చచౌరా భారతదేశం, మధ్యప్రదేశ్ రాష్ట్రం, చచువారా-బీనాగంజ్ జిల్లాకు చెందిన నగరం. ఇది జిల్లా పరిపాలనా కేంద్రం.ఇది రాజస్థాన్ సరిహద్దులో ఉంది. నగరంలో ప్రధానంగా మాట్లాడే భాష హిందీ. చచౌరా నగర పంచాయతీగా వర్గీకరించబడింది. ఇది గ్రామీణ ప్రాంతం నుండి పట్టణానికి మారిన ఒక నివాస స్థావరం. చచౌరా జిల్లా కేంద్రంగా 2020 మార్చి 18 న మంత్రివర్గం ఆమోదించింది.
2001 భారత జనాభా లెక్కల ప్రకారం చచౌరా నగరంలో 17,303 మంది ఉన్నారు. [1]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, చచౌరాలో 21,860 మంది నివసిస్తున్నారు, వీరిలో 11,502 మంది పురుషులు ఉండగా, 10,358 మంది స్త్రీలు ఉన్నారు.2022-2023లో చచౌరా జనాభా సుమారు 28,000గా అంచనా వేయబడింది.ఈ ప్రాంతంలో కనిపించే జనాభా మీనా, గుజ్జర్, భిల్, లోధా అనే ప్రధాన కులాలకు చెందినవారు ఉన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్ ప్రక్కనే ఉన్న రాష్ట్రం నుండి వలస వచ్చినట్లు చెప్పబడుతున్న మీనా కులానికి చెందినవారి ఆధిపత్యం ఈ ప్రాంతంమీద సాగుతుంది.
చచౌరా నదరానికి గ్వాలియర్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.