చందుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం.[1]చందుర్తి, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వేములవాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
మండల జనాభా
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 43,596 - పురుషులు 21,694- స్త్రీలు 21,902. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 173 చ.కి.మీ. కాగా, జనాభా 33,587. జనాభాలో పురుషులు 16,808 కాగా, స్త్రీల సంఖ్య 16,779. మండలంలో 8,462 గృహాలున్నాయి.[3]