సుకుమార్ దర్శకత్వంలో ఘట్టమనేని మహేశ్ బాబు, కృతి సనన్ కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా 1 - దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన[3] ఈ సినిమాకి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో మొదలైన ఈ సినిమా ఏప్రిల్ 23, 2012న తన చిత్రీకరణ మొదలయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ 28 డిసెంబరు 2013 న 21 నెలల తర్వాత ముగిసింది. కేంద్ర సినిమా సెన్సారు మండలి నుండి యు/ఎ ధృవపత్రం పొంది,[4] ఇది 10 జనవరి 2014న విడుదలైంది.[5]
చిత్ర కథ విషయానికి వస్తే, గౌతం ఒక రాక్ స్టార్. గౌతంకి మెదడుకి సంబంధిచిన (ఇంటిగ్రేషన్ డిజార్దర్) (మెదడు గుర్తు పెట్టుకునే సామర్థ్యం తక్కువగా) జబ్బు ఉంటుంది. గౌతమ్ పదేళ్ల వయసులో అతని తల్లి దండ్రులను ఎవరో చంపేయడంతో అనాథ శరణాలంలో పెరుగుతాడు. గౌతంకి అతని తల్లిదండ్రులు ఎలా ఉంటారో గుర్తు ఉండదు. గౌతం చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల అతని తల్లిదండ్రులని ముగ్గురు వ్యక్తులు కలసి చంపుతారు. వాళ్ళని చంపాలనే పగతో ఆ ముగ్గురిని గుర్తు పెట్టుకుంటాడు. కానీ గౌతమ్ అనుకుంటున్నట్టుగా అతని తల్లిదండ్రులను ఎవరూ చంపేయలేదని, తల్లిదండ్రులు లేని అనాథ అయిన గౌతం సృష్టించుకున్న ఊహల్లో మాత్రమే అతని తల్లిదండ్రులు, వారిని చంపిన హంతకులు ఉన్నారని అందరి నమ్మకం. అది నిజం కాదని, తన తల్లిదండ్రులని నిజంగానే ముగ్గురు వ్యక్తులు చంపేశారని గౌతం ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. తన నమ్మకం, ఇతరుల అపనమ్మకం మధ్య ఊగిలాడుతూ పెరిగి పెద్దవాడైన గౌతం ఒక రాక్ స్టార్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు. కానీ తన తల్లిదండ్రులను చంపిన ఆ ముగ్గురు మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంటారు. వాళ్ళని చంపానని అనుకుని పోలీసులకు లొంగిపోతాడు. కాని పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. తనకు తానే వాళ్ళ అమ్మ నాన్నలని చంపిన వాడిని చంపానని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. చివరకు గౌతం వాళ్ళ అమ్మనాన్నలు ఎలా వుంటారో తెలుసుకున్నడా లేదా అన్నది అసలు కథ. ఈ సినిమా కథ వైవిధ్యంగా ఉంది. అంతే కాక అత్యధిక భారీ మొత్తంలో ఈ సినిమాని నిర్మించారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు ఎం జరుగుతుందా అనిపించేలా సుకుమార్ ఈ సినిమాని రూపొందించారు.
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఈ సినిమా భారతదేశసినిమాలో అత్యధికపాయింట్లు పొందిన సినిమాగా చరిత్ర సృష్టించి, భారతీయ సినిమాకే గర్వించదగ్గ సినిమాగా ఈచిత్రం నిలిచింది. ఒక ప్రముఖ అంతర్జాతీయ అంతర్జాలం సైట్ లో నిర్వహిన్చిన ఒక సర్వేలో ఈ సినిమా ప్రపంచంలో నే నాల్గవ స్థానంలో నిలిచి తెలుగు సినిమా స్థాయిని పెంచింది.