మాహే, భారత కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని,మాహే జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణం.దీనిని మయ్యాజి అని కూడా పిలుస్తారు.ఇది మాహే నది ముఖద్వారం వద్ద ఉంది.దీనికి సమీపంలో కేరళ రాష్ట్రం ఉంది. దీనికి మూడు వైపులా కన్నూర్ జిల్లా,ఒక వైపు కోజికోడ్ జిల్లాలు ఉన్నాయి.గతంలో ఫ్రెంచ్ భారతదేశంలో భాగమైన మాహే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని నాలుగు జిల్లాల్లో ఒకటైన మాహే జిల్లాలో పురపాలక సంఘంగా ఉంది.పుదుచ్చేరి శాసనసభలో మాహే నియోజక వర్గం నుండి ఒక ప్రతినిధి ఉన్నాడు.
మాహే లేదా మాహే అనే పేరు మయ్యాజి నుండి వచ్చింది.ఈ పేరు స్థానిక నదికి, ఆ ప్రాంతానికి మలయాళ భాషలోమయ్యాజి అనే పేరు వాడుకలోకి వచ్చింది.1720 ప్రారంభకాలంలో ఫ్రెంచ్ పత్రాలలో కనిపించే అసలు ఉచ్చారణ పదం భౌగోళిక నిఘంటువు ప్రకారం దాని పత్రాలు, పటాలలో19 వ శతాబ్దం వరకు కనిపించే ఉచ్చారణ పదం మాయే, తరువాత మేయే,ఆతరువాత ఈ పట్టణం పేరు బెర్ట్రాండ్ ఫ్రాంకోయిస్ మాహే డి లా బౌర్డోనాయిస్ (1699-1753) గౌరవార్థం "మాహే"గా మారింది అనే నమ్మకం. తరువాత భారతదేశంతో అతని అనుబంధం 1741లో మాయను స్వాధీనం చేసుకోవడంతో సహా ఖ్యాతిచెంది మంచి భాగస్వామ్యం పొందింది.[1]
ఆ సమయంలో లా బౌర్డోనాయిస్ పాత్రను గుర్తించి 1726 లో నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న యాత్ర నాయకుడు మాహే ఉచ్చారణను అధికారికంగా స్వీకరించారని మరొక వాదన కూడా ఉంది.[2] లా బౌర్డోనాయిస్ కుటుంబ పేరుతో మాయే పోలిక,మాహే పోలిక తరువాతి తరాలకు ఫ్రెంచ్ వ్యక్తి పేరు ఉచ్చారణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉందని భావించడానికి ప్రేరేపించింది.
యూరోపియన్ వలసరాజ్యాల శక్తులు భారతదేశంలోకి ప్రవేశించడానికి ముందు,ఈ ప్రాంతం కొలాత్తు నాడులో భాగంగా ఉంది.ఇందులో తులునాడు, చిరక్కల్. కదతనాడు ఉన్నాయి.ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1724 లో మాహే స్థలంలో ఆండ్రే మొలాండిన్, వతకరాకు చెందిన రాజా వజున్నవర్ మధ్య మూడు సంవత్సరాల క్రితం ముగిసిన ఒప్పందం ప్రకారం ఒక కోటను నిర్మించింది. మాహే డి లా బౌర్డోనాయిస్ మరాఠాలు కొద్దికాలం ఆక్రమించిన తరువాత 1741 లో పట్టణాన్ని తిరిగి పొందారు.
బ్రిటిష్ వారు 1761 లోమాహేను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థావరాన్ని కదతనాడు రాజుకు అప్పగించారు.763 పారిస్ ఒప్పందంలో భాగంగా బ్రిటిష్ వారు మాహేను ఫ్రెంచ్‌కు తిరిగి అప్పగించారు.1779 లో, ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధం మొదలైంది, ఫలితంగా ఫ్రెంచ్ మాహేను కోల్పోయింది. 1783 లో బ్రిటీష్ వారు భారతదేశంలో వారి స్థావరాలను పునరుద్ధరించడానికి అంగీకరించారు.1785 లో మాహేను ఫ్రెంచ్ వారికి అప్పగించారు.[3]
1793 లో ఫ్రెంచ్ విప్లవాత్మక యుద్ధాలు ప్రారంభమైనప్పుడు, జేమ్స్ హార్ట్లీ నేతృత్వంలోని బ్రిటిష్ దళం మాహేను స్వాధీనం చేసుకుంది.నెపోలియన్ యుద్ధాలు ముగిసిన తరువాత 1816 లో పారిస్ ఒప్పందంలో భాగంగా1816 లో బ్రిటిష్ వారు మాహేను ఫ్రెంచ్‌కు పునరుద్ధరించారు1816 లో ప్రారంభమైన సుదీర్ఘ కాలంలో మయాజి ఒక చిన్న ఫ్రెంచ్ కాలనీగా, బ్రిటిష్ ఇండియాలో ఒక ఎన్‌క్లేవ్‌గా ఉన్నారు.భారత స్వాతంత్ర్యం తరువాత ఈ ప్రాంతం 13 జూన్ 1954 వరకు ఫ్రెంచ్ పాలనలో కొనసాగింది, సుదీర్ఘ వలస వ్యతిరేకత ఇండియన్ యూనియన్‌లో చేరడంతో పోరాటం ముగిసింది
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం,[4] మాహే పట్టణ జనాభా మొత్తం 41,816, వీరిలో ప్రధానంగా ఎక్కువమంది మలయాళీలు.జనాభా మొత్తంలో పురుషులు 46.5% మంది ఉన్నారు.మాహే సగటు అక్షరాస్యత 97.87%గా ఉంది.పురుషల అక్షరాస్యత 98.63%, స్త్రీల అక్షరాస్యత 97.25%. మాహే జనాభాలో 10.89% మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఉన్నారు.
కేరళలోని మలబార్ తీరంలో ఉన్నవారందరిలాగే ఈ ప్రాంతం సంస్కృతి, భౌగోళికం ఉంటాయి.ప్రధాన పండుగ విజు, ఓనం,ఈద్. ప్రధాన భాష మలయాళం జనాభాలో తమిళం, అరబిక్ మాట్లాడేవారూ ఉన్నారు.
మాహే ఒక ఉష్ణమండల రుతుపవన వాతావరణం (కొప్పెన్ ఆమ్)తో ఉంటుంది.కేరళ కర్ణాటక తీరానికి విలక్షణమైంది. డిసెంబరు నుండి మార్చి వరకు పొడిగా ఉంటుది, కానీ పశ్చిమ కనుమల గాలిదిశ వైపున ఉన్న ప్రదేశం అంటే, పశ్చిమ రుతుపవనాల సమయంలో ఈ ప్రాంతం అధిక వర్షపాతం పొందుతుంది.జూలైలో వర్షపాతం 10,80 మి.మీ. (43 అం.) వరకు చేరుకుంటుంది.
మాహేకు సమీప విమానాశ్రయం 40 కి.మీ. (25 మైళ్లు) దూరంలో మట్టన్నూర్ లోని కన్నూర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం తదుపరి సమీప విమానాశ్రయం 85 కి.మీ. (53 మైళ్ళు) దూరంలో కరిపూర్ లోని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం.సమీప రైల్వే స్టేషన్ మాహే రైల్వే స్టేషన్, ఇక్కడ కొన్ని స్థానిక ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి.చాలా దూర రైళ్లు ఆగే సమీప ప్రధాన రైల్వే స్టేషన్లు తలస్సరీ, కన్నూర్, మంగుళూరు, వటకర.