చెళ్ళపిళ్ళ సత్యం |
---|
చెళ్లపిళ్ల సత్యం |
జననం | సత్యనారాయణ 17,మే1933
|
---|
మరణం | {{Death year and age|12-01-1989|1933 |
---|
వృత్తి | సంగీత దర్శకుడు |
---|
చెళ్లపిళ్ల సత్యం (సత్యనారాయణ) (1933 - 1989) తెలుగు సినిమాలలో సంగీత దర్శకులు.
బాల్యం, విద్యాభ్యాసం
ఇతడు విజయనగరం జిల్లాలో కొమరాడ గ్రామంలో జన్మించారు. సత్యం వంశస్థులంతా సంగీత సాహిత్యాలలో ఉద్దండులే. ముఖ్యంగా ముత్తాత చెళ్లపిళ్ల వేంకట కవి, ఆ కాలంలో తిరుపతి వేంకట కవులలో ఒకనిగా, మహాకవిగా కీర్తి గడించారు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆసక్తి కనబరిచేవాడు. హరికథా భాగవతార్ అయిన తాతయ్య చెళ్ళపిళ్ళ సత్యనారాయణ దగ్గర పదేళ్ళ వయసులోనే సంగీతం పాఠాలు ప్రారంభించి కృతులు వరకూ నేర్చుకున్నడు. సాలూరుకు చెందిన పట్రాయని సీతారామశాస్త్రి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో పేరొందిన విద్వాంసుడు. ఆయన దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకున్నాడు. ఓరోజు కాకినాడకు చెందిన "యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్" వారి డ్రామా వేయడానికి సాలూరు వెళ్లాడు. ఆదినారాయణరావు గారు ఆ క్లబ్ కు కీలక వ్యక్తి. స్నేహితులంతా సత్యాన్ని తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. అక్కడి నుంచి "యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్"లో ఆదినారాయణరావుకు సహాయకునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆదినారయణరావుకు అంజలీ దేవితో వివాహం అయింది. ఆదినారాయణరావు గారు ఓపెద్ద ఇల్లు తీసుకున్నారు. వాళ్ళతో పాటే సత్యం కూడా అందులో చేరాడు. ఆదినారాయణరావు ఆర్కెస్ట్రాలో తబలా నిపుణుడైన పెద్ద అంజయ్య ఉండేవారు. ఆయన డోలక్ ఎలా వాయిస్తున్నాడో సునిశితంగా గమనిస్తూ, ఎవరూ లేనప్పుడు అలా అనుకరిస్తూ నేర్చుకుంటుండే వాడు. ఆ తరువాత టి.వి. రాజు గారి ఆర్కెస్ట్రాలో ఎనిమిదేళ్లు అక్కడే పనిచేశాడు.
సినీ జీవితం
1962వ సంవత్సరంలో ఎం.ఎస్.నాయక్ నిర్మించిన "శ్రీ రామాంజనేయ యుద్ధ" అనే కన్నడ సినిమాకి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నూటికి నూరు పాళ్ళు సద్వినియోగం చేసుకున్నాడు సత్యం. మొదట్లో తెలుగులో అడప దడప సినిమాలు చేస్తూన్నా మంచి గుర్తింపు రాలేదు. ఈలోపు కన్నడంలో 42 సినిమాలకు స్వరకల్పన చేశాక 1973 లో "కన్నె వయసు" సినిమా తరువాత ఇక తెలుగులో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. సత్యం స్వరజీవితంలోనే అగ్రతాంబూలం ఇవాల్సిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" పాట ఈ సినిమాలోనిదే. ఇలా తన 20 ఏళ్ల సినీ జీవితంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు. కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్రతారల చిత్రాలకు విజయవంతమైన సంగీతం అందించారు. 70 వ దశకంలో దాదాపు కృష్ణ నటించిన అన్నీ కౌబాయ్ చిత్రాలకు సత్యమే స్వరసారథి. నటుడు చలం నిర్మాతగా తీసిన, హీరోగా నటించిన దాదాపు 20 సినిమాలకు సత్యమే ఆస్థాన సంగీత దర్శకుడు. సత్యానికి బాగా ఇష్టమైన వాద్యం తబలా. తబలా లేకపొతే సత్యం సంగీతం లేదు అని చాలాసార్లు చెప్పేవారు. రీరికార్డింగ్ సమకూర్చడంలో సత్యానిది ఓ ప్రత్యేక శైలి.
సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు
ఇది సత్యం సంగీతం వహించిన పూర్తి చిత్రాల జాబితా[1]
- శ్రీ రామాంజనేయ యుద్ధ (కన్నడం) (1963)
- సవతి కొడుకు (తెలుగు) (1963) : ఇది భూతల స్వర్గం ఓరన్నా
- మమతెయ బంధన (కన్నడం) (1966)
- బ్లాక్ మార్కెట్ (కన్నడం) (1967)
- ధన పిశాచి (కన్నడం) (1967)
- ఒందె బళ్లియ హూగళు (కన్నడం) (1967)
- ఆత్తెగొందు కాల సొసెగొందు కాల (కన్నడం) (1968)
- బెంగళూర్ మెయిల్ (కన్నడం) (1968)
- సర్కార్ ఎక్స్ ప్రెస్ (తెలుగు) (1968)
- గాంధీ నగర (కన్నడం) (1968)
- హూవు ముళ్లు (కన్నడం) (1968)
- లక్షాధీశ్వర (కన్నడం) (1968)
- రాజయోగం (తెలుగు) (1968)
- మమతె (కన్నడం) (1968)
- రౌడి రంగణ్ణ (కన్నడం) (1968)
- సర్వమంగళ (కన్నడం) (1968)
- పాల మనసులు (తెలుగు) (1968) : పాలవంక సీమలో
- 'చూరి చిక్కణ్ణ (కన్నడం) (1969)
- భలే రాజ (కన్నడం) (1969)
- ఎల్లెల్లూ నానె # పాల మనసులు (1969)
- కాడిన రహస్య # పాల మనసులు (1969)
- కాణికె # పాల మనసులు (1969)
- రాజసింహ (1969)
- ప్రతీకారం (1969)
- మాతృభూమి (కన్నడం) (1969)
- మదువె మదువె మదువె (కన్నడం) (1969)
- పుణ్య పురుష (కన్నడం) (1969)
- లవ్ ఇన్ ఆంధ్రా (తెలుగు) (1969)
- టక్కరి దొంగ చక్కని చుక్క (తెలుగు) (1969) : కలలు కనే కమ్మని చిన్నారి
- భలే ఎత్తు చివరకు చిత్తు (తెలుగు) (1970)
- భలే కిలాడీ (కన్నడం) (1970)
- రౌడీ రాణి (తెలుగు) (1970)
- సి.ఐ.డి. రాజణ్ణ (కన్నడం) (1970)
- కళ్లర కళ్ల (కన్నడం) (1970)
- మొదల రాత్రి (కన్నడం) (1970)
- మృత్యు పంజరదల్లి గూఢాచారి 555 (కన్నడం) (1970)
- ప్రతీకార (కన్నడం) (1970)
- పగ సాధిస్తా (తెలుగు) (1970)
- రంగ మహల్ రహస్య (కన్నడం) (1970)
- సేడిగే సేడు (కన్నడం) (1970)
- మట్టిలో మాణిక్యం (తెలుగు) (1971) : మళ్లీ మళ్లీ పాడాలి యీ పాట, రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరబాద్.
- మాస్టర్ కిలాడి (తెలుగు) (1971)
- భలే భాస్కర్ (కన్నడం) (1971)
- బంగారు కుటుంబం (తెలుగు) (1971)
- చలాకీ రాణి కిలాడీ రాజా (తెలుగు) (1971)
- కత్తికి కంకణం (తెలుగు) (1971)
- కాసిద్రె కైలాస (కన్నడం) (1971)
- రివాల్వర్ రాణి (తెలుగు) (1971)
- జేమ్స్ బాండ్ 777 (తెలుగు) (1971)
- సి.ఐ.డి. రాజు (తెలుగు) (1971)
- నమ్మక ద్రోహులు (తెలుగు) (1971)
- రౌడీలకు రౌడీలు (తెలుగు) (1971) : తీస్కో కోకోకోలా వేస్కో రమ్ము సోడా
- పాపం పసివాడు (తెలుగు) (1972) : అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి
- నిజం నిరూపిస్తా (తెలుగు) (1972)
- ఊరికి ఉపకారి (తెలుగు) (1972)
- బుల్లెమ్మ బుల్లోడు (తెలుగు) (1972) : అమ్మ అన్నది ఒక కమ్మని మాట
- దేవుడమ్మ (తెలుగు) (1972) : ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
- కొరడా రాణి (తెలుగు) (1972)
- భలే రాణి (కన్నడం) (1972)
- మొనగాడొస్తున్నాడు జాగ్రత్త (తెలుగు) (1972)
- పిల్లా పిడుగా (తెలుగు) (1972)
- మా ఊరి మొనగాళ్ళు (తెలుగు) (1972)
- జగ మెచ్చిద మగ (కన్నడం) (1972)
- హంతకులు దేవాంతకులు (తెలుగు) (1972)
- మా ఇంటి వెలుగు (తెలుగు) (1972)
- క్రాంతి వీర (కన్నడం) (1972)
- కలవారి కుటుంబం (తెలుగు) (1972)
- కత్తుల రత్తయ్య (తెలుగు) (1972)
- భలే మోసగాడు (తెలుగు) (1972)
- అంతా మన మంచికే (భానుమతి తో) (తెలుగు) (1972) : నవ్వవే నా చెలీ
- బాలమిత్రుల కథ (తెలుగు) (1972) : గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి
- బంగారద కళ్ల (కన్నడం) (1973)
- వాడే వీడు (తెలుగు) (1973) : అటు చల్లని వెలుగుల జాబిలి
- మంచివాళ్ళకు మంచివాడు (తెలుగు) (1973)
- జగమే మాయ (తెలుగు) (1973) : నీ మదిలో నేనే ఉంటే
- జ్వాలా మోహిని (కన్నడం) (1973)
- స్నేహ బంధం (తెలుగు) (1973) : స్నేహబంధము ఎంత మధురము
- రాముడే దేముడు (తెలుగు) (1973)
- కన్నె వయసు (తెలుగు) (1973) : ఏ దివిలో విరిసిన పారిజాతమో
- గీత (తెలుగు) (1973) :పూచే పూలలోన వీచే గాలిలోన
- బంగారు మనసులు (తెలుగు) (1973)
- పుట్టినిల్లు - మెట్టినిల్లు (తెలుగు) (1973) : ఇదే పాట ప్రతీ చోట ఇలాగే పాడుతుంటాను
- ఒక నారి – వంద తుపాకులు (తెలుగు) (1973)
- విచిత్ర వివాహం (భానుమతి తో) (తెలుగు) (1973)
- రాణీ ఔర్ జానీ (హిందీ) (1973)
- నోము (తెలుగు) (1974) : కలిసే కళ్లలోన కురిసే పూలవాన
- నేను – నా దేశం (తెలుగు) (1974) : నేను నా దేశం పవిత్ర భారతదేశం
- నిప్పులాంటి మనిషి (తెలుగు) (1974) : స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం
- నీడలేని ఆడది (తెలుగు) (1974) : తొలి వలపే తీయనిది
- గౌరి (తెలుగు) (1974) : గలగల పారుతున్న గోదారిలా
- మాఇంటి దేవుడు (తెలుగు) (1974)
- గుండెలు తీసిన మొనగాడు (తెలుగు) (1974)
- తులాభారం' (తెలుగు) (1974) : రాధకు నీవేరా ప్రాణం
- అమ్మాయి పెళ్లి (తెలుగు) (భానుమతి తో) (1974) : పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి
- రామయ్య తండ్రి (తెలుగు) (1975)
- పుట్టింటి గౌరవం (తెలుగు) (1975)
- అమ్మాయిలు జాగ్రత్త (తెలుగు) (1975)
- సౌభాగ్యవతి (తెలుగు) (1975)
- అనురాగాలు (తెలుగు) (1975)
- నాకూ స్వతంత్రం వచ్చింది (తెలుగు) (1975)
- మహదేశ్వర పూజాఫల (కన్నడం) (1975)
- నాగకన్యె (కన్నడం) (1975)
- సర్ప కావలు (కన్నడం) (1975)
- రక్త సంబంధాలు (తెలుగు) (1975) : అనురాగ శిఖరాన ఆలయం
- దేవుడే దిగివస్తే (తెలుగు) (1975)
- పిచ్చోడి పెళ్ళి (తెలుగు) (1975)
- తోట రాముడు (తెలుగు) (1975) : ఓ బంగరు రంగుల చిలకా పలుకవా
- స్వర్గం నరకం (తెలుగు) (1975)
- చిట్టెమ్మ చిలకమ్మ (తెలుగు) (1975)
- ఈ కాలం దంపతులు (తెలుగు) (1975)
- లక్ష్మణ రేఖ (తెలుగు) (1975)
- బుల్లెమ్మ శపథం (తెలుగు) (1975)
- మాయా మశ్చీంద్ర (తెలుగు) (1975) : ప్రణయరాగ వాహిని చెలీ వసంతమోహిని
- అపరాధి (కన్నడంం (1976)
- ముత్యాల పల్లకి (తెలుగు) (1976) : సన్నజాజికి, గున్నమామికి పెళ్లి కుదిరింది, తెల్లావారకముందే పల్లె లేచింది
- మాయావి (కన్నడ అనువాదం) (1976)
- దొరలు దొంగలు (తెలుగు) (1976)
- నేరం నాదికాదు – ఆకలిది (1976) : మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా
- భలే దొంగలు (తెలుగు) (1976) : చూశానే ఓలమ్మీ చూశానే
- పెద్దన్నయ్య (తెలుగు) (1976) : ఎటు చూసినా నీ బొమ్మే కనిపించింది
- నిజం నిద్రపోదు (తెలుగు) (1976)
- అదృష్టవంతురాలు (తెలుగు) (1976)
- ఈ కాలపు పిల్లలు (తెలుగు) (1976)
- భక్త కన్నప్ప (తెలుగు) (ఆదినారాయణరావు తో) (1976)
- దేవుడు చేసిన బొమ్మలు (తెలుగు) (1976)
- సంపూర్ణ శివపురాణము (హిందీ నుండి డబ్బింగ్) (1976)
- సీతమ్మ సంతానం (తెలుగు) (1977)
- సూత్రద బొంబె (కన్నడంం (1976)
- ప్రేమించి పెళ్ళి చేసుకో (తెలుగు) (1977)
- అందమె ఆనందం (తెలుగు) (1977) : ఇదే ఇదే నేను కోరుకుంది...ఇలా ఇలా చూడాలని ఉంది
- ఒకే రక్తం (తెలుగు) (1977)
- ఎదురీత (తెలుగు) (1977) : ఎదురీతకు అంతం లేదా, ఈ రాధ చివరకు ఏమైనా, తొలిసారి ముద్దివ్వమంది
- కాడ్గిచ్చు (కన్నడంం (1977)
- నాగర హొళె (కన్నడంం (1977)
- ప్రేమలేఖలు (తెలుగు) (1977) : ఇది తీయని వెన్నెల రేయి
- సహోదరర సవాల్ (కన్నడంం (1977)
- అమరదీపం (తెలుగు) (1977) : ఏ రాగమో ఇది ఏ తాళమో, నా జీవన సంధ్యా సమయంలో
- జరుగుతున్న కథ (తెలుగు) (1977)
- పెళ్లి కాని పెళ్లి (తెలుగు) (1977)
- మనుషులు చేసిన దొంగలు (తెలుగు) (1977) : ఆనందం అబ్బాయిదైతే అనురాగం అమ్మాయిదైతే
- తొలిరేయి గడిచింది (తెలుగు) (1977)
- దొంగలకు దొంగ (తెలుగు) (1977) : ఈ రాతిరి ఓ చందమామా, పగడాల దీవిలో పరువాల చిలక
- అల్లరి పిల్లలు (తెలుగు) (1978) : శ్రీచక్ర శుఖనివాస స్వామి జగమేలు చిద్విలాసా, నా రాశి కన్యరాశి, నా రాశి మిథునరాశి
- కలియుగ స్త్రీ (తెలుగు) (1978)
- నాయుడు బావ (తెలుగు) (1978)
- నిండు మనిషి (తెలుగు) (1978) : ఇంతటి సొగసే ఎదురుగా ఉంటే, ప్రేమించుకుందాం ఎవరేమన్న
- మైత్రి (కన్నడంం (1978)
- అన్నదమ్ముల సవాల్ (తెలుగు) (1978) : నా కోసమే నీవున్నది, నీ రూపమే నా మదిలోన తొలిదీపమై
- ఏజెంట్ గోపి (తెలుగు) (1978) : ఓ పిల్లా కాచుకో, చిటపట చినుకుల మనకోసం కురిసాయి, హంస బలే రామచిలక ఓలమ్మీ
- దొంగల దోపిడీ (తెలుగు) (1978)
- ఖైదీ నెం: 77 (తెలుగు) (1978)
- గమ్మత్తు గూఢచారులు (తెలుగు) (1978)
- కలియుగ సీత' (తెలుగు) (1978)
- ముయ్యిగె ముయ్యి (కన్నడంం (1978)
- ప్రేమ చేసిన పెళ్ళి (తెలుగు) (1978)
- దొంగల వేట (తెలుగు) (1978)
- చెప్పింది చేస్తా (తెలుగు) (1978)
- రామచిలుక (తెలుగు) (1978) : రామచిలకా పెళ్ళికొడకెవరే
- అంగడి బొమ్మ (తెలుగు) (1978) : అహో అందాలరాశి అహో అలనాటి ఊర్వశి
- డూడూ బసవన్న (తెలుగు) (1978) : ముత్యాల కోనలోన రతనాల రామచిలక
- రిక్షా రాజి (తెలుగు) (1978)
- అడవి మనుషులు (తెలుగు) (1978)
- లాయర్ విశ్వనాధ్ (తెలుగు) (1978) : పిలిచె పిలిచె అనురాగం
- తుఫాన్ మెయిల్ (తెలుగు) (1978)
- చిలిపి చిట్టెమ్మ (తెలుగు) (1978)
- మానవులు మమతలు (తెలుగు) (విడుదల కాలేదు) (1979)
- ఇద్దరూ అసాధ్యులే (1979) : చినుకు చినుకు పడుతూ ఉంటే
- వియ్యాలవారి కయ్యాలు (1979) : ఓ కలలోని ఊర్వశి, పాలుపొంగే వయసే నీది
- ఐ లవ్ యూ (తెలుగు) (1979) : ఒక మాటుంది కలవరము రేపి
- ఐ లవ్ యూ (కన్నడంం (1979)
- మూడు పువ్వులు ఆరు కాయలు (తెలుగు) (1979)
- కోరికలే గుర్రాలైతే (తెలుగు) (1979) : కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే
- ఏది పాపం? ఏది పుణ్యం? (తెలుగు) (1979) : కాలమిలా ఆగిపోనీ కలనిజమై సాగిపోనీ
- కలియుగ మహాభారతం (తెలుగు) (1979)
- రామబాణం (తెలుగు) (1979) : అమ్మ ప్రేమకు మారుపేరు
- లక్ష్మీ పూజ (తెలుగు) (1979)
- అల్లరి పిల్లలు (1979)
- అందడు - ఆగడు (తెలుగు) (1979)
- కార్తీక దీపం (తెలుగు) (1979) : ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం, నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి
- పెద్దిల్లు చిన్నిల్లు (తెలుగు) (1979)
- దొంగలకు సవాల్ (తెలుగు) (1979)
- ఛాయ (తెలుగు) (1979)
- మా ఊళ్ళో మహాశివుడు (తెలుగు) (1979)
- టైగర్ (తెలుగు) (1979) : క్షణం క్షణం నిరీక్షణం
- దశ తిరిగింది (తెలుగు) (1979)
- సీతే రాముడైతే (తెలుగు) (1979)
- మన ఊరి మారుతి (తెలుగు) (1979)
- కొత్త కోడలు (తెలుగు) (1979)
- భువనేశ్వరి (తెలుగు) (1979) : ఏమని పిలవాలి నిన్నేమని పిలవాలి
- రతీ మన్మథ (తెలుగు) (1979)
- నామాల తాతయ్య (తెలుగు) (1979)
- సవతియ నెరళు (కన్నడంం (1979)
- సీత రాము (కన్నడంం (1979)
- విజయ్ విక్రమ్ (కన్నడంం (1979)
- శ్రీ రామబంటు (తెలుగు) (1979)
- ఆరని మంటలు (తెలుగు) (1980)
- ఆరద గాయ (కన్నడంం (1980)
- మహాలక్ష్మి (తెలుగు) (1980)
- ధర్మచక్రం (తెలుగు) (1980)
- నకిలీ మనిషి (తెలుగు) (1980)
- ప్రేమ తరంగాలు (తెలుగు) (1980)
- సీతారాములు (తెలుగు) (1980)
- మూడు ముళ్ళ బంధం (తెలుగు) (1980)
- మూగన సేడు (కన్నడంం (1980)
- రామాయణంలో పిడకల వేట (తెలుగు) (1980)
- చండీప్రియ (తెలుగు) (1980)
- సింహ జోడి (కన్నడంం (1980)
- కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (తెలుగు) (1980)
- బంగారు బావ (తెలుగు) (1980)
- రాముడు - పరశురాముడు (తెలుగు) (1980)
- దేవుడిచ్చిన కొడుకు (తెలుగు) (1980)
- మహాశక్తి (తెలుగు) (1980)
- సుబ్బారాయుడు సుబ్బలక్ష్మి (తెలుగు) (1980)
- కొంటె మొగుడు పెంకి పెళ్ళాం (తెలుగు) (1980)
- చేసిన బాసలు (తెలుగు) (1980)
- రగిలే హృదయాలు (తెలుగు) (1980)
- హద్దిన కణ్ణు (కన్నడంం (1980)
- పెళ్ళి గోల (తెలుగు) (1980)
- బడాయి బసవయ్య (1980)
- మనవూరి రాముడు (విడుదల కాలేదు) (1980)
- రాహువు కేతువు (విడుదల కాలేదు) (1980)
- స్వప్న (తెలుగు) (1980)
- స్వప్న (కన్నడంం (1981)
- పార్వతీ పరమేశ్వరులు (తెలుగు) (1981)
- తోడు దొంగలు (తెలుగు) (1981)
- ఆవళి జావళి (కన్నడంం (1981)
- ప్రేమ నాటకం (తెలుగు) (1981)
- నాదే గెలుపు (తెలుగు) (1981)
- గడసరి అత్త సొగసరి కోడలు (తెలుగు) (1981)
- టాక్సీ డ్రైవర్ (తెలుగు) (1981)
- దెవర ఆట (కన్నడంం (1981)
- నేను మా ఆవిడ (తెలుగు) (1981)
- గిరిజా కళ్యాణం (తెలుగు) (1981)
- ఘరానా గంగులు (తెలుగు) (1981)
- కెరళిద సింహ (కన్నడంం (1981)
- సింహద మరి సైన్య (కన్నడంం (1981)
- స్నేహితర సవాల్ (కన్నడంం (1981)
- అత్తగారి పెత్తనం (తెలుగు) (1981)
- ఏటు ఎదురేటు (కన్నడం) (1981)
- వాడని మల్లి (తెలుగు) (1981)
- చందమామ రావే (తెలుగు) (1981)
- సుబ్బారావుకి కోపం వచ్చింది (తెలుగు) (1981)
- రహస్య గూఢచారి (తెలుగు) (1981)
- పాలు నీళ్ళు (తెలుగు) (1981)
- మధుర స్వప్నం (తెలుగు) (1982)
- ఆజిత్ (కన్నడంం (1982)
- ఊరిగె ఉపకారి (కన్నడంం (1982)
- బంగారు కానుక (తెలుగు) (1982)
- గృహ ప్రవేశం (తెలుగు) (1982)
- గరుడ రేఖె (కన్నడంం (1982)
- హెణ్ణు హులి (కన్నడంం (1982)
- మావ సొసె సవాల్ (కన్నడంం (1982)
- తల్లీ కొడుకుల అనుబంధం (తెలుగు) (1982)
- నిప్పుతో చెలగాటం (తెలుగు) (1982)
- కృష్ణార్జునులు (తెలుగు) (1982)
- కోరుకున్న మొగుడు (తెలుగు) (1982)
- ప్రతిజ్ఞ (తెలుగు) (1982)
- స్వయంవరం (తెలుగు) (1982)
- సాహస సింహ (కన్నడంం (1982)
- చందమామ (తెలుగు) (1982)
- చెల్లిద రక్త (కన్నడంం (1982)
- పట్నం వచ్చిన పతివ్రతలు (తెలుగు) (1982)
- ఎంత ఘాటు ప్రేమయో (తెలుగు) (1982)
- పగబట్టిన సింహం (తెలుగు) (1982)
- షంషేర్ శంకర్ (తెలుగు) (1982)
- బిల్లా రంగా (తెలుగు) (1982)
- సవాల్ (తెలుగు) (1982)
- కదిలి వచ్చిన కనకదుర్గ (తెలుగు) (1982)
- ముళ్ళిన గులాబి (కన్నడంం (1982)
- మొండి ఘటం (తెలుగు) (1982)
- ప్రేమ నాటకం (తెలుగు) (1982)
- పెదబాబు (విడుదల కాలేదు) (1982)
- పెళ్లంటే నూరేళ్ల పంట (విడుదల కాలేదు) (1982)
- మాయదారి మనుషులు (విడుదల కాలేదు) (1982)
- అగ్నిజ్వాల (తెలుగు) (1983)
- ఆక్రోష (కన్నడంం (1983)
- పులిదెబ్బ (తెలుగు) (1983)
- ధర్మ పోరాటం (తెలుగు) (1983)
- కోడలు కావాలి (తెలుగు) (1983)
- కుంకుమ తిలకం (తెలుగు) (1983)
- గండుగలి రామ (కన్నడం) (1983)
- అగ్ని సమాధి (తెలుగు) (1983)
- ఆలయ శిఖరం (తెలుగు) (1983)
- మరో మాయాబజార్ (తెలుగు) (1983)
- పల్లెటూరి పిడుగు (తెలుగు) (1983)
- ఆంధ్రకేసరి (తెలుగు) (983)
- సిరిపురం మొనగాడు (తెలుగు) (1983)
- సిడెదెద్ద సహొదర (కన్నడం) (1983)
- సింహ గర్జనె (కన్నడం) (1983)
- ఇకనైనా మారండి (1983)
- చలిసద సాగర (కన్నడంం (1983)
- చండీ చాముండీ (తెలుగు) (1983)
- చండీ చాముండీ (కన్నడం) (1983)
- చిన్నదంథ మగ (కన్నడం) (1983)
- రోషగాడు (తెలుగు) (1983)
- కలియుగ దైవం (తెలుగు) (1983)
- పండంటి కాపురానికి 12 సూత్రాలు (తెలుగు) (1983)
- రాకాసి లోయ (తెలుగు) (1983)
- తాయియ నుడి (కన్నడం) (1983)
- తిరుగు బాణ (కన్నడం) (1983)
- ధర్మాత్ముడు (తెలుగు) (1983)
- కళ్యాణ వీణ (తెలుగు) (1983)
- రుద్రకాళి (తెలుగు) (1983)
- మూగవాని పగ (తెలుగు) (1983)
- మక్కళే దేవరు (కన్నడం) (1983)
- మనెగె బంద మహాలక్ష్మి (కన్నడం) (1983)
- బందిపోటు రుద్రమ్మ (1983)
- ఆశకిరణ (కన్నడం) (1984)
- చాణక్య (కన్నడం) (1984)
- ధర్మ (కన్నడం) (1984)
- పద్మవ్యూహం (తెలుగు) (1984)
- దోపిడి దొంగలు (తెలుగు) (1984)
- పుణ్యం కొద్దీ పురుషుడు (తెలుగు) (1984)
- ఈ కాలం కథ (తెలుగు) (1984)
- ఓడెద హాలు (కన్నడం) (1984)
- దొంగలు బాబోయ్ దొంగలు (1984)
- సుందరి సుబ్బారావు (తెలుగు) (1984)
- నాయకులకు సవాల్ (తెలుగు) (1984)
- దేవుని రూపాలు (తెలుగు) (1984)
- మహానగరంలో మాయగాడు (తెలుగు) (1984)
- కుర్ర చేష్టలు (తెలుగు) (1984)
- కర్తవ్య (కన్నడం) (1984)
- ఉగ్రరూపం (1984)
- గృహలక్ష్మి (తెలుగు) (1984)
- బెక్కిన కణ్ణు (కన్నడం) (1984)
- నగబేకమ్మ నగబేకు (కన్నడం) (1984)
- పూజా ఫల (కన్నడం) (1984)
- ప్రేమ జ్యోతి (కన్నడం) (1984)
- రక్త తిలక (కన్నడం) (1984)
- రౌడి రాజ (కన్నడం) (1984)
- సిడిలు (కన్నడం) (1984)
- తాళియ భాగ్య (కన్నడం) (1984)
- తాయి నాడు (కన్నడం) (1984)
- విఘ్నేశ్వర వాహన (కన్నడం) (1984)
- రాజమండ్రి రోమియో (1984)
- పులి పంజా (1984)
- అమర జ్యోతి (కన్నడం) (1985)
- ఆగ్రహం (తెలుగు) (1985)
- ఆలయ దీపం (తెలుగు) (1985)
- వస్తాద్ (తెలుగు) (1985)
- అగ్గిరాజు (తెలుగు) (1985)
- కుటుంబ బంధం (తెలుగు) (1985)
- కిలాడి ఆళియ (కన్నడం) (1985)
- వింత మొగుడు (తెలుగు) (1985)
- గర్జన (తెలుగు) (1985)
- అఖండ నాగప్రతిష్ఠ (తెలుగు) (1985)
- పాతాళ నాగు (తెలుగు) (1985)
- రుణానుబంధం (1985)
- ముసుగు దొంగ (1985)
- మారుతి మహిమె (కన్నడం) (1985)
- నన్న ప్రతిజ్ఞ (కన్నడం) (1985)
- ప్రళయ రుద్ర (కన్నడం) (1985)
- సతి సక్కుబాయి (కన్నడం) (1985)
- తాయి కనసు (కన్నడం) (1985)
- తాయి మమత (కన్నడం) (1985)
- తాయిమ హూణె (కన్నడం) (1985)
- బెబ్బులి వేట (తెలుగు) (1985)
- లక్ష్మి కటాక్ష (కన్నడం) (1985)
- వజ్ర ముష్టి (కన్నడం) (1985)
- ఇద్దరు మిత్రులు (తెలుగు) (1985)
- 'సుమన్' (విడుదల కాలేదు) (1985)
- ఆజ్ కే షోలే (హిందీ) (1985)
- అనాదిగా ఆడది (తెలుగు) (1986)
- కుట్ర (తెలుగు) (1986)
- నాంపల్లి నాగు (తెలుగు) (1986)
- ఖైదీరాణి (తెలుగు) (1986)
- ప్రతిభావంతుడు (తెలుగు) (1986)
- జీవనరాగం (తెలుగు) (1986)
- ఆది దంపతులు (తెలుగు) (1986)
- కారు దిద్దిన కాపురం (తెలుగు) (1986)
- కేడి నెం 1 (కన్నడం) (1986)
- ఉగ్రనరసింహం (తెలుగు) (1986)
- అర్ధరాత్రి స్వతంత్రం (తెలుగు) (1986)
- తలంబ్రాలు (తెలుగు) (1986)
- తాయి (కన్నడం) (1986)
- తాయియే నన్న దేవరు (కన్నడం) (1986)
- దొరబిడ్డ (తెలుగు) (1986)
- నమ్మూర దేవత (కన్నడం) (1986)
- మామా కోడలు సవాల్ (1986)
- మదువె మాడు తమాషె నోడు (కన్నడం) (1986)
- విజృంభణ (తెలుగు) (1986)
- ఇల్లాలి ప్రతిజ్ఞ (తెలుగు) (1986)
- శ్రీ వేమన చరిత్ర (తెలుగు) (1986)
- సన్న జాజులు (తెలుగు) (1986)
- సంసారద గుట్టు (కన్నడం) (1986)
- సత్కార (కన్నడం) (1986)
- సేడిన సంచు (కన్నడం) (1986)
- బెళ్లి నాగ (కన్నడం) (1986)
- బెట్టద తాయి (కన్నడం) (1986)
- బ్రహ్మస్త్ర (కన్నడం) (1986)
- రస్తే రాజ (కన్నడం) (1986)
- ప్రేమ సామ్రాట్ (తెలుగు) (1987)
- అల్లుడి కోసం (తెలుగు) (1987)
- అన్నపూర్ణమ్మగారి అల్లుడు (తెలుగు) (1987)
- భలే మొగుడు (తెలుగు) (1987)
- బజార్ భీమ (కన్నడం) (1987)
- భద్రకాళి (కన్నడం) (1987)
- దొరకని దొంగ (తెలుగు) (1987)
- ఆహుతి (తెలుగు) (1988)
- ఆలోచించండి (తెలుగు) (1988)
- డిసంబర్ 31 (కన్నడం) (1988)
- పృథ్వీరాజ్ (1988)
- తాయి కరుళు (కన్నడం) (1988)
- ఊరేగింపు (తెలుగు) (1988)
- సిరిపురం చిన్నోడు (తెలుగు) (1988)
- సాహస వీర (కన్నడం) (1988)
- ఆగష్టు 15 రాత్రి (తెలుగు) (1988)
- కాంచన సీత (తెలుగు) (1988)
- న్యాయక్కాగి నాను (కన్నడం) (1989)
- శ్రీరామచంద్రుడు (తెలుగు) (1989)
- అంకుశం (తెలుగు) (1990)
- పుండర గండ (కన్నడం) (1990)
- కాళరాత్రిలో కన్నెపిల్ల (తెలుగు) (1992)
- ప్రతి ఫల (కన్నడం) (1993)
బయటి లింకులు
మూలాలు
- ↑ స్వర్ణయుగ సంగీత దర్శకులు, పులగం చిన్నారాయణ, చిమట మ్యూజిక్, 2010.