో 227వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 139 రోజులు మిగిలినవి.
సంఘటనలు
- 1862: బోంబే హైకోర్టు ప్రారంభం.
- 1947: భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.
- 2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది.
జననాలు
- 1895: మాగంటి బాపినీడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాడు.
- 1923: కులదీప్ నయ్యర్, భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత. (మ.2018 )
- 1927: మానాప్రగడ శేషసాయి, ఆకాశవాణి, దూరదర్శన్ వ్యాఖ్యాత.
- 1933: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (మ.2011)
- 1930: జాన నాగేశ్వరరావు, జనవాక్యం పత్రిక నడిపారు.
- 1946: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (మ. 2016)
- 1957: జానీ లీవర్: భారతీయ సినీ హాస్యనటుడు.
- 1966: హాలీ బెర్రీ, అమెరికన్ నటి.
- 1968: ప్రవీణ్ ఆమ్రే, భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు.
- 1982సుచిత్ర , తెలుగు నేపథ్య గాయనీ, నటి, రేడియో జాకీ.
- 1983: సునిధి చౌహాన్ , ప్లే బ్యాక్ సింగర్
మరణాలు
- 1910: గాదె చిన్నప్పరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు.
- 1958: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900)
- 1994: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (జ.1934)
- 2010: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (జ.1934)
- 2011: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (జ.1931)
- 2012: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (జ.1945)
- 2015: గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1930)
- 2015: యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931)
పండుగలు , జాతీయ దినాలు
- పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం-
బయటి లింకులు
ఆగష్టు 14 - ఆగష్టు 15 - జూలై 14 - సెప్టెంబర్ 14 -- అన్ని తేదీలు
|
|