జానీ లీవర్గా సుప్రఖ్యాతుడైన జాన్ ప్రకాశరావు జనుమల (హిందీ: जॉन प्रकाश राओ जनुमाला; 14 August 1957, కనిగిరి, ప్రకాశం జిల్లాలో),[2] భారతీయ సినీనటుడు, హిందీ చిత్రసీమలో సుప్రసిద్ధి పొందిన హాస్యనటుల్లో ఒకరు.[3]
లీవర్ 13మార్లు ఫిలింఫేర్ హాస్యపాత్రలో ఉత్తమ ప్రదర్శన విభాగానికి పురస్కారం కొరకు నామినేట్ కాగా, రెండుసార్లు (దీవానా మస్తానా (1997), దుల్హే రాజా (1998)ల్లో నటనకు) పురస్కారం పొందారు. 1984లో ఆయన నటజీవితాన్ని ఆరంభించి, మూడువందలకు పైగా బాలీవుడ్ సినిమాల్లో నటించారు.[4][5]
వీరి తల్లిదండ్రులు కరుణమ్మ, జనుముల ప్రకాశరావు. ప్రకాశరావు, ముంబాయిలోని హిందుస్థాన్ లీవర్ ఉద్యోగి కావడంతో, వారు కుటుంబంతో ముంబాయిలోనే స్థిరపడ్డాడు. జానీ లీవర్ ముంబాయిలోనే జన్మించాడు. ఆయన బాల్యమంతా అక్కడే గడిచింది. ఆయన ఇంగ్లీషు, హిందీ ఎంత ధారాళంగా మట్లాడగలరో, తెలుగులోనూ అంత బాగా మట్లాడగలడు. ఆయన మూడు దశబ్దాలకుపైగా 300 చిత్రాలలో నటించాడు. వీరి బంధులంతా దర్శి, కనిగిరి, సంతనూతలపాడు ప్రాంతాలలో ఉన్నారు. అందువలన ఆయన జిల్లాకు వస్తూనే ఉంటాడు.[6]