హరిహరన్ (తమిళం: ஹரிஹரன்హిందీ: हरिहरन) (జననం:1955 ఏప్రిల్ 3) ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. ఈయన మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ, భోజ్‌పురి, తెలుగు సినిమాలలో పాటలు పాడాడు. ఈయన గజల్ గాయకుడు కూడా. 2004 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 500కు పైగా తమిళ సినీ పాటలు, దాదాపు 1000 హిందీ పాటలు పాడాడు.
ప్రారంభ జీవితం
హరిహరన్ కేరళ లోని తిరువనంతపురంలో1955 ఏప్రిల్ 3న ఓ తమిళ అయ్యర్ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అలమేలు, హెచ్.ఎ.ఎస్.మణి ప్రముఖ కర్ణాటక శాస్ర్తీయ సంగీతకారులు. ముంబయిలో పెరిగాడు. ముంబయిలోని ఐ.ఐ.ఇ.ఎస్ కళాశాలలో సైన్స్, న్యాయశాస్త్రంలో డిగ్రీలను పూర్తిచేశాడు. ఆయన తల్లిదండ్రులు శ్రీమతి అలమేలు, అనంత సుబ్రహ్మణ్య అయ్యర్లు. ఆయనకు వారసత్వంగా సంగీత విద్య అబ్బింది. హరిహరిన్ తల్లి అలమేలు ఆయనకు తొలి గురువు. చిన్నతనంలోనే కర్నాటక సంగీతాన్ని నేర్చుకున్న ఆయన హిందూస్తానీ సంగీతంలో కూడా శిక్షణపొందాడు. ఆయన హిందూస్థానీ సంగీతం కూడా బాల్యంలో నేర్చుకుననరు. కౌమరదశలో ఆయన "మెహ్దీ హసన్", "జగ్జీత్ సింగ్" వంటి గాయకుల ప్రభావానికి లోనయి గజల్ సంగీతాన్ని అభివృద్ధి పరచుకున్నాడు. ఆయన "ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్" వద్ద హిందూస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. ఆయన ప్రతిరోజూ 13 గంటలకు పైగా సంగీత సాధన చేస్తుంటారు.
కెరీర్
ఫిలిం కెరీర్
తన కెరీర్ ప్రారంభంలో హరిహరన్ టెలివిజన్లో ప్రదర్శనలిచ్చేవాడు. అనేక టెలివిజన్ సీరియళ్ళకు పాటలు పాడాడు. 1977 లో ఆయనకు "ఆల్ ఇండియా సర్ సింగర్ కాంఫిటీషన్"లో ఉన్నత బహుమతి వచ్చిన తరువాత ఆయన 1978 లో "జైదేవ్" దర్శకత్వంలో విడుదలైన హిందీ చిత్రం "గమన్"లో పాడుటకు ఒప్పందం చేసుకున్నాడు. ఆయన పాడిన "అజీబ్ సా నహ ముఝ్ పార్ గుజర్ గయ యారో" పాటకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఫిల్మ్ అవార్డు లభించింది. అదే విధంగా జాతీయ అవార్డుకు నామినేట్ చేయబడింది.[2]
సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ ఆయన్ను 1992 లో తమిళ చిత్రసీమకి పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలోని రోజా సినిమాలో "తమిఝ తమిఝ" అనే దేశభక్తి గీతం పాడారు.[3]. తరువాత మణిరత్నం దర్శకత్వంలో నిర్మింపబడ్డ బొంబాయి సినిమాలో "ఉరియే ఉరియే" పాటకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నేపథ్యగాయకునిగా ఎంపికయ్యాడు. ఈ పాటను హరిహరన్ కె.ఎస్.చిత్రతో కలసి పాడాడు. రహ్మాన్ తో చేసిన గాయకులలో ముఖ్యమైనవాడు హరిహరన్. ముత్తు, మిన్సార కనవు, జీన్స్, ఇండియన్, ముదల్వాన్, తాల్, రంగీలా, ఇందిర, ఇరువర్, అంబే ఆరుయిరే, కంగలాల్ కైతు సె, శివాజి, అలైపయుతే" , కన్నతిల్ ముతమిట్టల్ , గురు , మొదలైన అనేక సినిమాలలో పాటలు పాడాడు. 1998 లో హిందీ సినిమా "బోర్డర్" లో "అను మల్లిక్" కూర్చిన "మేరే దుష్మన్ మేరే భాయీ" పాటకు జాతీయ స్థాయిలో ఉత్తమ నేపధ్య గాయకునిగా అవార్డు అందుకున్నాడు. ఆయన 2009 లో "అజయ్ అతుల్" ట్యూన్ చేసిన "జోగ్వా" సినిమాలోని "జీవ్ రంగ్లా" పాటను మరాఠీ భాషలో పాడి జాతీయ బహుమతిని గెలుచుకున్నారు.[4]
ఆయన 500 కి పైగా తమిళ పాటలను, 200 కి పైగా హిందీ పాటలను పాడారు. అనేక వందల మలయాళ, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషలలో పాటలను ఆలపించారు.
↑Although he made his debut a long time ago,Hariharan was first noticed in a duet with Kavita Krishnamurthy in Hai Mubarak Aaj ka Din from Boxer (1984), which was composed by R D Burman.Hariharan. Hummaa.com. Retrieved on 2012-01-01.