పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న మాఫియా డాన్ దేవ (నాగార్జున), తనను ఆదరించి పెంచిన దాదా (శరత్ కుమార్)ను ప్రత్యర్థులు చంపేయటంతో బయటకు వస్తాడు. దేవ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు దేవాను పట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. దీంతోపాటు దాదాను చంపిన డేవిడ్ (కునాల్ కపూర్) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఓ పోలీస్ దాడిలో గాయపడిన దేవకు డాక్టర్ దాస్ (నాని) చికిత్స చేస్తాడు. తన గురించి తెలిసినా కూడా పోలీసులకు పట్టివ్వని దాస్ మంచితనం చూసి, దేవ అతనితో స్నేహం చేస్తాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడిన దాస్, తరువాత దేవకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. ఇద్దరి మధ్య స్నేహం ఎలా కుదిరింది, పోలీసుల నుంచి, డేవిడ్ గ్యాంగ్ నుంచి దేవ తప్పించుకున్నాడా, దాదాను చంపిన వారి మీద పగ తీర్చుకున్నాడా అన్నది మిగతా కథ.[6]
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. 2018, సెప్టెంబరు 21న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా, సినీరంగం ముఖ్యుల సమక్షంలో పాటల విడుదల కార్యక్రమం జరిగింది.[9] పాటలకు మిశ్రమ స్పందన లభించింది.[10]
↑Dundoo, Sangeetha Devi (27 సెప్టెంబరు 2018). "'Devadas' review: The N factor". Archived from the original on 28 సెప్టెంబరు 2018. Retrieved 2 ఏప్రిల్ 2020 – via www.thehindu.com.