సా.శ. 1585లో విజయనగర సామ్రాజ్యం పతనమై, విజయనగరాన్ని దక్కన్ ప్రాంత ముస్లింరాజుల సమాఖ్య పూర్తిగా నేలమట్టం చేసినాకా విజయనగర సామ్రాట్టులు తమ రాజ్యాన్ని కొన్నాళ్ళ పాటు పెనుకొండకు మార్చారు.[2]
గ్రామ భౌగోళికం
ఈ గ్రామ విస్తీర్ణం 6555 హెక్టార్లు.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామంలో 6752 ఇళ్లున్నాయి. మొత్తం జనాభా 27382. గ్రామంలో మగవారి సంఖ్య 13860, ఆడవారి సంఖ్య 13522.[3]
విద్యా సౌకర్యాలు
సమీప ఇంజనీరింగ్ కళాశాల హిందూపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అనంతపురంలో ఉన్నాయి.
పెనుకొండ పెద్దకొండ: పెనుకొండ కొండ మీదకు ప్రభుత్వ నిధులతో తారు రోడ్డును 2012 వ సంవత్సరంలో ఏర్పాటు చెయడం జరిగింది. ముఖ్యంగా పెనుకొండ కొండపై నిర్మించబడిన నరసింహ స్వామివారిదేవాలయము, కోనేరు, చెరువు, శత్రు దుర్భేధ్యమైన కోట చూడదగిన ప్రదేశములు. ఇక్కద నరసింహస్వామివారి దేవాలయం ముందు విశాలమైన మైదానము ఉంది. ఇది వాహనములు నిలుపుటకు, విడదికొరకు అనువైన ప్రదేశం.
పెనుకొండ కోట: బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి.
యెర్రమంచి గేటు: ఇందులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారు. పెనుకొండలో 365 దేవాలయాలు వుండేవని చరిత్ర చెబుతోంది. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించారు.
భూపోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశాడు.ఇతను కూడా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు ఎన్. శంకర్శ్రీరాములయ్య అనే సినిమా తీశాడు. రవి జీవితం నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ, రక్త చరిత్ర పేరుతో రెండు సినిమాలు తీశాడు. రాష్ట్రంలోని రాజకీయ నాయకుల్లో ఒకడైన పరిటాల రవీంద్ర ఈ నియోజక వర్గం నుండే ప్రాతినిధ్యం వహించాడు.
సంధ్యావందనం శ్రీనివాసరావు - ఇతడు పెనుకొండలో 1918, ఆగష్టు 21న నారాయణరావు, గంగాబాయి దంపతులకు జన్మించాడు[4] ఇతడు సంగీతంలో ప్రాథమిక పాఠాలు పల్లవి పక్క హనుమంతాచార్, తిరుపతి రంగాచార్యులు, చిలమత్తూరు రామయ్యల వద్ద అభ్యసించాడు. తరువాత ఇతడు టైగర్ వరదాచారి, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ద్వారం వేంకటస్వామినాయుడు, మైసూరు వాసుదేవాచార్ల వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకున్నాడు. శ్రద్ధతో, ఉత్సాహంతో, పట్టుదలతో అనేక ప్రాచీన సంప్రదాయ కీర్తనలు సేకరించి, స్త్రీలపాటలు, పల్లెపదాలు అనేకం ప్రోదిచేసి వాటి ద్వారా ప్రాచీన రాగాల స్వరూపాలను కల్పన చేశాడు.