కోటగిరి వెంకటేశ్వరరావు

కోటగిరి వెంకటేశ్వరరావు
వృత్తిఎడిటర్
జీవిత భాగస్వామిసుజాత
పిల్లలు2 అమ్మాయిలు

కోటగిరి వెంకటేశ్వరరావు భారతీయ సినిమా ఎడిటర్. ఈయన సోదరుడు కోటగిరి గోపాలరావు కూడా ఎడిటర్ గా పనిచేశారు.

జీవిత సంగ్రహం

కోటగిరి వెంకటేశ్వరరావు పూర్వీకులు జమీందారు దగ్గర దివాన్లుగా పనిచేశారు.[1] వీరికి ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు అక్కయ్యలు. అందరికన్నా కోటగిరి గోపాలరావు పెద్దవాడు. చిన్నతనంలోనే వీరి తండ్రి మరణించడంతో అన్నగాగే ఇంటి బాధ్యతలను చూశారు. బ్రతుకు తెరువు కోసం మద్రాసు చేరి, జమిందారు స్టుడియోలో ఆదుర్తి సుబ్బారావు లాంటి వారి సినిమాలకు ఎడిటింగ్ చేస్తుండేవారు.

చదువు మీద శ్రద్ధ తగ్గి పదవ తరగతి పాసైన తర్వాత వెంకటేశ్వరరావు కూడా మద్రాసు చేరి మొదట నిశ్చల పొటోగ్రాఫర్ దగ్గర సహాయకునిగా చేరాడు. తర్వాత ఎడిటింగ్ లో చేరి అన్నయ్య దగ్గర పనిలోని మెళుకువలు నేర్చుకున్నాడు. గోపాలరావు అప్పుడు కె.రాఘవేంద్రరావు అడవి రాముడు (1977) సినిమా కోసం పనిచేస్తుండగా తను కూడా రెండు పాటల్ని ఎడిట్ చేసి సహాయం చేశారు. ఇదే తన మొదటి సినిమాగా టైటిల్స్ లో చూపించారు.

తర్వాత రాఘవేంద్రరావు సినిమాలతో పాటు, బి.గోపాల్, భారతీరాజా, ఎన్టీరామారావు మొదలైన ఎందరో సినీ దర్శకుల, నిర్మాతల చిత్రాలకు పనిచేశారు.

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా స్థిరపడక ముందు ఇతని దగ్గర ఒక సంవత్సర కాలం ఎడిటింగ్ నేర్చుకున్నారు.

వీరు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ఆరు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించారు. ఈ సంస్థ కోసం విరాళాలు పోగుచేసి స్వంత ఆఫీసును నిర్మించారు.

వీరు సుజాతను పెళ్ళిచేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.

పురస్కారాలు

నంది అవార్డులు

చిత్ర సమాహారం

మూలాలు

  1. ఇది అన్నయ్య నేర్పిన విద్య, ఈనాడు ఆదివారం 20 నవంబర్ 2011 లో కోటగిరి వెంకటేశ్వరరావు పరిచయం.
  2. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
  3. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  4. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  5. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  6. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
  7. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (14 February 2020). "వరల్డ్ ఫేమస్ లవర్.. రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
  8. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
  9. టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!