శల్యుడు

జావా జానపద ప్రదర్శనలో శల్యుడు

మహాభారతంలో శల్యుడు మాద్ర రాజ్యానికి రాజు. ఇతను మాద్రికి సోదరుడు. మాద్రి నకులుడు, సహదేవులకు తల్లి. ఆలా అతను నకులుడు, సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు కుంతిని పెళ్ళి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా పాండురాజునే పెళ్ళి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు, యుద్ధ వీరుడు.

శల్యుని మీద అతని పెద్ద సైన్యం మీద పాండవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శల్యుడు తన సైన్యంతో పాండవులకు యుద్ధమున సాయం చేయుటకు వచ్చుచుండగా దుర్యోధనుడు యధిష్టురుని వలే నటించి శల్యునికి, అతని సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేసెను. శల్యుడు ఆ విందుకు సంతసించి యధిష్టురుడు అనుకుని యుద్ధమున సాయం చేతునని దుర్యోధనునికి మాట ఇచ్చెను. ఇచ్చిన మాట తప్పలేక దుర్యోధనుని తరపున కౌరవులతో కలసి యుద్ధం చేయుటకు సమ్మతించెను. తరువాత శల్యుడు యధిష్టురుని కలిసి తన పొరబాటుకి క్షమించని అడిగెను. శల్యుడు గొప్ప రథసారథి అని తెలిసిన యధిష్టురుడు దుర్యోధనుడు అతనిని కర్ణునికి రథసారథిగా నియమించునని ఊహించెను. అలా అయినచో కర్ణుని యుద్ధమున తన ఎత్తిపొడుపు మాటలతో కర్ణునికి ఆత్మస్తైర్యాన్ని దెబ్బ తీయవలసినదని మాట తీసికొనెను.

శల్యుడు ఇష్టం లేకున్నను కౌరవుల తరపున యుద్ధము చేసెను. శల్యుడు కర్ణునికి అర్జునునితో యుద్ధము చేయునపుడు రథసారథిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు అర్జునుని అదేపనిగా పొగడుతూ కర్ణుని విమర్శిస్తూ ఉండెను. శల్యుడు కర్ణుని మరణం తరువాత యుద్ధమున చివరి రోజున (పదునెనిమిదవ రోజు) కౌరవ సైన్యాన్ని అధిపతియై నడిపించెను. యుద్ధమున యధిష్టురుడు శల్యుని చంపెను.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!