మొండిఘటం

మొండిఘటం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
నిర్మాణం దగ్గుబాటి భాస్కరరావు
తారాగణం చిరంజీవి ,
రాధిక శరత్‌కుమార్,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
ఛాయాగ్రహణం పి.చెంగయ్య
కూర్పు కె.ఎ.మార్తాండ్
నిర్మాణ సంస్థ ఈతరం పిక్చర్స్
భాష తెలుగు

మొండి ఘటం 1982 నవంబరు 6 న విడుదలైన తెలుగు సినిమా. దీనికి రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో చిరంజీవి, రాధిక, కైకాల సత్యనారాయణ, గుమ్మడి వెంకటేశ్వరరావు నటించారు.

కథ

రవీంద్ర (చిరంజీవి) ఉడుకు రక్తపు యువకుడు, మొండివాడు. తాను సరైనదని భావించే దాని గురించి చాలా మొండిగా ఉంటాడు. అతను సత్యనారాయణ (న్యాయమూర్తి), అన్నపూర్ణల ఏకైక కుమారుడు. అతన్ని లత (రాధిక) ప్రేమించింది. రవీంద్ర స్నేహితుడు ఈశ్వర్, ప్రసాద్ బాబు వద్ద పనిచేస్తాడు. అతనికి జీతం ఇవ్వకుండా ఉద్యోగం నుండి తీసేస్తాడు. రవీంద్ర న్యాయం కోరుతూ ప్రసాద్ బాబును కొడతాడు. అపరాధిగా కోర్టులో తన తండ్రి ముందే నిలబడతాడు. లత తండ్రి కోర్టులో అబద్ధం చెప్పమని సలహా ఇస్తాడు. కాని అతను సత్యానికే కట్టుబడి ఉంటాడు. కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవిస్తాడు. సత్యనారాయణ తనకు అవమానం జరిగినట్లు భావించి రవీంద్ర తనను తాను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తాడు.

తనను కోర్టుకు లాగినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రసాద్ బాబు యోచిస్తాడు. ఈశ్వర్ కోసం ఒక ప్రమాదాన్ని ప్లాన్ చేస్తాడు. ఈశ్వర్ కాళ్ళు కోల్పోతాడు. రవీంద్ర ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, ప్రసాద్ బాబు కారు 3 గంటల క్రితం దొంగిలించబడిందని పోలీసులు చెబుతారు. కేసు పోయింది, రవీంద్ర నిస్పృహ చెందుతాడు. లతను తనకిచ్చి పెళ్ళి చెయ్యాలని ప్రసాద్ బాబు లత తండ్రి (రవి కొండలరావు) ని బలవంతపెడతాడు. ఇంతలో, ఈశ్వర్ భార్య సుశీల డబ్బు సంపాదించడానికి వ్యభిచారంలోకి అడుగుపెడుతుంది. దీనిని భరించలేక, ఈశ్వర్ ఆత్మహత్య చేసుకుంటాడు. రవీంద్ర ఈశ్వర్ సోదరి పద్మ బాధ్యతను స్వీకరిస్తాడు. ఇంకా పగ చల్లారని ప్రసాద్ బాబు, రవీంద్ర వేలిముద్రలు కాజేసి, ఆ ప్రింట్లతో తయారు చేసిన ప్రత్యేక చేతి తొడుగులు తీసుకొని పద్మపై అత్యాచారానికి పాల్పడి ఆమెను చంపేస్తాడు. నింద రవీంద్రపై పడుతుంది. పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. ప్రసాద్ బాబు తండ్రి గుమ్మడి తాగిన స్థితిలో సత్యనారాయణకు చేతి తొడుగుల రహస్యాన్ని వెల్లడిస్తాడు. సత్యనారాయణ తన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి, న్యాయవాదిగా తన కొడుకు తరపున ఈ కేసులో వాదిస్తాడు. కాని ఆ చేతి తొడుగుల గురించి నిరూపించడంలో విఫలమౌతాడు. హింస మాత్రమే ఈ కేసును పరిష్కరించగలదని రవీంద్ర నిర్ణయించుకుంటాడు. ప్రసాద్ బాబు స్థావరంలో దాడి చేసి అవసరమైన ప్రతి ఆధారాలను సేకరిస్తాడు. నిజమైన నేరస్థులకు శిక్ష పడుతుంది. లత రవీంద్రల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.

పాటలు

ఈ సినిమాలో కింది పాటలు ఉన్నాయి.[1]

క్రమసంఖ్య పేరు నిడివి
1. "నే మొండి ఘటాన్ని"    
2. "ఒకటీరెండు"    
3. "భలే భలే బుల్లోడు"    
4. "ఖాయం ఖాయం"    

మూలాలు

  1. SenSongs (2019-01-27). "Mondi Ghatam Songs Download | Mondi Ghatam Mp3 Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-21.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!