చంపావత్ జిల్లా ఉత్తర భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. చంపావత్ పట్టణం దీని పరిపాలనా ప్రధాన కార్యాలయం. జిల్లాలో ప్రధానంగా మాట్లాడే భాష కుమావోని.[1] చంపావత్ జిల్లా 1997లో ఏర్పాటైంది.
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం చంపావత్ జిల్లా జనాభా 2,59,648. ఇది వనాటు దేశ జనాభాకు సమానం. జనాభా పరంగా చంపావత్, భారతదేశంలోని 640 జిల్లాలలో ఇది 579వ స్థానంలో ఉంది.
జిల్లాలో ఒక చదరపు కిలోమీటరుకు 147 మంది ప్రజలు ఉన్నారు. 2001–2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 15.63%. చంపావత్ జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 980 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. అక్షరాస్యత రేటు 79.83% శాతం ఉంది[2]
తాలూకాలు
పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను బరాకోట్, లోహాఘాట్, పతి, పూర్ణగిరి, చంపావత్ అనే ఐదు తహసీల్‌లుగా విభజించబడింది. పుల్లా, మంచ్ అనే 2 ఉప తహసీల్స్ ఉన్నాయి [3] జిల్లాలో అతిపెద్ద ప్రధాన నగరం తనక్పూర్ .
మాట్లాడే భాషలు ప్రకారం జిల్లాలోని జనాభా
చంపావత్ జిల్లా: 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మాతృభాష.[4]