అనునాదం

ఒకే సహజ పౌనఃపున్యాలున్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేసే దృగ్విషయాన్ని "అనునాదం" అంటారు. దీనిని ఆంగ్లంలో (Resonance) అంటారు.

ప్రయోగం-1

శృతిదండాల అనునాదం
లఘు లోలకాలలో అనునాదం

రెండు మూతలు లేని ఖాళీ పెట్టెలను తీసుకొని వాటి మూతలు లేని భాగాలు ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చునట్లు అమర్చాలి. ఒకే సహజ పౌనఃపున్యం గల రెండు శృతిదండములను తీసికొని రెండు పెట్టెల పైన చెరొకటి అమర్చవలెను. ఒకశృతిదండమును రబ్బరు సుత్తితో కొట్టవలెను.అపుడు ఆ శృతిదండం గల పెట్టెలోని గాలిపొరలు కంపిస్తాయి. ఇలా కంపిస్తున్న గాలి పొరలు రెండవ పెట్టెలోపలి గాలి పొరలను కంపింప జేస్తాయి. అపుడు రెండవ పెట్టె పై గల శృతిదండం ఉత్తేజితమవుతుంది.హికఅపుడు రెండు శృతిదండములు అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేస్తాయి. ఈ దృగ్విషయాన్ని అనునాదం అంటారు.

  • ప్రయోగించబదిన ఆవర్తనా బల పౌనః పున్యము (మొదటి శృతిదండం, వస్తు స్వాభావిక పౌనః పున్యానికి సమానమైతే (రెండవ శృతిదండం) దానిని స్వీకరించి అధిక కంపన పరిమితితో కంపిస్తుంటుంది.

ప్రయోగం-2

A, B, C, D అనే నాలుగు లోలకములను MN ఆధారంతో ఉన్న రబ్బరు గొట్టానికి, నాలుగు స్థానాలలో వ్రేలాడదీయాలి. వాటిలో A, B లోలకముల పొడవులు సమానంగా ఉండునట్లు, C లోలకం పొట్టిగా ఉండునట్లు, D లోలకం పొడవుగా ఉండునట్లు అమర్చాలి. లఘులోలకం పౌనః పున్యం దాని పొడవు పై ఆధారపడుతుంది. కావున A, B లోలకములు ఒకే పౌనఃపున్యము కలిగి ఉంటాయి. వీటిలో లోలకమును డోలనాలు చేయునట్లు చేయాలి. కొంతసేపటికి అనునాద ప్రభావం వల్ల A, B లోకకములు అత్యధిక డోలనాపరిమితితో కంపించటం మన గమనించవచ్చు.

నిత్య జీవిత సంఘటనలు

  1. కవాతు చేసే సైనికులను వంతెన పై దాటునపుదు సాధారణ నడకతో దాటమంటారు. దీనికి కారణం కవాతు పౌనఃపున్యం వంతెన సహజ పౌనఃపున్యమునకు సమానమై అనునాదం యేర్పడినపుడు వంతెన కంపనపరిమితి అధికమై వంతెన కూలిపోయే ప్రమాదం ఉంది.
  2. రేడియోలో మనకు కావలసిన స్టేషను ఎంచుకొనేటప్పుడు, రేడియో ప్రసారిణి నుండి విడుదలైన విద్యుదయస్కాంత తరంగాలు పౌనః పున్యానికి సమానమైన సహజ పౌనఃపున్యాన్ని రేడియోలో సవరిస్తాం. దీనివల్ల ప్రసారిత, రేడియో సహజ పౌనఃపున్యములు సమానమై అనునాదం యెర్పడి మనకు శబ్దాలు వినబడతాయి.
  3. శంఖం ఊదినపుడు అందులోనికి ప్రవేశించు గాలి పౌనః పున్యము తిరోగామి తరంగం యొక్క పౌనఃపున్యం సమానమైనపుడు స్థిర తరంగం యెర్పడునపుడు రెండు పౌనఃపున్యములు సమానమైనపుడు అనునాదం యేర్పడి కణాలు అత్యధిక కంపన పరిమితితో కంపించటం వల్ల పెద్ద శబ్దం వినబడుతుంది.

ఉయ్యలను ఒక పక్కకు లాగి వదిలితె అది డోలనాలు చేస్తుంది.కాలం గడచిన కోద్ది దాని కంపన పరిమితి క్రమంగా తగ్గుతూ ఉంటుంది.చలనదిశలో ఉయ్యాలమీద తగి నంత బాహ్య బలన్ని ప్రయోనించి కంపన పరిమితి పెరిగేటట్లు చెయ్యవచ్చు.బాహ్యబలాన్ని ఒకసారి ఉపయోగిస్తే సరిపోదు.ఉయ్యల సహజ పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యానికి గల బాహ్యబలాన్ని ఉపయోగించవలె.డోలన వ్యవస్థమీద పనిచేసే ఘర్షణబలాలు ఉంటాయి.కబట్టి కంపన పరిమితి అంతులేకుండా పెరగదు.[1]

సమాన పౌనఃపున్యాలుగల రెండు శ్రుతిదండాలను బోలు పెట్టెల మీద ఉంచండి.వాటిలో ఒక శ్రుతిదండాన్ని రబ్భరు సుత్తితో కొట్టి కంపించేటట్లు చేయండి.కొద్దిసేపటికి రెండవ శ్రుతిదండం కూడా కంపించడం మొదలు పెడుతుంది.మొదటి శ్రుదండం భుజాలు కంపించ్కుండా చేతితొ ఆపి, రెండవ శ్రుతిదండం కంపిస్తూన్నట్లు తెలుసుకోవచ్చు. మొదటి శ్రతిదండం నుంచి గాలిద్వారా శక్తి రెండవ దానిని చేరుతుంది.రెండిటి పౌనఃపున్యాలు సమానం కనక మొదటి దానివలన ఏర్పడిన సంపీదనాలు సరియైన కాలంలో రెండవ దానిని చేరి క్రమంగా దాని కంపన పరిమితి పెరిగేటట్లు చేస్తాయి.రెండు శ్రుతి దండాలు ఆనునాదమ్లో ఉన్నాయంటారు.

మూసిన గాజుగొట్టం ఫైన కంపించే శ్రుతిదండాన్ని ఉంచి, గొట్టంలో నీళ్ళు పోస్తుంటే ఒక సమయంలో బిగ్గరగా ద్వని వినిపిస్తుంది. శ్రుతిదండం పౌనఃపున్యానికి సమాన మైన పౌనఃపున్యంతో గొట్టంలో గాలి స్తంభం కంపించడం వలన ఇది సభవిస్తుంది.శ్రుతి దండమూ వాయు స్తంభమూ అనునాదంలో ఉన్నాయంటారు.బాహ్యబల పౌనఃపున్యము, వస్తువు సహజ పౌనఃపున్యము సమానమయి అవి ఒకే దశలో ఉన్నప్పుడు అనునాదం ఏర్పడుతుంది.

సమాన పౌనఃపున్యాలుగల శ్రుతిదండాలలో అనునాదము

మూలాలు

  1. ఇంటర్మీడియట్ భౌతిక శస్త్రము ద్వితియ భాగము,తెలుగు అకాడమి

ఇతర లింకులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!