కైకాల సత్యనారాయణ (1935 జూలై 25 - 2022 డిసెంబరు 23) తెలుగు సినీమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.
వ్యక్తిగత జీవితం
కృష్ణా జిల్లాగుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935జులై 25న జన్మించాడు.[2] ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, ది గుడివాడ కళాశాల (ఏఎన్ఆర్ కళాశాల) నుండి పట్టభద్రుడయ్యాడు. 1960ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు
సినీ జీవితం
నాటకాలు వేసే సమయంలోనే సినిమాలలో పని చేస్తారా అని ఒక దర్శకుడు అడగగా నేను ముందు డిగ్రీ పూర్తి చేసుకోవాలి డిగ్రీ చదివిన తర్వాతే సినిమాలు గురించి ఆలోచిస్తాను అని చెప్పారు .చదువు పూర్తి చేసుకున్న తరువాత అవకాశాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్లారు. సినిమాలో రోలు వచ్చే అవకాశం ఉంది .నాలుగు రోజులు ఆగిరమ్మని దర్శకుడు చెప్పడంతో మద్రాస్ లోనే కొన్ని రోజులు ఉండి పోదామని నిర్ణయించుకున్నారు. మద్రాస్ లో ఉన్న రోజులలో చాలా అవకాశాలు వచ్చినా ఏ సినిమాకి కూడా సెలెక్ట్ కాలేదు. అవకాశాలు వెతుకుతున్న సమయంలో రూము లేక 15 రోజులు ఒక పార్కులోనే పడుకునే వారు. ఇంత కఠిన సమయంలో కూడా మద్రాస్ వదిలి వెళ్ళకూడదు అని నిశ్చయించుకొని అక్కడే ఉండి ప్రయత్నాలు చేసేవారు. రూము దొరికిన తరువాత రోజంతా అలిసిపోయిన కారణంగా కాఫీ ఆర్డర్ చేశారు .కాఫీ అంతా తాగిన తర్వాత సాలెపురుగు భాగంలో ఉండటం గమనించాడు. తన తోటి రూమ్ సభ్యులతో సాలెపురుగు వల్ల శరీరంలో విష ము ఎక్కుతుందని చెప్పగా హాస్పిటల్కు వెళ్లకుండా రూమ్ లోనే ఉండిపోయారు. నాకు ఫ్యూచర్ ఉంటే నేను ఉదయం లేస్తాను లేకపోతే ఈ సాలెపురుగు విషం వల్ల చనిపోతాను అని చెప్పి పడుకున్నారు. ఆ ఉదయం ఆరోగ్యంగా లేవటం
సినీ పరిశ్రమలో రావటం కైకాల సత్యనారాయణ జీవితమే మారిపోయింది .కైకాల సత్యనారాయణకు 1959వ సంవత్సరంలో సిపాయి కూతురులో డి ఎల్ నారాయణ ద్వారా అవకాశం దొరికింది .ఎన్టీఆర్ గారి పోలిక కలిగి ఉండటం వల్ల ఎన్టీఆర్కు డూపు లాగా నటించారు. 750 సినిమాల్లో వివిధ రకాల పాత్రలను పోషించి తెలుగువారి హృదయాలను తన నటన ద్వారా గెలుచుకున్నారు .దేవుళ్ళకి సంబంధించిన పాత్రలలో సత్యనారాయణ గారికి సాటి ఎవరు లేరు అని చెప్పవచ్చు. యముడిగా రావణుడిగా, దుర్యోధనుడిగా నటించి ఆ పాత్రలకు జీవం పోశారు. 1996 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు .సత్యనారాయణ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లను మంచి ఆహారాన్ని తీసుకోవాలని భావిస్తారు .జీవితంలో ఎక్కువగా బాధపడకుండా ఉండటమే మనిషి ఆరోగ్యానికి సహాయం చేస్తుందని కూడా చెబుతారు. కైకాల సత్యనారాయణకు 2011 వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు, 2017లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. తన నటన ద్వారా ఎలగంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. అతన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించటానికి ఆసక్తి గల కారణం, అతను రూపు రేఖలు యన్.టి.ఆర్‌ను పోలి ఉండటమే. యన్.టి.ఆర్ కు ఒక మంచి నకలు దొరికినట్లు అయింది. అప్పుడే యన్.టి.ఆర్ కూడా ఇతన్ని గమనించారు. 1960లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఇతనుకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించినవారు యస్.డి.లాల్. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేసాడు.
సత్యనారాయణను ఒక ప్రతినాయకుడుగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది బి.విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో, తర్వాతి సినిమాల్లో అతను ప్రతినాయకుడుగా స్థిరపడి పోయాడు.
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా!
ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు.[3] పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని (కథాకనాయిక) తండ్రి, తాత మొదలైనవి.