మగాడు (1976 సినిమా)

మగాడు
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం నందమూరి తారక రామారావు ,
మంజుల,
అంజలీ దేవి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మగాడు 1976లో విడుదలైన తెలుగు చిత్రం. సలీమ్ జావేద్ రచనతో తయారైన 'దీవార్' హిందీ చిత్రం ఆధారంగా తెలుగులో తీయబడింది. అమితాబ్, శశికపూర్ పాత్రల్ని ఎన్. టి. ఆర్, రామకృష్ణలు పోషించారు. నిరూపా రాయ్ పాత్ర (తల్లి) అంజలీదేవి పోషించింది.

ఎన్.టి.ఆర్

నటీనటులు

చిత్రకథ

ఈ చిత్రకథ 70వ దశకానికి అనుగుణంగా మార్చిన 'మదర్ ఇండియా' కథలా ఉంటుంది. మదర్ ఇండియా చిత్రాన్నికూడా తెలుగులో బంగారు తల్లి చిత్రం గా జమున ,కృష్ణంరాజు, శోభన్ బాబు లతో తీశారు. పాత చిత్రం పల్లెటూరి నేపథ్యం లో వస్తే ఈ చిత్రం నగరంలో జరుగుతుంది. ఇద్దరు కొడుకుల్లో ఒకరు చట్టానికి,ఎస్టాబ్లిష్ మెంట్ కు అనుగుణం గా నడిచేవరైతే మరొకరు చట్టవ్యతిరేక పనులు చేశేవారు, వారి మధ్య ఘర్షణ, మధ్య నలిగే తల్లి. ఎన్.టి.ఆర్ హార్బరు లో పనిచేస్తూ పరిసస్థితులరీత్యా చట్టవ్యతిరేకి గా మారుతాడు. చదువుకున్న తమ్ముడు పోలీసు ఆఫీసరు ఔతాడు. అన్న కార్యక్రమాలు తెలిసిన తమ్ముడు అతన్ని వెంటాడు తాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన వాగ్వివాదంలో తమ్ముడ్ని కూడా తనలా మారమంటాడు. తన దగ్గర బంగళా, కార్లు, ధనం అన్నీ ఉన్నాయనీ నీదగ్గరేముందని తమ్ముడ్ని అడుగుతాడు. తనదగ్గర'తల్లి' ఉందని తమ్ముడు చెబుతాడు. (హిందీ సినిమాలలో ఈ సన్నివేశానికి గొప్పగుర్తింపు ఉంది.)

పాటలు

  • 'కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను', రచన: సి. నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • కొటేసిందు, రచన: సి నారాయణ రెడ్డి,గానం.పి సుశీల
  • సలసల కాగినకొద్ది , రచన: సి నారాయణ రెడ్డి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!