బలరాముడు సుభద్రని ధుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని మనసులో నిశ్చయించుకొంటాడు. ఇలా ఉండగా అర్జునుడు తాను చేసిన అపచారానికి ఒక ఏడాది పాటు యతీశ్వర అవతారములో పల్లెలు, పట్టణాలు తిరుగుతుంటాడు. ఇలా తిరుగుతూ ఒకసారి యతీశ్వర వేషంలోనే మధుర నగరం చేరుకోంటాడు. పట్టణానికి యతీశ్వరుడు వచ్చాడని తెలుసుకొని సుభద్ర తన పరివారంలో అర్జునుడి చూడడానికి వెళ్ళుతుంది. సుభద్రని చూసిన అర్జునుడు ఆమె చూసి ఆమెని వివాహాం చేసుకోవాలను కొంటాడు. దానికి కృష్ణుడు సాయపడి ఆమెను అతడి సేవలకు వినియోగించి పరస్పర ప్రేమ కలిగే అవకాశం కల్పించి వారి వివాహం జరిపిస్తాడు