ఆగష్టు 15
ఆగష్టు 15 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 227వ రోజు (లీపు సంవత్సరములో 228వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 138 రోజులు మిగిలినవి.
సంఘటనలు
1519 : పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
1535 : పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
1540 : పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం.
1822 : 1822 జనాభా లెక్కలు ప్రకారం అప్పర్ కెనడాలో 1,20,000 మంది, లోయర్ కెనడా లో,500,000 మంది ప్రజలు నివసించేవారు.
1834 : 1834 లో బ్రిటన్ పార్లమెంట్, చేసిన "సౌత్ ఆస్ట్రేలియా చట్టము" ప్రకారము, అక్కడ వలస (కోలనీ) ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి లభించింది.
1858 : పసిఫిక్ సముద్రతీరప్రాంతానికి, ప్రతీ రోజూ ఉత్తరాల పంపిణీ జరగటం మొదలు అయ్యింది.
1889 : ఆసియా లోనే, అతి పురాతనమైన, మోహన్ బాగన్ ఎ.సి. కలకత్తాలో స్థాపించబడింది.
1870 : ట్రాన్స్ కాంటినెంటల్ రైల్వే మార్గము పూర్తి అయ్యింది.
1889 : 15 ఆగష్ట్ నుంచి 16 సెప్టెంబరు వరకు జరిగిన ది గ్రేట్ లండన్ డాక్ స్ట్రైక్ వలన, బ్రిటిష్ ట్రేడ్ యూనియనిజం, నిపుణులైన కార్మికుల నుంచి, తక్కువ నిపుణత ఉన్న కార్మికులకు పాకింది.
1901 : కాడిలాక్ మోటార్ కంపెనీ డెట్రాయిట్లో స్థాపించబడింది.
1914 : అంకన్ అనే పేరుగల సరుకుల ఓడ (రవాణా ఓడ), అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం లోకి, పనామా కాలువ ద్వారా, ప్రయాణించటంతో, పనామా కాలువ ప్రారంభమైంది.
1944 : ఫ్రాన్స్ దక్షిణాన, మిత్ర దేశాల దళాలు దిగి, మార్సీల్స్ పట్టణాన్ని, తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
1938 : ఆంధ్రప్రభ దినపత్రిక చెన్నై (నాటి మద్రాసు ) లో, పారిశ్రామిక వేత్త రామనాధ్ గోయెంకా మొదలు పెట్టాడు.
1945 : కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది.
1947 : భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది.
1947 : స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ నియామకం.
1947 : పాకిస్తాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా మొదటి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా, కరాచీలో పదవిని స్వీకరించాడు.
1950 : విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు.
1950 : అస్సాంలో భూకంపం 8.6 రెక్టర్ స్కేల్ మీద. 1,000 మందికి పైగా మరణించారు.
1960 : రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె) , ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది.
1960 : ముగ్గురు కాలిఫోర్నియా కాపలాదారులు, ఎగిరే పళ్ళాలు (గుర్తుపట్టలేని ఫ్లైయింగ్ వస్తువులు) చూసామని చెప్పారు.
1961 : తూర్పు జర్మనీలో బెర్లిన్ గోడ కట్టటం మొదలైంది. జర్మనీ ప్రజలకు చీకటి రోజు
1965 : లాస్ ఏంజిల్స్ లోని, జాతి కలహాలు నివారించటానికి, అమెరికాకి చెందిన నేషనల్ గార్డ్ని పిలిచారు.
1965 : బీటిల్స్ , న్యూయార్క్ లోని, షియా స్టేడియంలో పాటలు పాడారు.
1969 : వుడ్ స్టాక్ సంగీత ఉత్సవం మాక్స్ యాస్గర్ ఫార్మ్‌లో ప్రారంభించారు.
1971 : బహ్రెయిన్ , బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
1971 : అమెరికా అధ్యక్షుడు నిక్సన్ , జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు.
1974 : దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొంటున్న, దక్షిణ కొరియా , అధ్యక్షుడు పార్క్ చంగ్ హీ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో, దక్షిణ కొరియా , ప్రథమ మహిళ యూక్ యంగ్ సూ , మరణించింది.
1975 : బంగ్లాదేశ్‌లో సైనిక కుట్ర. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు.
1977 : ’ఓహియో రాష్ట్ర యూనివర్సిటీ' లో "సెటి" ప్రాజక్టులో భాగంగా, నెలకొల్పిన, ’ది బిగ్ ఇయర్, అనేపేరుగల రేడియో టెలిస్కోప్ కి విశ్వాంతరాళం లోతుల నుంచి ఒక రేడియో సిగ్నల్ అందింది. దానిని "వౌ సిగ్నల్" అనే పేరు పెట్టారు.
1983 : ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా రామ్ లాల్ నియమితులయ్యాడు.
2006 : ఎయిడ్స్ సమావేశము : క్లింటన్, గేట్స్, అమెరికా అధ్యక్షుడి ప్రణాళికను సమర్ధించారు.
2006 : శీతలీకరించిన వీర్యం పై చేసిన పరిశోధన, అంతరించి పోయిన పాలిచ్చే జంతువులు (మమ్మాల్స్) తిరిగి పునఃసృష్టి చేయగలమనే ఆశలు కలిగిస్తున్నది
2007 : పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఇకా , పెరూ దేశంలోని పలుప్రాంతాలలో, భూకంపం, 8.0- (మేగ్నిట్యూడ్) రెక్టర్ స్కేల్ మీద వచ్చి, 514 మంది మరణించగా, 1,090 మంది గాయపడ్డారు.
జననాలు
Jacques-Louis David 017
1769 : నెపోలియన్ , ఫ్రెంచ్ చక్రవర్తి. (మ.1821)
1771 : సర్ వాల్టర్ స్కాట్ , స్కాటిష్ నవలా రచయిత.
1888 : టి.ఇ. లారెన్స్ , 'లారెన్స్ ఆఫ్ అరేబియా '; సైనికుడు, రచయిత
1889 : దండు నారాయణరాజు , స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1944)
1895 : వేమూరి గగ్గయ్య , తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1955)
1902 : మోటూరి సత్యనారాయణ , దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995)
1913 : బాడిగ వెంకట నరసింహారావు , కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (మ.1994)
1914 : పరశురామ ఘనాపాఠి వేదపండితుడు. (మ.2016)
1915 : ఇస్మత్ చుగ్తాయ్ , ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (మ.1994)
1924 : మల్లెమాల సుందర రామిరెడ్డి , తెలుగు రచయిత, సినీ నిర్మాత . (మ.2011)
1929 : ద్వివేదుల విశాలాక్షి , కథా, నవలా రచయిత్రి. (మ.2014)
1931 : నాగభైరవ కోటేశ్వరరావు , కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (మ.2008)
1935 : రాజసులోచన , తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (మ.2013)
1938: సుకుమారి, తెలుగుతో పాటు,పలు భాషా చిత్రాలలో,2000 పైగానటించిన నటి(మ.2013)
1945: రాళ్లపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు(మ.2019)
1948: భారతి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల నటి.గాయనీ, దర్శకురాలు.
1949 : మైలవరపు గోపి , తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996)
1949 : దేవిప్రియ , పాత్రికేయుడు, కవి (మ.2020).
1961 : సుహాసిని , దక్షిణ భారత సినిమా నటి.
1961 : పందిళ్ళ శేఖర్‌బాబు , రంగస్థల (పౌరాణిక) నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. (మ.2015)
1964 : శ్రీహరి , తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. (మ.2013)
1975 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ భరద్వాజ్
1985 : లయ (నటి) , తెలుగు సినిమా నటీమణి.
1986 : కాసోజు శ్రీకాంతచారి , మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009)
మరణాలు
1935 : అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ఆశుకవి, శతావధాని. (జ.1883)
1942 : మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (జ.1892)
1949 : కొండా వెంకటప్పయ్య , ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866)
2004 : అమర్‌సిన్హ్ చౌదరి , గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1941).
2005 : బెండపూడి వెంకట సత్యనారాయణ , చర్మవైద్యులు. (జ.1927)
2006 : జి. వి. సుబ్రహ్మణ్యం , వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935)
2013 : లాల్‌జాన్ బాషా , రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956).
2018 : అజిత్ వాడేకర్ , భారత టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1941)
ఆగష్టు 15 : మహ్మద్ హబీబ్ , తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. (జ. 1949)
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
ఆగష్టు 14 - ఆగష్టు 16 - జూలై 15 - సెప్టెంబర్ 15 -- అన్ని తేదీలు