పరిటాల సునీత

పరిటాల సునీత
పరిటాల సునీత


నియోజకవర్గం రాప్తాడు

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగు దేశం
జీవిత భాగస్వామి పరిటాల రవీంద్ర
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసం వెంకటాపురం
మతం హిందూ

పెనుకొండ దివంగత శాసనసభ్యులు శ్రీ పరిటాల రవీంద్ర గారి భార్య శ్రీమతి పరిటాల సునిత.

ఈమె పెనుకొండ శాసనసభ నియొజక వర్గంనుండి 2005 సం|| ఒక సారి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు, ప్రస్తుతము రాప్తాడు నియెుజక వర్గ శాసన సభ్యురాలిగా ఉన్నారు.

పరిటాల సునీత 1970 మే 20 వతేదీన అనంతపురం జిల్లా, రామగిరి మండలం, వెంకటాపురం గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ధర్మవరకు కొండన్న, తల్లి సత్యవతి. ఈమెకు ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు (బాలాజీ, మురళి) ఉన్నారు.

1984 అక్టోబరు 27 న ఈమె వివాహం పరిటాల రవీంద్రతో జరిగింది. ఒక సాధారణ గృహిణిగా వున్న పరిటాల సునీత, భర్త పరిటాల రవీంద్ర హత్యానంతరం తప్పనిసరి పరిస్థితులలో రాజకీయ రంగప్రవేశం చేయవలసి వచ్చింది. ఆమె 2014లో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత, శిశు సంక్షేమం, వికలాంగ, వృద్ధుల సంక్షేమం శాఖల మంత్రిగా పని చేసింది.[1][2]

మూలాలు

  1. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  2. BBC News తెలుగు (8 May 2024). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోని ఈ మహిళలు ఎవరు, వారి ప్రత్యేకతలేంటి?". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!