జి. రామకృష్ణ |
---|
|
జననం | 15 అక్టోబరు 1939
భీమవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
---|
మరణం | 22 అక్టోబరు 2001 (వయసు 62)
చెన్నై, తమిళనాడు, భారతదేశం |
---|
జాతీయత | భారతీయుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 1960-1995 |
---|
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు సినిమా నటుడు |
---|
జీవిత భాగస్వామి | గీతాంజలి (నటి) |
---|
జి. రామకృష్ణ భారతీయ సినిమా నటుడు. అతను తెలుగు, తమిళం, మలయాళంతో సహా 200 కి పైగా చిత్రాల్లో నటించాడు.
జీవిత విశేషాలు
అతను ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం నకు చెందిన రంగస్థల నటుడు. అతను 1950 లలో చెన్నైకి వెళ్లాడు. అతని సినీరంగ ప్రవేశం 1960 లో నిత్య కళ్యాణం పచ్చతోరణం సినిమాతో ప్రారంభమైంది.[1]
అతని మొదటి వివాహం భీమవరం నకు చెందిన మహిళతో జరిగింది. ఆమె ద్వారా ఒక కుమార్తె కలిగింది. అతను తన మొదటి భార్య, కుమార్తెను వదిలి మద్రాసుకు వచ్చాడు. అతను తెలుగు నటి గీతాంజలిని వివాహం చేసుకున్నాడు. అతను 2001 లో మరణించాడు.[2]
సినిమా జీవితం
అతను నోము, పూజ, నేను – నా దేశం, బొమ్మా బొరుసా, బడిపంతులు, కురుక్షేత్రం, యువతరం కదిలింది, మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము, హంతకులొస్తున్నారు జాగర్త , మగాడు, కటకటాల రుద్రయ్య, దొరలు దొంగలు, కోటలోపాగా, విశ్వనాధ నాయకుడు మొదలైన సూపర్ హిట్ సినిమాలలో నటించాడు.
యశోద కృష్ణ, వినాయక విజయము, దేవుడే దిగివస్తే వంటి అనేక పౌరాణిక చిత్రాలలో అతను వివిధ పాత్రలు పోషించాడు. అతను ఎన్. టి. రామారావు , అక్కినేని నాగేశ్వరరావులతో కలిసి నటించాడు.
నటించిన సినిమాలు
మూలాలు
బాహ్య లంకెలు