కాళీఘాట్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కోల్‌కతా జిల్లా, కోల్‌కతా నగరంలోని ఒక ప్రాంతం. దక్షిణ కోల్‌కతాలోని పురాతన పొరుగు ప్రాంతాలలో ఒకటైన ఈ కాళీఘాట్ ప్రాంతం జనసాంద్రతతో కూడి ఉంటుంది.[1]
కాళీఘాట్ కాళి
ఇక్కడ కాళీకాదేవి కోసం ప్రసిద్ధ దేవాలయం కాళీఘాట్ కాళీ దేవాలయం ఉంది. 51 శక్తి పీఠాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. దాక్షాయణి (సతీ) కుడికాలి బొటనవేలు ఇక్కడ పడిందని చరిత్ర చెబుతతోంది.[2] ఇక్కడి శక్తిని దక్షిణ కాళికా అని పిలుస్తారు. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు ఇక్కడికి వస్తారు. అయితే, మంగళవారాలు, శనివారాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ రెండు రోజులలో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో రద్దీ వందరెట్లు పెరుగుతుంది. విపద్ తరిణి వ్రతం సమయంలో, అమ్మవారిని రతంతిక, ఫలహారిని కాళిగా పూజించినప్పుడు మరింత ఎక్కువమంది యాత్రికులు వస్తారు.
ఇతర వివరాలు
అమితావ్ ఘోష్ కలకత్తా క్రోమోజోమ్ లో కొంతభాగం కాళీఘాట్‌లో నేపథ్యంలో రాయబడింది. డాన్ సిమన్స్ రచించిన సాంగ్ ఆఫ్ కాళీ, పాపీ జెడ్ బ్రైట్ రచించిన కలకత్తా, లార్డ్ ఆఫ్ నెర్వ్స్ అనే చిన్న కథలో కూడా కాళీఘాట్ ప్రస్తావన ఉంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో విద్యాబాలన్ నటించిన కహానీ చిత్రంలో కూడా కాళీఘాట్ ఉంది.
చిత్రమాలిక
మూలాలు
బయటి లింకులు