వేములవాడ గ్రామీణ మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1][2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[3] దానికి ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం వేములవాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. వేములవాడ, ఈ మండలానికి కేంద్రం.
మండల జనాభా
2011 భారత జనగణన ప్రకారం మొత్తం మండల జనాభా - 33,706. పురుషుల సంఖ్య 16,793 - స్త్రీల సంఖ్య 16,913 - గృహాల సంఖ్య 8,206. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 107 చ.కి.మీ. కాగా, జనాభా 30,317. జనాభాలో పురుషులు 15,249 కాగా, స్త్రీల సంఖ్య 15,068. మండలంలో 7,869 గృహాలున్నాయి.[5]
నూతన మండల కేంద్రంగా ఏర్పాటు
లోగడ వేములవాడ గ్రామం/పట్టణం లోగడ కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోని వేములవాడ మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా వేములవాడ (గ్రామీణ) పేరుతో (0+15) గ్రామాలతో, వేములవాడ నూతన మండల కేంధ్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లా,సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.[6]