గోవిందుడు అందరివాడేలే

గోవిందుడు అందరివాడేలే
దర్శకత్వంకృష్ణవంశీ
రచనపరుచూరి వెంకటేశ్వరరావు,
పరుచూరి గోపాలకృష్ణ [1]
నిర్మాతబండ్ల గణేష్
తారాగణంరాం చరణ్ తేజ,
శ్రీకాంత్,
కాజల్ అగర్వాల్,
కమలిని ముఖర్జీ,
భానుశ్రీ మెహ్రా,
ప్రకాశ్ రాజ్,
జయసుధ
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పునవీన్ నూలి[2]
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
అక్టోబర్ 1, 2014
సినిమా నిడివి
149 నిమిషాలు[3]
భాషతెలుగు

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన కుటుంబకథా చిత్రం "గోవిందుడు అందరివాడేలే".[1] ఈ సినిమాలో రాం చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ కథానాయక-నాయికలుగా నటించారు.[4][5] భానుశ్రీ మెహ్రా, ప్రకాష్ రాజ్, జయసుధ, రహమాన్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రకథను పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ రచించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకునిగా, నవీన్ నూలి ఎడిటరుగా పనిచేసారు. ఈ సినిమా కథకు పాక్షికంగా అక్కినేని నాగేశ్వరరావు, మీనా కలిసి నటించిన సీతారామయ్య గారి మనవరాలు స్ఫూర్తి.[6] ఈ సినిమా చిత్రీకరణ 2014 ఫిబ్రవరి 6న హైదరాబాదులో మొదలయ్యింది.[7] అదే రోజు మొదలైన ఈ సినిమా చిత్రీకరణ భారతదేశంలో హైదరాబాదు, రామేశ్వరం, నాగర్ కోయిల్, పొల్లాచి, కన్యాకుమారి, కేరళ, కారైకుడి ప్రాంతాల్లో జరుపబడింది. విదేశాల్లో లండన్, జోర్డాన్ నగరాల్లో ఈ సినిమాలోని కొంత భాగం చిత్రీకరించబడింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2014 అక్టోబరు 1న ఉదయం 5:18 గంటలకు విడుదలవుతోంది.[8]

తారాగణం

నిర్మాణం

అభివృద్ధి

ఆగస్టు 2013లో రాం చరణ్ తేజ, దగ్గుబాటి వెంకటేష్, ఘట్టమనేని కృష్ణ కలిసి కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక కుటుంబ కథాచిత్రంలో నటించనున్నారని, ఆ సినిమాని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పోతాకంపై నిర్మిస్తారని వార్తలొచ్చాయి.[10] ఆ తర్వాత దసరాకి సినిమాని లాంచ్ చెయ్యాలనుకున్నా సినిమా స్క్రిప్ట్ పూర్తిగా తయారయ్యేదాకా ఆగాలని భావించారు. ఆపైన ఈ సినిమా ఆగిపోయిందనుకున్న తరుణంలో బండ్ల గణేష్, కృష్ణవంశీ, చాయాగ్రాహకుడు సమీర్ రెడ్డి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూర్తి స్క్రిప్ట్ చేతపట్టుకుని కనబడటం ఈ సినిమా మొదలవుతుందన్న వాదనను ధ్రువీకరించింది.[11] జనవరి నెలచివరలో ఈ సినిమా పేరును "గోవిందుడు అందరివాడేలే" అని ఖరారు చేసినట్లుగా వార్తలొచ్చాయి.[12] కానీ వాటిని కృష్ణవంశీ ఖండించారు. "నేను ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ఫైనలైజ్ చెయ్యలేదు. మేము చాలా టైటిల్స్ ని చూస్తున్నాం. వేరే వేరే టైటిల్స్ ని దయచేసి ప్రచారం చేయొద్దు. టైటిల్ ఫైనలైజ్ అయ్యాక మేము అధికారికంగా తెలియజేస్తామని" కృష్ణవంశీ అన్నారు.[13] రథసప్తమి పర్వదినాన 2014 ఫిబ్రవరి 6న ఫిల్మ్ నగర్ వెంకటేశ్వరస్వామి దేవాలయలంలో ఈ సినిమాని అధికారికంగా ప్రారంభించారు.[14] చిత్రీకరణ జరుగుతుండగా చిరంజీవి నటించిన సినిమాల జాబితాను పరిశీలనలోకి తీసుకుని వాటితో పాటు ఏదయినా ఒక తెలుగు టైటిలును పెట్టాలని కృష్ణవంశీ ఆలోచిస్తున్నారని వార్తలొచ్చాయి.[15] ఆపై చిరంజీవి నటించిన విజేత సినిమా టైటిలును దీనికి పెట్టాలనుకుంటున్నారని వార్తలొచ్చాయి.[16] సాంప్రదాయమైన, కుటుంబకథా చిత్రంగా ఈ పేరు ధ్వనిస్తున్నట్టు కృష్ణవంశీ భావించడంతో గోవిందుడు అందరివాడేలే పేరుని ఖరారు చేసినట్టుగా వార్తలొచ్చాయి.[17][18] ఈ సినిమాను దివంగత దర్శకుడు బాపుకు అంకితం ఇవ్వలన్న అభిప్రాయాన్ని యూనిట్ సభ్యులతో కృష్ణవంశీ చెప్పగా బాగుంటుందని వారు కూడా భావించడంతో బాపు చిత్రపటాన్ని ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లో చేర్చారు.[19] దీని గురించి మాట్లాడుతూ కృష్ణవంశీ "అంకితం అంటే పెద్ద మాట అవుతుందేమో? ఆయనకు అంకితం చేయగల గొప్పవాళ్లం కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముంగిట 'ముత్యాల ముగ్గు' వేసిన పద్మశ్రీ బాపుగారికి వినమ్రతతో మీ ఏలకవ్య శిష్యబృందం అంటూ సినిమా ప్రారంభంలోనే టైటిల్‌ కార్డ్‌ వేస్తున్నాం. అలా బాపును గుర్తుచేసుకొంటున్నాము" అని వ్యాఖ్యానించారు.[20] సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ చరణ్ "గోవిందుడు అందరివాడేలే అనేది క్యారెక్టర్‌ గురించి పెట్టింది. ఆ పేరు గల వ్యక్తి అందరివాడు అనే అర్థం. అందరినీ కలుపుకొనే తత్త్వం వున్నవాడు. కానీ నా పేరు గోవిందుడు కాదు" అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.[21]

నటీనటుల ఎన్నిక

తొలుత దగ్గుబాటి వెంకటేష్, రాం చరణ్ తేజ, ఘట్టమనేని కృష్ణ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించడనికి ఎన్నుకోబడ్డారు అని వార్తలొచ్చాయి.[10] రాం చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమా ఆడియో ఆవిష్కరణకు వెంకటేష్ హాజరవ్వడం ఈ వార్తకు బలాన్ని చేకూర్చింది.[22] సెప్టెంబరు నెలలో ఈ వార్తలు నిజమేనని తేలడంతో కథానాయికల పాత్రలకు నయనతార, కాజల్ అగర్వాల్ ఎంపిక చెయ్యవచ్చని వార్తలొచ్చాయి.[23] ఆపై వెంకటేష్ చరణ్ బాబాయిగా నటిస్తారని తెలియజేసారు.[24] అయితే అక్టోబరు మొదట్లోనే కృష్ణ ఆరోగ్య సమస్యల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు తెలియజేసారు.[25] నవంబరు నెల చివర్లో ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు రాజ్ కిరణ్ ఈ సినిమాలో కృష్ణ నటించాల్సిన పాత్రలో నటిస్తున్నారని వెల్లడించారు.[26][27] ఈ సినిమా కోసం కృష్ణవంశీ పల్లెటురిలో పెరిగిన అందమైన అమ్మాయిలా కనిపించే అమ్మాయి కోసం వెతుకుతున్నాడని అన్నారు.[28] డిసెంబరు నెల మధ్యలో వెంకటేష్ సినిమానుంచి తప్పుకోగా ఆయన పాత్రను శ్రీకాంత్ భర్తీ చేసారు.[29] ఆపై చరణ్ సరసన కథానాయికగా రాఖీ సినిమాలో కృష్ణవంశీతో పనిచేసిన ఇలియానా[30], ఆపై హైదరాబాదుకి చెందిన మోడల్ చాందిని చౌదరిల పేర్లను పరిశీలించారు.[31] ఆ తర్వాత తమన్నా కథానాయికగా ఎన్నికయ్యారని వార్తలొచ్చాయి.[32] కానీ తమన్నా ఆగడు, బాహుబలి సినిమాల చిత్రీకరణల్లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కేటాయించలేకపోయారు. మళ్ళీ కాజల్ కథానాయికగా ఎన్నికవుతారని వార్తలొచ్చాయి.[33] చివరికి జనవరి 2014 మొదటి వారంలో కృష్ణవంశీ కాజల్ ఇద్దరు కథానాయికలలో ఒకరిగా ఎన్నికయ్యారని, శ్రీకాంత్ సరసన నటించే కథానాయిక కోసం ఆలోచిస్తున్నామని కృష్ణవంశీ స్పష్టం చేసారు.[34] ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ శ్రీకాంత్ తను చరణ్ యువ బాబాయిగా నటిస్తున్నానని, పాత్రకోసం జుట్టు పెంచుతున్నానని వెళ్ళడించారు.[35] జనవరి నెలమధ్యలో కమలినీ ముఖర్జీ ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన నటిస్తోందని వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమేనని స్పష్టం చేస్తూ ఆ పాత్రను సమర్థవంతంగా పోషించగల వయసు, అనుభవం, ఆత్మవిశ్వాసం కమలినీకి ఉన్నాయని, అందుకే తనని కథానాయికగా ఎన్నుకున్నాని కృష్ణవంశీ మీడియాకి స్పష్టం చేసారు.[36] ఫిబ్రవరి నెలమధ్యలో చరణ్ తండ్రి పాత్రకు కృష్ణవంశీ అక్కినేని నాగార్జునను నటింపజేయాలనుకున్నాడనీ, అందుకు ఆయనతో సంప్రదింపులు జరిపారని పుకార్లు మొదలయ్యాయి.[37] కానీ మరుసటి రోజే ఆ వార్తలను ఖండించాక మరలా జగపతి బాబు కానీ, తమిళ నటుడు శరత్ కుమార్ కానీ చరణ్ తండ్రిగా నటించవచ్చన్న వాదన మొదలయ్యింది.[38] రామేశ్వరంలో చిత్రీకరణ జరుగుతుండగా శబరీష్ కంద్రేగుల దర్శకత్వం వహించిన "ది వైవా" అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రఖ్యాతి గాంచిన చెముడు హర్షను ఒక ముఖ్యమైన హాస్యభరితపాత్రకు ఎంచుకున్నారు కృష్ణవంశీ. ఈ వార్తను హర్ష స్వయంగా ధ్రువీకరించాడు.[39] 2014 ఫిబ్రవరి 14న చరణ్ పోనీటెయిల్ వేసుకుని బసంతి సినిమా పాట విడుదలకు హాజరయ్యాడు. ఆ క్షణం నుంచీ అదే చరణ్ ఈ సినిమాలో కనిపించనున్న వేషమని ప్రచారం జరిగింది.[40] కృష్ణవంశీ దానిని ధ్రువీకరించడంతో చరణ్ ప్రవాసాంధ్రుడిగా నటిస్తున్నాడన్న వార్తలు నిజమయ్యాయి.[41] మార్చి నెలచివర్లో జగపతి బాబు ఈ సినిమాలో చరణ్ తండ్రిగా నటించేందుకు ఒప్పుకున్నారని వార్తలొచ్చాయి.[42] అదే సమయంలో చరణ్ కొన్ని సీన్స్ లో సాంప్రదాయబద్దమైన పంచ కట్టులో కనిపించనున్నారు అని వార్తలొచ్చాయి.[43] జగపతి బాబు మాత్రం తర్వాత తనని కృష్ణవంశీ చరణ్ తండ్రి పాత్రకోసం కలిసాడనీ, తను మాత్రం ఆ పాత్రని సున్నితంగా తిరస్కరించానని స్పష్టం చేసారు. తాను ఇంకా క్యారెక్టర్ పాత్రల్లో న‌టించాల్సి ఉంద‌నీ, ఈ ద‌శ‌లో తండ్రి పాత్రల్లోకి మార‌డం స‌బ‌బు కాద‌ని ఆయ‌న అన్నారు.[44] మే నెలచివర్లో దర్శకనిర్మాతలు ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో చరణ్ తాతయ్యగా నటిస్తున్నారని స్పష్టం చేసారు.[45] తొలుత రాజ్ కిరణ్ ఈ పాత్రను చెయ్యాల్సినప్పటికీ ఆయన కంటే ప్రకాశ్ రాజ్ అయితే మంచి చాయిస్ అని చివరి నిమిషంలో ప్రకాశ్ రాజ్ ని ఎన్నుకున్నట్లు ఈ చిత్ర వర్గాలు చెప్పాయి.[46] మే 28న బండ్ల గణేష్ ఈ సినిమాలో జయసుధ ప్రకాశ్ రాజ్ భార్యగా నటిస్తున్నారని స్పష్టం చేసారు.[47] ఈ మార్పుల వెనుక చిరంజీవి హస్తం ఉందన్న వార్తలను బండ్ల గణేష్ తోసిపుచ్చారు. "ఇందులో ప్రథమంగా చరణ్ తాతయ్య పాత్ర కోసం రాజ్‌కిరణ్‌ని తీసుకున్నాం. ఆయనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం కూడా. రాజ్‌కిరణ్ అద్భుతంగా నటించారు. అయితే ఆయన నటన తెలుగు నేటివిటీకి దూరంగా ఉందని అనిపించింది. అందుకే ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నాం. అంతేతప్ప కొందరు అనుకుంటున్నట్లు చిరంజీవిగారు ఈ చిత్రాన్ని ఆపేయమనలేదు" అని బండ్ల గణేష్ మీడియాకి చెప్పారు.[48] కొన్ని రోజుల తర్వాత జగపతి బాబు ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యం కలిగిన ప్రతినాయకుడిగా కనిపిస్తారని వార్తలొచ్చాయి.[49] జూలై నెలమధ్యలో ఈ సినిమాలో చరణ్ తండ్రిగా నటించడానికి తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన మలయాళ నటుడు రహమాన్ ఎంపికయ్యారని తెలిసింది.[50] మొదటి నుండి వెంకటేష్ ఈ సినిమాలో తన పాత్ర నచ్చక తప్పుకున్నారని కథనాలు వచ్చాయి. దానితో కథలో బలం లేదన్న విమర్శలు, వార్తలు ఎక్కువయ్యాయి. వీటికి వెంకటేష్ జూలై 2014 నెలమధ్యలో స్పందించారు. ఆ సమయంలో విడుదలైన దృశ్యం సినిమాకి సంబంధించిన ఒక టీవీ ఛానలుకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "నా ఇమేజ్‌కు తగిన విధంగా రోల్ లేక పోవడం వల్లనే నేను సినిమా నుండి తప్పుకోవడం జరిగింది. యూనిట్ సభ్యులు కూడా అదే భావించారు. నా స్థానంలో వేరే యాక్టర్‌ను తీసుకోవాలనుకున్నారు. నాకైతే స్క్రిప్టు బాగా నచ్చింది. నా పాత్రలో ఇమడానికి ట్రై చేసాను. గోవిందుడు అందరివాడేలే చిత్రం గొప్ప చిత్రం అవుతుందని" అన్నారు. విడుదలకు ముందే వెంకటేష్ ఈ సినిమాకు మంచి ఫీడ్ బ్యాక్ ఇవ్వడంపై చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు. తద్వారా పుకార్లకు కూడా తెరపడింది.[51] 2014 జూలై 21న కమలినీ ముఖర్జీ వేషధారణకు సంబంధించిన ఫొటో బయటికొచ్చింది. ఆ ఫొటోలో కమలినీ ముక్కుపుడక పెట్టుకుని లగావోణీ వేసుకుని అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించింది.[52] ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు ఎం. ఎస్. నారాయణ నటిస్తున్నాడని అదే సమయంలో తెలిసింది.[53] 2014 జూలై 27న కాజల్ ఈ సినిమాలోని తన గెటప్లలో ఒకదాన్ని బయటపెట్టింది. అందులో తెలుపు నలుపు లంగావోణీ వేసుకుని వడ్డాణం పెట్టుకుని కొంగు చాటున తన నాభిని ప్రదర్శించింది. ఆ ఫొటోలో కాజల్ కూడా తెలుగింటి అమ్మాయిలా కనిపించింది. ఇటువంటి చిత్రాల్లో ఇలాగే వుండాలని తన గెటప్‌ అందరికీ నచ్చుతుందని వ్యాఖ్యానించింది.[54][55] ఇద్దరు కథానాయికల వేషధారణకు మంచి స్పందన లభించింది.[56][57][58] ఆదర్శ్ బాలకృష్ణ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడని 2014 జూలై 30న తెలిసింది.[59] సాక్షి దినపత్రికకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటి ప్రగతి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధల కూతురిగా నటిస్తున్నానని, ఈ సినిమాలో తను కాజల్ అగర్వాల్‌కి తల్లిగా నటిస్తున్నానని స్పష్టం చేసింది.[60]

చిత్రీకరణ

శంషాబాద్ వద్దనున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ సినిమా చిత్రీకరణ ఇక్కడే మొదలయ్యింది.

మొదట షూటింగ్ అక్టోబరు నెల మొదట్లో ప్రారంభిస్తారని వార్తలొచ్చాయి. అక్టోబరు నెల మధ్యలో సినిమాకి సంబంధించిన లొకేషన్లను వెతికే పనులు మొదలయ్యాయి.[61] కానీ ఆపై సినిమా షూటింగ్ నవంబరు నెలకు వాయిదా పడింది.[62] నవంబరు మొదట్లో బండ్ల గణేష్ సినిమా చిత్రీకరణ డిసెంబరు నెల నుంచి మొదలవుతుందని స్పష్టం చేసారు.[63] డిసెంబరు నెల మధ్యలో ఈ సినిమా చిత్రీకరణలో అగ్రభాగం తమిళనాడులోని అనేక ప్రాంతాలతో పాటు పొల్లాచిలో జరుగుతుందని స్పష్టం చేసారు. అందుకోసం కృష్ణవంశీ లొకేషన్లను ఎంపిక చేసుకోడానికి తన టీంతో సహా బయలుదేరారని మీడియాలో వార్తలొచ్చాయి.[64] 2013 తమకు కలిసిరాలేదని భావించడం వల్ల ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో మొదలవుతుందని ఆపై భావించారు.[65] కానీ చివరికి జనవరి నెలమధ్యలో చరణ్ స్వయంగా ఈ సినిమా చిత్రీకరణ 2014 ఫిబ్రవరి 6న హైదరాబాదులో మొదలవుతుందని స్పష్టం చేసాడు.[66] 2014 ఫిబ్రవరి 6న సినిమా ప్రారంభోత్సవములో నాటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాదులో చిత్రీకరణ కొనసాగుతుందని, ఆ తర్వాత తమిళనాడులోని పొల్లాచి, నాగర్ కోయిల్ తదితర ప్రాంతాల్లో జరుగుతుందని మీడియాకు స్పష్టం చేసారు. 2014 ఫిబ్రవరి 6న శంషాబాద్ విమానాశ్రయంలో చిత్రీకరణ మొదలయ్యింది.[67] 2014 ఫిబ్రవరి 9న కాజల్ అగర్వాల్ తన పాత్రకోసం షూటింగ్ మొదలుపెట్టగా ఆ రోజున తనపై, చరణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.[68] అక్కడ చిత్రీకరణ పూర్తయ్యాక మొదట అనుకున్న ప్రణాళిక ప్రకారం తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతంలో చిత్రీకరణ కొనసాగింది.[69] అక్కడ చరణ్, కాజల్, శ్రీకాంత్ మరియూ ముఖ్యతారాగణంపై కుటుంబ సన్నివేశాలను చిత్రీకరించారు.[70] రామేశ్వరం, నాగర్ కోయిల్ తదితర ప్రాంతాల్లో చరణ్, కాజల్ లపై కొన్ని సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరించాక ఫిబ్రవరి నెలచివరన స్కాట్లాండ్, ప్యారిస్, లండన్ వంటి విదేశ ప్రాంతాలలో మే నెల నుంచి చిత్రీకరణ జరుగుతుందని, ఆ షెడ్యూల్లో కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలు, పాటలను చిత్రీకరిస్తారని వెళ్ళడించారు.[71] ఆపై మార్చి నెల చివరి వరకూ కన్యాకుమారి ప్రాంతంలో చిత్రీకరణ జరుగుతుందని వార్తలొచ్చాయి.[72] కేరళలోని కొన్ని అందమైన ప్రాంతాల్లో సైతం షూటింగ్ జరుగుతుందని ప్రకటించాక కన్యాకుమారి షెడ్యూల్లో కొన్ని కుటుంబ మరియూ హాస్య సన్నివేశాలను చిత్రీకరించారు.[73] ఆపై చరణ్, శ్రీకాంత్, మరికొందరు ఫైటర్లపై యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు.[74] ఆపై మార్చి 9 నుంచి 26 వరకూ చిత్రీకరణ పొల్లాచి ప్రాంతంలో కొనసాగుతుందని ప్రకటించారు.[75] అక్కడ ఉడుమలైపెట్టై ప్రాంతంలో కొన్ని వివాహ సన్నివేశాల చిత్రీకరణతో షెడ్యూల్ మొదలయ్యింది. ఆ తర్వాత చరణ్, కాజల్ లపై పొల్లాచిలోని పచ్చని ప్రకృతి ప్రాంతాల్లో ఒక రొమాంటిక్ పాటను తెరకెక్కించారు.[76][77] పచ్చదనం థీంతో ఆ పాట కొనసాగుతుందని వార్తలొచ్చాయి.[78] చిత్రీకరణ పూర్తయ్యాక చరణ్ పొల్లాచిలో కొన్ని యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణలో పాల్గొన్నాడు.[79] పొల్లాచి నుంచి తిరిగొచ్చాక సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో "ఏప్రిల్ రెండో వారం నుంచి హైదరాబాద్‌లోని రామానాయుడు సినీ విలేజ్, రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది. చిత్రప్రధాన తారాగణమంతా పాల్గొంటారు. పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం" అని స్పష్టం చేసారు.[80] ఏప్రిల్ 17న అధికారికంగా ఏప్రిల్ 21 నుంచీ రామానాయుడు స్టూడియోస్ సినీ విలేజ్ భాగంలోని హౌస్ సెట్లో రెండో షెడ్యూల్ 40 రోజులపాటు కొనసాగుతుందని ప్రెస్ నోట్ విడుదలచేసి స్పష్టం చేసారు దర్శకనిర్మాతలు.[81] కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ మే 2 నుంచి మొదలయ్యింది.[82] మే నెల రెండో వారంలో హైదరాబాదు నగర్ శివార్లలో నిర్మించిన ఒక భారీ సెట్లో చరణ్, మరికొందరిపై పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. వీటికి రామ్ – లక్షణ్ నేతృత్వం వహించగా ఆ సన్నివేశాల చిత్రీకరణలో రాజ్ కిరణ్, మిత్ర, కాశీ విశ్వనాథ్ పాల్గున్నారు.[83][84] ప్రధాన తారాగణం పాల్గొన్న కొన్ని కుటుంబ సన్నివేశాల చిత్రీకరణ తర్వాత ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గూడాలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొనసాగింది. రానున్న రోజులలో సినిమాలోని చాలా భాగం ఇక్కడే తీయనున్నారని వార్తలొచ్చాయి.[85] అయితే చరణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతుండటం వల్ల చిత్రీకరణ కొన్ని రోజులు నిలిపివేశారు. అప్పుడు చర‌ణ్‌పైనే కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారని, ఆయ‌న కోలుకొనేవ‌ర‌కు సినిమా ఆపేయాల‌ని చిత్రబృందం నిర్ణయించిందని వార్తలొచ్చాయి. చరణ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.[86] వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం, అయ్యప్ప స్వామి దీక్షలో ఉండటం చేత అల్పాహారంపై మాత్రమే జీవిస్తూ బలహీన పడటం ఈ జ్వరానికి గల కారణాలని వార్తలొచ్చాయి.[87]

దక్షిణ జోర్డాన్ ప్రాంతంలోని పెట్రా నగరం. ఇక్కడ చరణ్, కాజల్ లపై ఒక పాటను చిత్రీకరించారు.

మే 28న ప్రెస్ నోట్ విడుదల చేసి ఈ సినిమా చిత్రీకరణ జూన్ 5 నుంచీ హైదరాబాదులో నిర్మించిన ఇంటి సెట్లో కుటుంబ నేపథ్య సన్నివేశాలు మొత్తం తెరకెక్కించాక చిత్రబృందం లండన్ వెళ్తుందని బండ్ల గణేష్ స్పష్టం చేసారు.[88] ఆ తర్వాత జూన్ 2014 నెలమధ్యలో హైదరాబాదులో ఇప్పటికే ఒక మాంటేజ్ పాట చిత్రీకరణ పూర్తయ్యిందని, మిగిలిన చిత్రీకరణ 2014 జూలై 31 వరకూ జరుగుతుందని స్పష్టం చేసిన బండ్ల గణేష్ లండన్ నగరంలో కొన్ని సన్నివేశాలు, పాటలు 2014 ఆగస్టు 1 నుంచి 2014 ఆగస్టు 15 వరకూ చిత్రీకరిస్తామని స్పష్టం చేసారు. తద్వారా 2014 ఆగస్టు 15న షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వ్యాఖ్యానించారు.[89] జూన్ 18న ఒక షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్రబృందం అప్పటివరకూ జరిగిన షెడ్యూల్లో 2 పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించగా తదుపరి షెడ్యూల్ జూన్ 21 నుంచి మొదలవుతుందని వార్తలొచ్చాయి.[90] జూన్ నెలమధ్యలో రామ్‌ - లక్ష్మణ్‌ సారథ్యంలో లారీని తరుముతుండగా దాని కొక్కేనికి తగిలి ఈడ్చుకుంటూ వెళ్లే సన్నివేశం చిత్రీకరించారు. కొన్నిచోట్ల ఎగిరి దూకే సన్నివేశాలలో చిన్నవాటికి చరణ్ నేరుగా దూకగా, మిగిలిన వాటిని ఫైటర్లతో రామ్‌ - లక్ష్మణ్‌లు చేయించారు.[91] జూన్ నెలచివర్లో అద్దాలను అమర్చిన ఒక ప్రత్యేక సెట్లో ఒక పాటను చరణ్, కాజల్ లపై చిత్రీకరించారు.[92] లండన్ వెళ్ళక ముందు పొల్లాచిలో 2014 జూలై 13 నుండి పదిరోజులు వరకూ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనుకున్నా అనివార్య కారణాల వల్ల ఆలస్యమై పొల్లాచిలో చిత్రీకరణ అయితే 2014 జూలై 20 లేదా ఆ తర్వాత మొదలుపెట్టాలని దర్శకనిర్మాతలు భావించారు. అప్పటివరకూ చిత్రీకరణ హైదరాబాదులో కొనసాగింది.[93][94] 2014 జూలై 21న మొదలైన పొల్లాచి షెడ్యూల్ 2014 జూలై 28న విజయవంతంగా పూర్తయ్యింది.[95] తదుపరి షెడ్యూల్ 2014 జూలై 29న కారైకుడి ప్రాంతంలో మొదలై 2014 ఆగస్టు 3 నుండి హైదరాబాదులో కొనసాగింది.[96][97] రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకథాటిగా చిత్రీకరణ జరుపుకున్నాక బండ్ల గణేష్ లండన్ నగరంలో ఆగస్టు 24 నుంచి చరణ్‌పై ఒక సోలో పాట, జోర్డాన్ నగరంలో చరణ్-కాజల్‌పై డ్యూయెట్ తెరకెక్కించి హైదరాబాదు తిరిగొచ్చాక 3 రోజులు షూటింగ్ జరిపితే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని స్పష్టం చేసారు.[98][99][100] ఆ షెడ్యూల్ 2014 ఆగస్టు 25న మొదలై 2014 సెప్టెంబరు 12న ముగిసింది.[101] ఆ తర్వాత హైదరాబాదులో ఒక పాటను కూడా చిత్రీకరించారు.[102] సినిమా చిత్రీకరణ 2014 సెప్టెంబరు 22న ముగీంది. ఇదే విషయాన్ని కృష్ణవంశీ తర్వాత ఖరారు చేసారు.[103][104]

నిర్మాణానంతర కార్యక్రమాలు

ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జూలై 2014 నెలమధ్యలో శబ్దాలయా స్టూడియోస్ లో లాంచనంగా ప్రారంభమయ్యాయి. మొదట ఈ సినిమాలో నటించిన నటీనటులు డబ్బింగ్ చెప్పిన తర్వాత చరణ్ డబ్బింగ్ చెప్పనున్నాడని తెలిసింది.[105] 2014 ఆగస్టు 26 ఉదయం 9:00 గంటలకు యువన్ శంకర్ రాజా చెన్నైలో ఉన్న తన స్టూడియోలో ఈ సినిమా రీ-రికార్డింగ్ పనులను మొదలుపెట్టారు. లండన్ నుంచి తిరిగొచ్చాక చరణ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెడతాడని తెలిసింది.[106] 2014 సెప్టెంబరు 9న ప్రకాష్ రాజ్ తన పాత్రకు డబ్బింగ్ మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజే శ్రీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తిచేసారు.[107] లండన్ నగరంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చరణ్ కోరిక మేరన చిరంజీవి దగ్గరుండి సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నానని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.[108] సినిమా ఫస్ట్ కాపీ సెన్సార్ బోర్డ్ స్క్రీనింగ్ 2014 సెప్టెంబరు 26న జరుగనుందని తెలిసింది.[109] 2014 సెప్టెంబరు 24న చరణ్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసాడు.[110][111] సెప్టెంబరు 26న సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.[112] సెన్సార్ బోర్డ్ వారు ఈ క్రింది మార్పులు, తొలగింపులు చేసి ఈ సర్టిఫికెట్ జారీ చేసారు. 1. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. లేదా జంతువులు ఉన్న విజువల్స్ కట్ చేయాలి. (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సబ్ మిట్ చేసారు) 2. 1,2, 110 వ సీన్స్ లో శ్రీకాంత్ మందు కొట్టే సీన్స్ లో లిక్కర్ బాటిల్ బ్రాండ్ లేబుల్ కనపడుతోంది. దాన్ని తీసేయాలి. 2 (vi),2 (v) లలో శ్రీకాంత్ సిగెరెట్ కాల్చేటప్పుడు చట్టబద్దమైన హెచ్చరికను వేయాలి. 3. ‘పిచ్చి నాకొడకా, దొబ్బించుకో, నీ యమ్మ, నీ అయ్య, నీ యబ్బ, గోకుతున్నాడు, గోకాడు, దీనమ్మ, నో స్కూ, స్కూ డ్రైవర్ లను తొలిగించాలి /మ్యూట్ చేయాలి 4. a) హీరోయిన్ బ్లౌజ్ బటన్ ని హీరో విప్పుతున్నప్పుడు వీపు వెనక భాగం నగ్నంగా కనపడుతూ ఉంది. దాన్ని డిలీట్ చేయాలి (9 సెకన్లు) b) చిత్ర బ్యాక్ న్యూడిటీ కనపడే సీన్స్ ని డిలీట్ చేయాలి (5 సెకన్లు) c) రా రాకుమారా పాటలో హీరోయిన్ క్రాస్ లెగ్ తో కూర్చునన్నప్పుడు కనపడే ధైస్ ఎక్సపోజింగ్ ని తొలిగించాలి. (సేమ్ డ్యూరేషన్ కి ఎప్రూవుడ్ షాట్స్ తో ఫిల్ చేయాలి) (7 సెకన్లు) d) హీరోయిన్ తన బ్రెస్ట్స్ తో హీరోని గట్టిగా తగిలే సీన్స్ తొలిగించాలి (రెండు షాట్స్) (సేమ్ డ్యూరేషన్ కి ఎప్రూవెడ్ షాట్స్ తో ఫిల్ చేయాలి) (6 సెకన్లు).[113]

సంగీతం

అభివృద్ధి

సాధారణంగా కృష్ణవంశీ సినిమాలంటే సంగీత, సాహిత్యాలకు నిలయంగా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో వచ్చిన ఆయన సినిమాల్లోని పాటలు ఆ స్థాయిలో లేవని విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే కృష్ణవంశీ తీసుకున్న జాగ్రత్తలు గమనించాక ఈ సినిమా సంగీత దర్శకుడెవరనే దానిపై చాలా కాలం ఆసక్తికర చర్చలు జరిగాయి.[114] 2014 జనవరి 9 అనగా రాం చరణ్ తేజ నటించిన నాయక్ సినిమా విడుదలయిన ఏడాది తర్వాత అదే సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసిన ఎస్. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా నియమించబడ్డాడని ప్రకటించారు. కృష్ణవంశీ ఇనిమాకి సంగీతం అందించడం తమన్ కి ఇది తొలిసారి.[115] ఏప్రిల్ నెలమధ్యలో తమన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని, అతని స్థానంలో ఇళయరాజా గారి అబ్బాయి, ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అతని స్థానాన్ని భర్తీ చేస్తున్నాడని వార్తలొచ్చాయి.[116] సరైన కారణం తెలియకపోయినా కృష్ణవంశీకి, తమన్ కి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు, గతకొంతకాలంగా తమన్ కొత్త తరహా బాణీలు కూర్చడంలో విఫలమవ్వడం దీనికి గల కారణమని వార్తలొచ్చాయి.[117] యువన్ ఒక కృష్ణవంశీ సినిమాకి పనిచెయ్యడం ఇదే తొలిసారి. చరణ్ సినిమాకి కూడా పనిచెయ్యడం యువన్ శంకర్ రాజాకి ఇది మొదటిసారి.[118] ఏప్రిల్ నెలచివర్లో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ సినిమాలోని ఆడవారి మాటలకు అర్థాలే వేరులే పాటను రీమిక్స్ చెయ్యనున్నారని, హీరో హీరోయిన్ ని ఏడిపించే సందర్భంలో ఈ పాట వస్తుందని వార్తలొచ్చాయి.[119] వేసవిలో షూటింగుకి కాస్త విరామం ఇచ్చినప్పుడు ఆ విరామంలో యువన్ మూడు పాటలను రికార్డ్ చేసారు.[120] సుద్దాల అశోక్ తేజ, శ్రీ మణి ఈ సినిమాలో పాటలను రచించారని జూన్ 2014 నెలమధ్యలో తెలిసింది.[121] "గత ఐదేళ్లుగా యువన్ శంకర్ రాజా కోసం ఎదురు చూస్తున్నాను. చివరికి ఈ సినిమాకి కుదిరింది. ఇళయరాజా గారబ్బాయి యువన్, చిరంజీవి గారబ్బాయి చరణ్‌లతో కలిసి పనిచేసిన తొలి దర్శకుణ్ణి బహుశా నేనే. ఇళయరాజా గారు మేస్ట్రో అయితే, యువన్‌ శంకర్‌ రాజా మాస్టర్. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు" అని కృష్ణవంశీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో యువన్ అందించిన సంగీతాన్ని కొనియాడారు.[122][123]

పాటల జాబితా

నెం. పాట గాయకులు రచయిత నిడివి
1 నీలిరంగు చీరలోనా హరిహరన్ సుద్దాల అశోక్ తేజ 04:48
2 గులాబి కళ్ళు రెండు ముళ్ళు జావెద్ అలీ శ్రీ మణి 04:26
3 రా రాకుమారా చిన్మయి సిరివెన్నెల సీతారామశాస్త్రి 03:44
4 ప్రతిచోటా నాకే స్వాగతం రంజిత్ రామజోగయ్య శాస్త్రి 03:44
5 బావగారి చూపే రంజిత్, విజయ్ ఏసుదాస్, సుర్ముకి, శ్రీవర్ధిని చంద్రబోస్ 04:10
6 కొక్కొక్కోడి కార్తిక్, హరిచరణ్, మానసి, రీట లక్ష్మీ భూపాల్ 04:19

విడుదల

జులై నెలమధ్యలో ఈ సినిమా పాటలను 2014 ఆగస్టు 20న విడుదల చేస్తారని వార్తలొచ్చాయి.[124] కానీ ఆ తర్వాత బండ్ల గణేష్ ఈ సినిమా పాటలను 2014 సెప్టెంబరు 15న భారీ ఎత్తున హైదరాబాదులో విడుదల చేస్తామని స్పష్టం చేసారు.[125][126] చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఆడియో సీడీలను విడుదల చెయ్యనున్నారని తెలిసింది.[127] సెప్టెంబరు 15న పాటలను విడుదల చేస్తున్నామని సెప్టెంబరు 8న ఒక ప్రెస్ నోట్ ద్వారా బండ్ల గణేష్ స్పష్టం చేసారు.[128][129][130] సెప్టెంబరు 15 రాత్రి హైదరాబాదులోని శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో కోలాహలంగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి ఆడియో సీడీలను ఆవిష్కరించగా, తొలి ప్రతిని సీనియర్‌ డైరెక్టర్‌ కె.రాఘవేంద్రరావు స్వీకరించారు.[131]

స్పందన

యువన్ శంకర్ రాజా అందించిన పాటలకు, వాటిలోని సాహిత్యానికి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. మంగు రాజా తమ సమీక్షలో "ఒక్కటి మాత్రం నిజం. టోటల్ గా చూసుకుంటే పాటల సాహిత్యం ముందు ట్యూన్ లు కొంత తేలిపోయాయనిపిస్తుంది. కాకపోతే - కృష్ణవంశీ సినిమాల్లో ఆడియో రిలీజ్ అయిన వెంటనే కలిగే అభిప్రాయం - సినిమాలో ఆయన చిత్రీకరణ చూశాక మరో పాతిక పర్సంట్ పెరిగి పాటలు నిలబడిపోయిన అనుభవాలు గతంలో చాలా వున్నాయి. ఈ సినిమా పాటలు కూడా అలా ప్రజాదరణ పొందితే సంతోషమే - ఎందుకంటే ఇయర్ డ్రమ్స్ పగిలిపోయే మ్యూజిక్ ఇందులో లేదు కనుక" అని వ్యాఖ్యానించారు.[132] 123తెలుగు.కామ్ తమ సమీక్షలో "‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అచ్చ తెలుగు సంప్రదాయాలతో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం. కావున యువన్ శంకర్ రాజా కూడా కథానుగుణంగా, కృష్ణవంశీ చెప్పిన సందర్భాలకు సరిపోయే విధంగా పాటలని కంపోజ్ చేసాడు. చెప్పాలంటే ఇలాంటి తరహా పాటలు చేయడం యువన్ కి ఇదే మొదటిసారని కూడా చెప్పవచ్చు. అయినప్పటికీ తను మెలోడియస్ గా కంపోజ్ చేసి తన పాటలతో ఆకట్టుకున్నాడు. కృష్ణవంశీ ఇలాంటి పాటలని తీయడంలో తన కంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఈ పాటలు వినేటప్పటి కంటే స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు" అని వ్యాఖ్యానించారు.[133] టాలీవుడ్.నెట్ తమ సమీక్షలో "మొత్తమ్మీద అన్ని పాటలు కూడా మెలోడీ గా సాగుతూ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఈ మద్య వస్తున్న రణగొణ ధ్వనులు ఏమి లేకుండా శ్రావ్యమైన సంగీతాన్ని ఈ ఆల్బం లో వినొచ్చు" అని వ్యాఖ్యానించారు.[134]

విడుదల

మే 2014 నెలమధ్యలో ఈ సినిమా మహేశ్ బాబు నటించిన ఆగడు సినిమాతో పాటు 2014 సెప్టెంబరు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలచెయ్యాలనుకున్నారని వార్తలొచ్చాయి.[135] అయితే షూటింగ్ మధ్యలో రాం చరణ్ తేజ అనారోగ్యం వల్ల ఆగిపోయింది. దానితో సినిమా విడుదల వాయిదా పడనుందని వార్తలొచ్చాయి.[136] మే నెలచివర్లో ఈ సినిమా దసరా కానుకగా 2014 అక్టోబరు 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి.[137] ఆ వార్తలను ఖరారు చేస్తూ నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాని 2014 అక్టోబరు 1 ఉదయం 5 గంటల 15 నిమిషాలకి ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేస్తామని ఒక ప్రెస్ మీట్లో స్పష్టం చేసారు.[138] రాం చరణ్ కూడా ఈ సినిమా 2014 అక్టోబరు 1న విడుదలవుతుందని, ఇది తన తొలి దసరా విడుదల అని తన ఫేస్ బుక్లో పోస్ట్ చేసాడు.[139] ప్రపంచవ్యాప్తంగా 1800 నుండి 2000 థియేటర్లలో ఈ సినిమాని విడుదల చెయ్యనున్నామని బండ్ల గణేష్ స్పష్టం చేసారు.[140] అమెరికాలో 2014 సెప్టెంబరు 30న 97 స్క్రీన్లలో విడుదలవ్వడం వల్ల ఈ సినిమా చరణ్ కెరియర్లో అతిపెద్ద విడుదలగా పేరొందింది.[141] విదేశాలకు మరియూ ప్రాంతీయ థియేటర్లకు వెళ్ళాల్సిన అన్ని ప్రింట్స్ వెళ్ళిపోయాయి. అన్ని ప్రాంతాల్లోనూ వేయనున్న ప్రీమియర్ షోలకు అనుమతులు తీసుకున్నారు. చివరి నిమిషం వరకూ పంపిణీదారులు మరియూ ఆర్థిక సమస్యలు లేకుండా అన్నిటినీ తీర్చేసారు.[142] ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2014 అక్టోబరు 1న విడుదలైనా ఒక్క చెన్నై నగరంలో నాటి ముఖ్యమంత్రి జయలలిత అరెస్ట్ వల్ల జరిగిన విధ్వంసాల వల్ల 2014 అక్టోబరు 3న విడుదలయ్యింది.[143]

ప్రచారం

ఫిబ్రవరి నెలాఖరున ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టరును రాం చరణ్ పుట్టినరోజయిన మార్చి 27న విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు.[144] మార్చి నెలమధ్యలో చరణ్ ఎడ్లబండి మీద నిలబడి, తలపాగా కట్టుకుని, రైతుబిడ్డలా ఆ కొత్త పోస్టరులో కనిపిస్తాడని ప్రచారం మొదలయ్యింది.[145] ప‌నిలో ప‌నిగా టీజ‌ర్‌ని కూడా విడుద‌ల చేయాల‌నుకొన్నా, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా లేద‌ని, ఇంకోసారి విడుదల చేద్దామ‌ని దర్శకనిర్మాతలు భావించారు అని వార్తలొచ్చాయి.[146] మార్చి 26న ఇంటర్నెట్ లోకి అధికారికంగా చరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. విడుదలయిన 4 స్టిల్స్ లో చరణ్ పంచెకట్టుతో మోడ్రన్ రైతులాగా కనిపించాడు.[147] ఆ ఫస్ట్ లుక్ స్టిల్స్ కి భారీ సానుకూల స్పందన లభించింది.[148] ఏప్రిల్ 28న, మే 19న కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి.[149][150] 2014 జూన్ 14న ఈ సినిమాకి సంబంధించిన 6 వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి.[151][152] జూలై 2014 రెండో వారంలో ఈ సినిమా టీజర్ కృష్ణవంశీ పుట్టినరోజు సందర్భంగా 2014 జూలై 28న విడుదలచేస్తామని బండ్ల గణేష్ స్పష్టం చేసారు.[153] టీజర్ 2014 మే 29న రంజాన్ కానుకగా రామానాయుడు స్టూడియోస్ లో చిరంజీవి ముఖ్య అతిథిగా అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారని తర్వాత తెలిసింది.[154] అనివార్య కారణాల వల్ల ఆ రోజు విడుదలవ్వని టీజర్ 2014 ఆగస్టు 7 రాత్రి 7:30కి రామానాయుడు స్టూడియోస్ లోపల నిర్మించిన ఇంటి సెట్ దగ్గర పరుచూరి వెంకటేశ్వరరావు విడుదలచేసారు. కృష్ణవంశీ, చరణ్, కాజల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.[155] టీజరుకు అపూర్వ స్పందన లభించింది.[156] పాటల విడుదల తేదీని 2014 సెప్టెంబరు 15గా ఖరారు చేస్తూ కొన్ని స్టిల్స్ కూడా విడుదల చేసారు.[157] శిల్పకళావేదికలో ఆడియో విడుదల సందర్భంగా ప్రచార చిత్రాల్ని చరణ్ తల్లి సురేఖ, భార్య ఉపాసన విడుదల చేశారు.[158] 2014 అక్టోబరు 1 ఉదయం 5:18 గంటలకు విడుదలవుతోందని స్పష్టం చేస్తూ 3 పోస్టర్లను విడుదల చేసారు.[159]

పంపిణీ

జులై 2014 నెలమధ్యలో ఈ సినిమా సీడెడ్ ప్రాంతం పంపిణీ హక్కులను ఆ ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి 8.1 కోట్లుకు తీసుకున్నట్లు తీసుకున్నారు. అప్పట్లో ఇంత బిజినెస్ చేసిన చరణ్ సినిమాల్లో ఇదే ప్రథమ స్థానంలో నిలిచింది.[160] నైజాం ప్రాంతం హక్కులను దిల్ రాజు, నెల్లూరు ప్రాంతం హక్కులను హరి పిక్చర్స్, విశాఖ ప్రాంతం హక్కులను భరత్ పిక్చర్స్ భారీ మొత్తాలను చెల్లించి సొంతం చేసుకున్నారు.[161] ఓవర్సీస్ హక్కులను ఏషియన్ మూవీస్ సంస్థ సొంతం చేసుకుందని 2014 ఆగస్టు 17న తెలిసింది.[162] ఎన్.ఆర్.ఏ క్రియేషన్స్ ఈ సినిమా గుంటూరు ప్రాంతం హక్కులను 4 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నట్టు తెలిసింది.[163] నైజాం, కృష్ణ ప్రాంతాల్లో బండ్ల గణేష్ ఈ సినిమాని సొంతంగా విడుదల చేసారు.[164]

మూలాలు

  1. 1.0 1.1 "గోవిందుడు అందరివాడేలే రివ్యూ". ఫిలింసర్కిల్.కామ్. 27 September 2014. Archived from the original on 4 అక్టోబరు 2014. Retrieved 28 September 2014.
  2. ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. Archived from the original on 13 మార్చి 2020. Retrieved 13 March 2020.
  3. "గోవిందుడి నిడివి 2గంటల 29నిముషాలు". 123తెలుగు.కామ్. 27 September 2014. Retrieved 28 September 2014.
  4. "'గోవిందుడు అందరి వాడేలే' అంటున్న రామ్ చరణ్". 123తెలుగు.కామ్. 27 March 2014. Retrieved 27 March 2014.
  5. "మహేష్ హిట్ చిత్రం టైప్ కథతో రామ్ చరణ్". వన్ఇండియా. 10 February 2014. Retrieved 16 March 2014.[permanent dead link]
  6. "ప్రకాశ్‌రాజ్‌ ఈ కాలపు ఎస్వీఆర్‌". ఆంధ్రజ్యోతి. 29 September 2014. Retrieved 30 September 2014.[permanent dead link]
  7. "చరణ్ సినిమా ముహూర్తం". ఇండియాగ్లిట్స్. 13 January 2014. Retrieved 16 March 2014.
  8. "ఉదయం 05.18 గంటలకు 'గోవిందుడు..'గా రామ్ చరణ్". 123తెలుగు.కామ్. 25 September 2014. Retrieved 27 September 2014.
  9. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
  10. 10.0 10.1 "రామ్ చరణ్ తో మరో మల్టిస్టారర్...డిటేల్స్". వన్ఇండియా. 8 August 2013. Retrieved 16 March 2014.[permanent dead link]
  11. "అంతర్వేది ఆలయంలో సినీ ప్రముఖుల సందడి". ఆంధ్రజ్యోతి. 12 December 2013. Retrieved 16 March 2014.[permanent dead link]
  12. "గోవిందుడు అందరి వాడేలే?". సాక్షి దినపత్రిక. 22 January 2014. Retrieved 16 March 2014.
  13. "పుకార్లను కొట్టిపారేసిన కృష్ణ వంశీ". 123తెలుగు.కామ్. 23 January 2014. Retrieved 16 March 2014.
  14. "చరణ్ - కృష్ణవంశీ ల చిత్రం షురూ". ఇండియాగ్లిట్స్. 6 February 2014. Retrieved 16 March 2014.
  15. "చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుందో?". గల్ట్.కామ్. 12 March 2014. Archived from the original on 15 మార్చి 2014. Retrieved 16 March 2014.
  16. "'విజేత'గా.. రామ్ చరణ్". ఆంధ్రప్రభ. 13 March 2014. Retrieved 16 March 2014.[permanent dead link]
  17. "గోవిందుడు అందరివాడేలే." ప్రజాశక్తి. 16 March 2014. Retrieved 17 March 2014.
  18. "రామ్ చరణ్,కృష్ణవంశీ చిత్రంకి టైటిల్ ఖరారు". వన్ఇండియా. 27 March 2014. Retrieved 27 March 2014.[permanent dead link]
  19. "'గోవిందుడు అందరి వాడేలే' బాపుకు అంకితం". తెలుగువన్. 25 September 2014. Archived from the original on 28 సెప్టెంబరు 2014. Retrieved 25 September 2014.
  20. "బాపుకి అంకితమిస్తున్నారు". వన్ఇండియా. 30 September 2014. Retrieved 30 September 2014.
  21. "దసరాకు దూకుతున్నాం... 8 సెంటిమెంట్ అధిగమిస్తా... రాంచరణ్ ఇంటర్వ్యూ". వెబ్ దునియా. 29 September 2014. Archived from the original on 3 అక్టోబరు 2014. Retrieved 30 September 2014.
  22. "తుఫాన్: మెగాస్టార్ స్థానంలో వెంకటేష్ అందుకేనా?". వన్ఇండియా. 28 August 2013. Retrieved 16 March 2014.[permanent dead link]
  23. "నయనతారకు దర్శకుడి పిలుపు, ఒప్పుకుంటుందా?". వన్ఇండియా. 19 October 2013. Retrieved 16 March 2014.[permanent dead link]
  24. "ఆంటీగా అగ్ర హీరోయిన్...?". ఇండియాగ్లిట్స్. 19 October 2013. Retrieved 16 March 2014.
  25. "సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఏమిటి?". ఏపీహెరాల్డ్.కామ్. 10 December 2013. Archived from the original on 12 ఫిబ్రవరి 2014. Retrieved 16 March 2014.
  26. "రామ్ చరణ్‌కు తాతగా 'పందెం కోడి'రాజ్ కిరణ్ ఖరారు". వెబ్ దునియా. 22 November 2013. Archived from the original on 30 జనవరి 2014. Retrieved 16 March 2014.
  27. "చరణ్ – వెంకీల కోసం దిగివస్తున్న వై.ఎస్.ర్ !". ఏపీహెరాల్డ్.కామ్. 17 November 2013. Archived from the original on 3 ఫిబ్రవరి 2014. Retrieved 16 March 2014.
  28. "రామ్ చరణ్ కోసం గ్రామీణ తెలుగు అమ్మాయి". వన్ఇండియా. 21 November 2013. Archived from the original on 24 నవంబరు 2013. Retrieved 16 March 2014.
  29. "చరణ్ మల్టీ స్టారర్ సినిమా లేదా..?". ఇండియాగ్లిట్స్. 28 October 2013. Retrieved 16 March 2014.
  30. "రామ్ చరణ్ తో ఇలియానా?". ఇండియాగ్లిట్స్. 12 December 2013. Retrieved 16 March 2014.
  31. "రామ్ చరణ్ సరసన తెలుగుమ్మాయి చాందినీ చౌదరి!". వన్ఇండియా. 5 December 2013. Archived from the original on 7 డిసెంబరు 2013. Retrieved 16 March 2014.
  32. "చెర్రీకి తమన్నా గ్రీన్ సిగ్నల్". ఇండియాగ్లిట్స్. 19 December 2013. Retrieved 16 March 2014.
  33. "రెండు భారీ ఆఫర్స్ తో తిరిగిరానున్న కాజల్ అగర్వాల్". 123తెలుగు.కామ్. 30 December 2013. Retrieved 16 March 2014.
  34. "ముచ్చటగా మూడోసారి". ఇండియాగ్లిట్స్. 31 December 2013. Retrieved 16 March 2014.
  35. "రామ్ చరణ్‌కు యంగ్‌ బాబాయిగా శ్రీకాంత్". వెబ్ దునియా. 3 January 2014. Archived from the original on 9 జనవరి 2014. Retrieved 16 March 2014.
  36. "రామ్ చరణ్‌కు పిన్నిగా.. కమలినీ ముఖర్జీ". ఆంధ్రప్రభ. 19 January 2014. Retrieved 14 March 2014.[permanent dead link]
  37. "రామ్ చరణ్ కు తండ్రిగా నాగార్జున చేస్తాడా?". తెలుగువిశేష్.కామ్. 11 February 2014. Archived from the original on 24 జూన్ 2016. Retrieved 16 March 2014.
  38. "చెర్రీ తండ్రి కోసం వేట!". హలోఆంధ్ర. 16 February 2014. Retrieved 16 March 2014.[permanent dead link]
  39. "'వైవా' హర్ష కి రామ్ చరణ్ బ్రేక్ ఇస్తాడా?". వన్ఇండియా. 14 February 2014. Retrieved 16 March 2014.[permanent dead link]
  40. "కృష్ణ వంశీ చిత్రంలో రామ్ చరణ్ క్యారెక్టర్,లుక్". వన్ఇండియా. 16 February 2014. Retrieved 16 March 2014.[permanent dead link]
  41. "పోనీటెయిల్‌ ఎన్నారై". సూర్య దినపత్రిక. 12 February 2014. Retrieved 14 March 2014.[permanent dead link]
  42. "రామ్ చరణ్ తండ్రి పాత్రలో.. జగపతిబాబు". ఆంధ్రప్రభ. 23 March 2014. Retrieved 25 March 2014.[permanent dead link]
  43. "పంచ కట్టులో కనువిందు చేయనున్న రామ్ చరణ్". 123తెలుగు.కామ్. 24 March 2014. Retrieved 25 March 2014.
  44. "చ‌ర‌ణ్‌కి `నో` చెప్పిన జ‌గప‌తిబాబు!". గల్ట్.కామ్. 26 March 2014. Archived from the original on 29 మార్చి 2014. Retrieved 26 March 2014.
  45. "రామ్‌చరణ్‌కు తాతగా..." సాక్షి. 25 May 2014. Retrieved 25 May 2014.
  46. "రామ్ చరణ్ కి తాతయ్యగా ప్రకాష్ రాజ్". 123తెలుగు.కామ్. 25 May 2014. Retrieved 25 May 2014.
  47. "మరోసారి సహజనటితో." ఇండియాగ్లిట్స్. 28 May 2014. Retrieved 28 May 2014.
  48. "చిరంజీవిగారు ఈ సినిమా ఆపేయమనలేదు: నిర్మాత బండ్ల గణేశ్". సాక్షి. 15 June 2014. Retrieved 15 June 2014.
  49. "రామ్ చరణ్ కి సైతం జగపతిబాబే". వన్ఇండియా. 18 June 2014. Retrieved 18 June 2014.[permanent dead link]
  50. "రామ్ చరణ్ తండ్రి పాత్రలో రహమాన్". వన్ఇండియా. 12 July 2014. Retrieved 13 July 2014.[permanent dead link]
  51. "వీక్ కాదు: రామ్ చరణ్ సినిమాపై వెంకీ కామెంట్". వన్ఇండియా. 16 July 2014. Retrieved 18 July 2014.[permanent dead link]
  52. "'గోవిందుడు అందరివాడేలే'లో కమిలిని గెటప్(ఫొటో)". వన్ఇండియా. 21 July 2014. Retrieved 28 July 2014.[permanent dead link]
  53. "ఎమ్.ఎస్.నారాయణ గిన్నిస్ రికార్డ్". తెలుగువన్. 25 July 2014. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 28 July 2014.
  54. "'గోవిందుడు అందరివాడేలే' లో కాజల్ లుక్ ఇదీ(ఫొటో)". వన్ఇండియా. 27 July 2014. Retrieved 28 July 2014.[permanent dead link]
  55. "గోవిందుడు అందరివాడేలే: పిలకతో రామ్‌చరణ్‌, ఓణీతో కాజల్‌!". వెబ్ దునియా. 28 July 2014. Archived from the original on 29 జూలై 2014. Retrieved 28 July 2014.
  56. "లంగాఓణీలో విరిసిన కమలినీ". ఎక్స్‌ప్రెస్ టీవీ. 23 July 2014. Retrieved 28 July 2014.[permanent dead link]
  57. "'గోవిందుడి' భామ అదరహో". ఎక్స్‌ప్రెస్ టీవీ. 28 July 2014. Retrieved 28 July 2014.[permanent dead link]
  58. "కుందనపు బొమ్మలా గోవిందుడి రాధ". తుపాకి.కామ్. 28 July 2014. Archived from the original on 31 జూలై 2014. Retrieved 28 July 2014.
  59. "'గోవిందుడు..'లో రామ్ చరణ్ విలన్ అతడే..!". 123తెలుగు.కామ్. 30 July 2014. Retrieved 30 July 2014.
  60. "హీరోయిన్‌గా చేయమనగానే...నాలో దిగులు మొదలైంది!". సాక్షి. 17 August 2014. Retrieved 19 August 2014.
  61. "లొకేషన్ల వేటలో వెంకీ – రామ్ చరణ్ ల చిత్రం". 123తెలుగు.కామ్. 11 October 2013. Retrieved 16 March 2014.
  62. "వచ్చే నెల నుండి ప్రారంభంకానున్న వెంకటేష్, చరణ్ ల మల్టీ స్టారర్ సినిమా". 123తెలుగు.కామ్. 22 October 2013. Retrieved 16 March 2014.
  63. "డిసెంబర్ నుచి సెట్స్ ప్పైకి వెళ్లనున్న వెంకీ – రామ్ చరణ్ మూవీ". 123తెలుగు.కామ్. 1 November 2013. Retrieved 16 March 2014.
  64. "పొల్లాచిలో షూట్ చెయ్యనున్న రామ్ చరణ్ – కృష్ణవంశీ ల సినిమా". 123తెలుగు.కామ్. 19 December 2013. Retrieved 16 March 2014.
  65. "మెగా నెలగా మారబోతున్న జనవరి!". ఏపీహెరాల్డ్.కామ్. 4 December 2013. Archived from the original on 9 ఫిబ్రవరి 2014. Retrieved 16 March 2014.
  66. "ఫిబ్రవరి 6నుండి కృష్ణవంశీ సినిమాలో పాల్గొనున్న రామ్ చరణ్". 123తెలుగు.కామ్. 11 January 2014. Retrieved 16 March 2014.
  67. "హైదరాబాద్ లో రామ్ చరణ్ సినిమా". ఇండియాగ్లిట్స్. 10 February 2014. Retrieved 16 March 2014.
  68. "రామ్ చరణ్ టీంతో జత కలిసిన కాజల్". 123తెలుగు.కామ్. 9 February 2014. Retrieved 16 March 2014.
  69. "రామేశ్వరం చేరిన చరణ్ సినిమా". తెలుగువన్. 18 February 2014. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 16 March 2014.
  70. "రామేశ్వరంలో రామ్‌చరణ్‌ రచ్చ". వన్ఇండియా. 19 February 2014. Retrieved 16 March 2014.[permanent dead link]
  71. "విదేశాలకు వెళ్తున్న రామ్ చరణ్." ఇండియాగ్లిట్స్. 25 February 2014. Retrieved 16 March 2014.
  72. "ఈ నెలాఖరు వరకు కన్యాకుమారి ఉండనున్న రామ్ చరణ్ టీం". 123తెలుగు.కామ్. 2 March 2014. Retrieved 16 March 2014.
  73. "రామ్‌చరణ్‌,కృష్ణ వంశీ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో". వన్ఇండియా. 3 March 2014. Retrieved 16 March 2014.[permanent dead link]
  74. "పోరాటాలు చేస్తున్న చరణ్." ఇండియాగ్లిట్స్. 6 March 2014. Retrieved 16 March 2014.
  75. "26 వరకూ కొబ్బరి చెట్ట క్రిందే రామ్ చరణ్". వన్ఇండియా. 14 March 2014. Retrieved 16 March 2014.[permanent dead link]
  76. "పొల్లాచ్చిలో చరణ్, కాజల్... ప్రకృతిఅందాల నడుమ రొమాన్స్!". వెబ్ దునియా. 14 March 2014. Archived from the original on 18 మార్చి 2014. Retrieved 16 March 2014.
  77. "పొల్లాచ్చిలో చరణ్ కాజల్ రొమాన్స్". తెలుగువన్. 14 March 2014. Archived from the original on 17 మార్చి 2014. Retrieved 16 March 2014.
  78. "పొల్లాచిలో రామ్ చరణ్ పాట షూటింగ్". 123తెలుగు.కామ్. 14 March 2014. Retrieved 16 March 2014.
  79. "యాక్షన్ సన్నివేశాలలో పాల్గుంటున్న చరణ్". 123తెలుగు.కామ్. 21 March 2014. Retrieved 21 March 2014.
  80. "రామ్‌చరణ్ గోవిందుడు అందరివాడేలే". ఆంధ్రప్రభ. 27 March 2014. Retrieved 27 March 2014.[permanent dead link]
  81. "ఏప్రిల్ 21 నుండి 'గోవిందుడు అందరివాడేలే' సెకండ్ షెడ్యుల్". 123తెలుగు.కామ్. 17 April 2014. Retrieved 17 April 2014.
  82. "మే 2 నుంచి రాజధానిలో గోవిందుడు". ఇండియాగ్లిట్స్. 30 April 2014. Retrieved 6 May 2014.
  83. "గోవిందుడి పోరాటం". ఈనాడు. 6 May 2014. Archived from the original on 6 మే 2014. Retrieved 6 May 2014.
  84. "యాక్షన్ సీక్వెన్స్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్". 123తెలుగు.కామ్. 6 May 2014. Retrieved 6 May 2014.
  85. "నానక్ రామ్ గూడాలో షూటింగ్ జరుపుకుంటున్న 'గోవిందుడు అందరి వాడేలే'". 123తెలుగు.కామ్. 7 May 2014. Retrieved 7 May 2014.
  86. "చ‌ర‌ణ్ `గోవిందుడు..` ఆగిపోయాడు!". గల్ట్.కామ్. 9 May 2014. Archived from the original on 11 మే 2014. Retrieved 9 May 2014.
  87. "చరణ్ 'గోవిందుడు..' షూట్ ఆగింది". తుపాకి.కామ్. 9 May 2014. Archived from the original on 11 మే 2014. Retrieved 9 May 2014.
  88. "'గోవిందుడు అందరివాడేలే'లో నటించనున్న జయసుధ". 123తెలుగు.కామ్. 28 May 2014. Retrieved 28 May 2014.
  89. "అమ్మలాంటి కమ్మనైన 'గోవిందుడు అందరివాడేలే'". ఆంధ్రజ్యోతి. 15 June 2014. Archived from the original on 17 జూన్ 2014. Retrieved 15 June 2014.
  90. "పూర్తైన రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడెలే' షెడ్యూల్". 123తెలుగు.కామ్. 18 June 2014. Retrieved 18 June 2014.
  91. "యాక్షన్‌లో రామ్‌ చరణ్‌... లారీ కొక్కేనికి తగిలి ఈడ్చుకెళ్లే సీన్..." వెబ్ దునియా. 23 June 2014. Archived from the original on 26 జూన్ 2014. Retrieved 3 July 2014.
  92. "సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్". 123తెలుగు.కామ్. 30 June 2014. Retrieved 30 June 2014.
  93. "మళ్ళీ పొల్లాచ్చి వెళ్లనున్న 'గోవిందుడు అందరివాడెలే'". 123తెలుగు.కామ్. 8 July 2014. Retrieved 11 July 2014.
  94. "కాస్త ఆలస్యంగా పొల్లాచ్చి వెళ్లనున్న గోవిందుడు". 123తెలుగు.కామ్. 16 July 2014. Retrieved 18 July 2014.
  95. "'గోవిందుడు అందరివాడేలే' పొల్లాచ్చి షెడ్యూల్ కంప్లీటెడ్..!". 123తెలుగు.కామ్. 28 July 2014. Retrieved 28 July 2014.
  96. "కారైకుడిలో ప్రారంభమైన 'గోవిందుడు..' తాజా షెడ్యూల్". 123తెలుగు.కామ్. 30 July 2014. Retrieved 30 July 2014.
  97. "రేపటి నుండి హైదరాబాద్ లో చరణ్ సినిమా." ఇండియాగ్లిట్స్. 2 August 2014. Retrieved 2 August 2014.
  98. "లండన్ వెళుతున్న గోవిందుడు". సాక్షి. 14 August 2014. Retrieved 14 August 2014.
  99. "పాట చిత్రీకరణలో 'గోవిందుడు'". ఇండియాగ్లిట్స్. 3 September 2014. Retrieved 3 September 2014.
  100. "జోర్డాన్ లో స్టెప్స్ ఫినిష్ చేసిన రామ్ చరణ్.!". 123తెలుగు.కామ్. 3 September 2014. Retrieved 3 September 2014.
  101. "ఆగష్టు 25 నుంచి గోవిందుడి లండన్ షెడ్యూల్". 123తెలుగు.కామ్. 19 August 2014. Retrieved 19 August 2014.
  102. "లండన్‌లో గోవిందుడి చిందులు". సాక్షి. 25 August 2014. Retrieved 25 August 2014.
  103. "గోవిందుడు ఆన్‌ ట్రాక్‌". గల్ట్.కామ్. 22 September 2014. Archived from the original on 25 సెప్టెంబరు 2014. Retrieved 26 September 2014.
  104. "ప్రత్యేక ఇంటర్వ్యూ: కృష్ణవంశీ – 'గోవిందుడు..' సినిమా చూసి చిరంజీవి ఎమోషనల్ అయ్యారు". 123తెలుగు.కామ్. 25 September 2014. Retrieved 26 September 2014.
  105. "'గోవిందుడు అందరివాడెలే'కి మొదలైన డబ్బింగ్". 123తెలుగు.కామ్. 18 July 2014. Retrieved 18 July 2014.
  106. "రేపటి నుంచి గోవిందుడికి రీ రికార్డింగ్". 123తెలుగు.కామ్. 25 August 2014. Retrieved 26 August 2014.
  107. "గోవిండుడికి డబ్బింగ్ పూర్తి చేసిన శ్రీ కాంత్". 123తెలుగు.కామ్. 10 September 2014. Retrieved 13 September 2014.
  108. "కొడుకు సినిమాపై ఓ కన్నేసిన చిరంజీవి". సాక్షి. 11 September 2014. Retrieved 13 September 2014.
  109. "సెప్టెంబర్ 26న 'గోవిందుడు..' సెన్సార్". తెలుగువన్. 23 September 2014. Archived from the original on 26 సెప్టెంబరు 2014. Retrieved 25 September 2014.
  110. "'గోవిందుడి'కి డబ్బింగ్ ముగించిన రామ్ చరణ్". 123తెలుగు.కామ్. 24 September 2014. Retrieved 25 September 2014.
  111. "డబ్బింగ్ పూర్తి చేసుకున్న చరణ్". ఇండియాగ్లిట్స్. 25 September 2014. Retrieved 25 September 2014.
  112. "'గోవిందుడు..' సెన్సార్ కంప్లీటెడ్." 123తెలుగు.కామ్. 26 September 2014. Retrieved 26 September 2014.
  113. "'గోవిందుడు అందరివాడేలే' సెన్సార్ కట్స్ ఇవీ". వన్ఇండియా. 30 September 2014. Retrieved 30 September 2014.
  114. "కృష్ణవంశీ ఆ ఛాన్స్ ఎవరికిస్తాడో". ఇండియాగ్లిట్స్. 3 November 2013. Retrieved 16 March 2014.
  115. "తమన్ తొలి అనుభవం". ఇండియాగ్లిట్స్. 10 January 2014. Retrieved 16 March 2014.
  116. "రామ్ చరణ్ మూవీ నుండి తమన్ ఔట్, ఏమైంది?". వన్ఇండియా. 16 April 2014. Retrieved 16 April 2014.[permanent dead link]
  117. "డప్పు పార్టీని పక్కకు పెట్టినట్లేనా ?". తెలుగువన్. 16 April 2014. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 16 April 2014.
  118. "తమన్ ఔట్! యువన్ ఇన్!!". సాక్షి. 15 April 2014. Retrieved 16 April 2014.
  119. "రామ్ చరణ్ సినిమాలో పవన్ రీమిక్స్ సాంగ్?". 123తెలుగు.కామ్. 27 April 2014. Retrieved 27 April 2014.
  120. "రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' పరిస్థితి ఇదీ...!". వన్ఇండియా. 28 May 2014. Retrieved 28 May 2014.[permanent dead link]
  121. "అక్టోబర్ 1న వస్తున్న 'గోవిందుడు అందరివాడేలే'". ఆంధ్రభూమి. 15 June 2014. Retrieved 15 June 2014.[permanent dead link]
  122. "ఆ మూర్ఖత్వంతోనే...చిరంజీవి సినిమా చేయలేకపోయా: కృష్ణవంశీ". సాక్షి. 8 August 2014. Retrieved 11 August 2014.
  123. "'గోవిందుడు అందరి వాడేలే' టీజర్ ఆవిష్కరణ విశేషాలు". ఫిల్మీబజ్. 7 August 2014. Archived from the original on 10 ఆగస్టు 2014. Retrieved 4 September 2014.
  124. "ఆగస్టు 20న చరణ్ ఆడియో." ఇండియాగ్లిట్స్. 12 July 2014. Retrieved 13 July 2014.
  125. "15న 'గోవిందుడు...' ఆడియో". ఆంధ్రభూమి. 27 August 2014. Retrieved 4 September 2014.[permanent dead link]
  126. "మెగా న్యూస్: డేట్ మార్చి ప్రకటించారు". వన్ఇండియా. 27 August 2014. Retrieved 4 September 2014.
  127. "హుర్రే! చిరంజీవి ఖరారయ్యాడు, ఫ్యాన్స్ హాపీ!". వన్ఇండియా. 28 August 2014. Retrieved 4 September 2014.
  128. "15న 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో". ఆంధ్రభూమి. 8 September 2014. Retrieved 13 September 2014.[permanent dead link]
  129. "15న 'గోవిందుడు అందరివాడేలే'పాటలు". ఆంధ్రజ్యోతి. 8 September 2014. Retrieved 13 September 2014.[permanent dead link]
  130. "గోవిందుడు అందరివాడేలే పాటలు 15న: అమ్మలాంటి కమ్మనైన సినిమా". వెబ్ దునియా. 8 September 2014. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 13 September 2014.
  131. "గోవిందుడు అందరివాడేలే ఆడియో విడుదల". ఇండియాగ్లిట్స్. 15 September 2014. Retrieved 26 September 2014.
  132. "'గోవిందుడు అందరి వాడేలే' మ్యూజిక్ రివ్యూ". ఇండియాగ్లిట్స్. 19 September 2014. Retrieved 26 September 2014.
  133. "ఆడియో సమీక్ష: గోవిందుడు అందరివాడేలే – ఫీల్ గుడ్ తెలుగు నేటివిటీ ఆల్బమ్..!". 123తెలుగు.కామ్. 24 September 2014. Retrieved 26 September 2014.
  134. "గోవిందుడు అందరివాడేలే ఆడియో రివ్యూ". టాలీవుడ్.నెట్. 18 September 2014. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 26 September 2014.
  135. "మళ్లీ మహేష్ బాబు-రామ్ చరణ్ బాక్సాఫీసు ఫైట్?". వన్ఇండియా. 12 May 2014. Retrieved 29 May 2014.
  136. "బరి నుండి తప్పుకున్న రామ్ చరణ్!". వన్ఇండియా. 16 May 2014. Retrieved 29 May 2014.[permanent dead link]
  137. "అక్టోబర్ 1న విడుదల కానున్న 'గోవిందుడు అందరివాడేలే'?". 123తెలుగు.కామ్. 29 May 2014. Retrieved 29 May 2014.
  138. "అక్టోబర్‌ 1 ఉదయం 5 గంటల 15 ని.కి 'గోవిందుడు...': బండ్ల గణేష్‌". వెబ్ దునియా. 14 June 2014. Archived from the original on 16 జూన్ 2014. Retrieved 15 June 2014.
  139. "తొలి 'దసరా' సమరం అంటూ రామ్ చరణ్ ఎగ్జైట్మెంట్". వన్ఇండియా. 14 June 2014. Archived from the original on 25 జూలై 2014. Retrieved 15 June 2014.
  140. "2 వేల థియేటర్లలో గోవిందుడు అందరివాడేలే". సాక్షి. 29 September 2014. Retrieved 30 September 2014.
  141. "అమెరికాలో 97 థియేటర్గలో సందడి చేయనున్న గోవిందుడు". 123తెలుగు.కామ్. 30 September 2014. Retrieved 30 September 2014.
  142. "గోవిందుడు విడుదలకి అన్నీ సిద్దం.!". 123తెలుగు.కామ్. 30 September 2014. Retrieved 30 September 2014.
  143. "చెన్నైలో ఆగిన రామ్ చరణ్ 'గోవిందుడు..' విడుదల..?". 123తెలుగు.కామ్. 30 September 2014. Retrieved 30 September 2014.
  144. "చరణ్ బర్త్ డే కానుక". ఇండియాగ్లిట్స్. 22 February 2014. Retrieved 16 March 2014.
  145. "ఎడ్లబండిపై రామ్ చరణ్". తుపాకి.కామ్. 15 March 2014. Archived from the original on 18 మార్చి 2014. Retrieved 16 March 2014.
  146. "చెర్రీ లుక్ అదిరిపోయింద‌ట‌!". గల్ట్.కామ్. 16 March 2014. Archived from the original on 19 మార్చి 2014. Retrieved 19 March 2014.
  147. "చరణ్ ఫస్ట్ లుక్ విడుదల". తెలుగువన్. 26 March 2014. Archived from the original on 30 మార్చి 2014. Retrieved 26 March 2014.
  148. "రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్". 123తెలుగు.కామ్. 26 March 2014. Retrieved 26 March 2014.
  149. "చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' కొత్త పోస్టర్ ఇదే". వన్ఇండియా. 28 April 2014. Retrieved 15 June 2014.[permanent dead link]
  150. "'గోవిందుడు అందరివాడేలే' లేటెస్ట్ పోస్టర్ (ఫొటో)". వన్ఇండియా. 19 May 2014. Retrieved 15 June 2014.[permanent dead link]
  151. "గోవిందుడు అందరివాడేలే మూవీ వర్కింగ్ స్టిల్స్". సాక్షి. 14 June 2014. Retrieved 15 June 2014.
  152. "మెగా వారసుడు కాబట్టే చెర్రీ అలా... (GAV లొకేషన్ స్టిల్స్)". వన్ఇండియా. 14 June 2014. Archived from the original on 25 జూలై 2014. Retrieved 15 June 2014.
  153. "'గోవిందుడు అందరివాడేలే' టీజర్ విడుదల తేదీ". వన్ఇండియా. 10 July 2014. Retrieved 11 July 2014.[permanent dead link]
  154. "మెగాస్టార్ ముఖ్య అతిధిగా 'గోవిందుడు..' టీజర్ లాంచ్..!". 123తెలుగు.కామ్. 25 July 2014. Retrieved 25 July 2014.
  155. "చరణ్‌తో సినిమా చేస్తుంటే అన్నయ్యని చూసినట్టే అనిపించింది - కృష్ణవంశీ". ఆంధ్రజ్యోతి. 8 August 2014. Archived from the original on 10 ఆగస్టు 2014. Retrieved 11 August 2014.
  156. "'గోవిందుడు అందరివాడేలే' టీజర్‌ పై కొత్త డౌట్". వన్ఇండియా. 11 August 2014. Retrieved 11 August 2014.[permanent dead link]
  157. "'గోవిందుడు అందరివాడేలే' ఆడియో డేట్ (న్యూ ఫోటోస్)". వన్ఇండియా. 8 September 2014. Retrieved 13 September 2014.
  158. "నాకు 'విజేత'.. చరణ్‌కు 'గోవిందుడు'... - చిరంజీవి". ఆంధ్రజ్యోతి. 15 September 2014. Archived from the original on 17 సెప్టెంబరు 2014. Retrieved 26 September 2014.
  159. "తెల్లవారు ఝామున 'గోవిందుడు అందరి వాడేలే'(న్యూ ఫోటోస్)". వన్ఇండియా. 25 September 2014. Retrieved 27 September 2014.
  160. "షాక్ అవుతున్నారు:రామ్ చరణా...మజాకానా". వన్ఇండియా. 14 July 2014. Retrieved 18 July 2014.[permanent dead link]
  161. "మెగా హీరోల సత్తా మళ్లీ బయిటపడింది". వన్ఇండియా. 17 July 2014. Retrieved 18 July 2014.[permanent dead link]
  162. "ఏషియన్ చేతిలో గోవిందుడు". ఇండియాగ్లిట్స్. 17 August 2014. Retrieved 19 August 2014.
  163. "NRA:' ఆగడు'....'గోవిందుడు అందరివాడేలే' ఒకరికే". వన్ఇండియా. September 9, 2014. Retrieved September 10, 2014.
  164. "నైజాం, కృష్ణలో ఓన్ రిలీజ్ చేస్తున్న బండ్ల గణేష్". 123తెలుగు.కామ్. 28 September 2014. Retrieved 28 September 2014.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!