మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తెలుగు సినిమా నటీనటుల సంక్షేమం కోసం అక్టోబర్ 4న 1993లో ఏర్పాటైన సంస్థ. మా అసోసియేషన్ ఏర్పడిన కొత్తలో 150 మంది సభ్యులతో ఏర్పాటైంది. మా అసోసియేషన్ 2021 ఎన్నికల నాటికీ 900 మందికి పైగా శాశ్వత సభ్యులు ఉండగా, 29 మంది అసోసియేట్ సభ్యులు, 18 మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. వీరిలో 850 మంది యాక్టివ్ సభ్యులుగా ఉన్నారు.[1]
మా ఉద్దేశము
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఆంగలం: Movie Artists Association) ఏర్పాటైన ప్రధాన కారణం నటీనటులకు సంబంధించిన పారితోషికాలు, దర్శక నిర్మాతలతో వివాదాలు, సభ్యుల సంక్షేమాన్ని చూసుకోవడం. నిర్మాతలెవరైనా నటీనటులకు పారితోషకం ఇవ్వకపోయినా, దర్శక నిర్మాతలకు నటీనటులకు గొడవలు జరిగినా మా జోక్యం చేసుకుని వాటిని పరిష్కరిస్తుంది. నిరుపేద కళాకారులు, వృద్ధ కళాకారుల ఆరోగ్యం కోసం సహాయం చేయడం, అవకాశాలు లేని వారికి సినిమా అవకాశాలు ఇప్పించడం కోసం ఏర్పాటైంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షులు
ఇవి కూడా చదవండి
మూలాలు