భిండ్ మధ్యప్రదేశ్ లోని పట్టణం. ఇది భిండ్ జిల్లాకు ముఖ్యపట్టణం. [3]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, భిండ్ జనాభా 1,97,585. వీరిలో 1,05,352 మంది పురుషులు, 92,233 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 25,358. భిండ్‌లో అక్షరాస్యుల సంఖ్య 1,42,923, ఇది జనాభాలో 72.3%, పురుషుల అక్షరాస్యత 77.9%, స్త్రీల అక్షరాస్యత 65.9%. ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 83.0%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 89.6%, స్త్రీల అక్షరాస్యత రేటు 75.4%. షెడ్యూల్డ్ కులాల జనాభా 39,267, షెడ్యూల్డ్ తెగల జనాభా 1,832. 2011 లో భిండ్‌కు 33592 గృహాలు ఉన్నాయి. [1]
2001 నాటి భారత జనగణన ప్రకారం, భిండ్ జనాభా 1,53,768.[4]