ఉమారియా మధ్యప్రదేశ్ రాష్ట్రం షాడోల్ డివిజన్, ఉమారియా జిల్లాలోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.[2]
ఉమారియా 23°25′N 78°38′E / 23.42°N 78.63°E / 23.42; 78.63 నిర్దేశాంకాల వద్ద [3] సముద్ర మట్టం నుండి 538 మీటర్ల ఎత్తున ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉమారియాలో 33,114 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషులు 17,509, ఆడవారు 15,605. ఉమారియాలో అక్షరాస్యత 84.70 శాతం. ఇది రాష్ట్ర సగటు 69.32 శాతం కంటే ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 91.10% కాగా, స్త్రీలలో 77.49%. ఉమారియా జనాభాలో 12.34% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.