ఉజ్జయిని

  ?ఉజ్జయిని
మధ్య ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 23°10′58″N 75°46′38″E / 23.182778°N 75.777222°E / 23.182778; 75.777222
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 491 మీ (1,611 అడుగులు)
జిల్లా (లు) ఉజ్జయిని జిల్లా
జనాభా 429,933 (2001 నాటికి)

ఉజ్జయిని ప్రాచీన భారత చరిత్రలో ప్రముఖ పట్టణం. నేటికీ ఇది ప్రముఖ పట్టణమే. దీనికి ఇతర పేర్లు: ఉజ్జైన్, ఉజైన్, అవంతీ, అవంతిక. మధ్య భారత మాళ్వా ప్రాంతంలో మధ్య ప్రదేశ్లో గలదు. ఉజ్జయిని ఒక జిల్లా, డివిజన్ కూడానూ. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి రాజధానిగా వుండినది. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇచట పన్నెండు ఏండ్లకు ఒక సారి కుంభమేళా జరుగుతుంది. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే గలదు. రుద్ర సాగర్ అని సరస్సు వైపు, ఒక మూడు అంతస్తుల ఆలయం ఉంది.

చరిత్ర

Coin showing Karttikeya and Lakshmi (Ujjain, circa 150–75 BC)

భారతీయులు పవిత్రముగా నెంచు అయోధ్యాది సప్త క్షేత్రములలో అవంతిక ఒకటి. దీనిని ప్రస్తుతము ఉజ్జయిని అని పిలుచుచున్నారు. ఇది మాళ్వా పీఠభూమిలో సిప్రా నది తీరమందు ఉంది. భారతీయ భూగోళ శాస్త్రపు మధ్యాహ్నపు రేఖ ఈ అవంతిక మీదుగా ప్రసరించుచున్నది. అవంతిక వైభవమీనాటిది కాదు. చరిత్రకు కూడా అందని క్రీ.పూ మూడువేల యేండ్ల నుండియే అవంతిక మహోన్నత స్థానమును అలంకరించియున్నది. కాళిదాసు దీనిని వేవిధములుగా పొగడియున్నాడు. అశోకుడు, విక్రమాదిత్యుడు, చంద్రగుప్తుడు, అక్బరు, ఈఅవంతికకు ప్రాభవమును కల్పించినవారే. రెండు సార్లు ఈఅవంతికకు ప్రళయమొచ్చి ఇది నాశనము చేయబడింది. ఒకసారి వరదలవల్లను మరియొకసారి ఢిల్లీ ప్రభువు ఆల్తమష్ వల్లను నాశనం చేయబడింది. ఇది వరుసగా బ్రాహ్మణ, జైన, బౌద్ధ, సిథియన్, హైందవ, గ్రీకు, మొగలు రాజ్యములకు రాజధానిగా ఉండి, చివరకు గ్వాలియరు ప్రభువు మహారాజా దౌలత్‌రావు సింధియా కాలమునకు ఆహోదా వారినుండి 1810లో లష్కరుకు అందజేయబడింది. అవంతీరాజ్య రాజధానియగు ఉజ్జయినీకి గౌతమ బుద్ధుని కాలంనాటినుండి చరిత్రగలదు. అశోకుడూ ఇక్కడ నివాసమున్నాడు.

అవంతిక చాలా కాలము సుప్రసిద్ధ విద్యాపీఠముగా వెలసినది. ఇక్కడనే బలరామ కృష్ణులు సాందీపుడు వద్ద విద్యలు నేర్చిరి. ఇప్పటికిని సాందీపుని ఆశ్రమ స్థలము యాత్రా స్థలముగ నెన్నబడుచున్నది. ఆస్థలమునందు ఒక దేవాలయమును, రమణీయ సరోవరము ఉండి ఉంది. దీనినే అంకపత్ అని పిలుచుచుందురు. వైష్ణవ క్షేత్రముగా కంటెను శైవ క్షేత్రముగానే అవంతికకు ప్రఖ్యాతి. ప్రఖ్యాతమయిన మహాకాళ దేవాలయము అవంతికకు సౌభాగ్యమును కలిగించుచున్నది.1835వ సం.లో ఈదేవాలయము ధ్వంసము చేసి, ఢిల్లీ ప్రభువగు ఆల్తమాషు ఇందలి మహాకాళ విగ్రహమును తన రాజధానికి ఎత్తుకొని పోయెనట. ఆతరువాత 500యేండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వమున దివానుగా పనిచేయుచున్న రామచంద్రుడను పుణ్యశాలి అంతకు ముందున్న స్థలముననే ఇప్పుడు ఉన్న దేవాలయమును కట్టించెను. ఇక్కడ బ్రాహ్మణ పురోహితులను పాండాలని పిలుచు చుందురు.

శ్రీకృష్ణ పరమాత్మ అవంతికలో చదువుకొనుచున్న రోజులలో ఇదియొక జ్యోతిష్యక కేంద్రముగా కూడా ప్రసిద్ధి యొందెనట.ఆనాటికే హోరా విజ్ఞాన కేంద్రములలో ఒకటిగా పేరుగాంచినట. ఈఅవంతికను రాజధానిగా పాలించిన విక్రమాదిత్యుడు పేరునే విక్రమ శకముని ప్రసిద్ధ శకము ఏర్పడినది. యంత్రమహల్ అనబడుచు ప్రస్తుతము ఇక్కడ ఉన్న వేదసాల 1693లో రాజా జయసింగుచే కట్టబడింది.

వైష్ణవ సాధకులు ఇచ్చట ఉన్న సిప్రా నది కుడిగట్టునను, శైవ సాధువులు నదికెడమ గట్టునను విడిదిలు ఏర్పాటు చేసుకొనిచుండెడివారు. మామూలుగా ఈ రెండు తెగల బైరాగులును అవంతికలో ఆరువారములపాటు మకాము వేయుచుండెడివారు. మొదటి మూడు వారములును వారు గ్వాలియరు మహారజు ఆతిధ్యులుగా, ఆతరువాతి మూడువారములు ఉజ్జయిని ధనికుల అతిధులుగా ఉండెడివారు. వారు గుంపులు గుంపులుగా ఉండి, మహంతులను పేరిట దళపతుల ఆజ్ఞలకు లోబడినడుచుకొందెదరు. ఈ దళపతులే బయటకి పోయి వీరికి కావాల్సిన సామగ్రిని అంతయు సమకూర్చు చుండెడివారు.వీరిని ప్రశ్నించుట గాని, అసహ్యించుట గాని ప్రజలు చేయకుందుదురు. వీరిని దైవ చింతా పరాయణులుగా ప్రజలు భావించుచుందెదరు.

దేవాలయాలు

మూలాలు

వెలుపలి లింకులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!