పౌనఃపున్యము (Frequency) లేదా తరచుదనం లేదా ఆవృత్తి అనగా ప్రమాణ కాలంలో చేయు డోలనాలు లేదా కంపనాల సంఖ్య. దీనిని ప్రాదేశిక పౌనఃపున్యం అని కూడా పిలుస్తారు. ఆవర్తన కాలం అనగా ఒక పునరావృత సంఘటనలో ఒక డోలనము లేదా కంపనము చేసేందుకు పట్టే కాలం. అనగా ఆవర్తన కాలం అనగా దాని పౌనఃపున్యానికి వ్యుత్క్రమం అవుతుంది. ఉదాహరణకు ఒక నవజాత శిశువు యొక్క గుండె పౌనః పున్యము నిముషానికి 120 సార్లు. అనగా ఆ శిశువు యొక్క గుండె స్పందనల ఆవర్తన కాలము అర సెకను ఉంటుంది.
నిర్వచనాలు, ప్రమాణాలు
కొన్ని చక్రీయంగా జరిగే ప్రక్రియలలో (పునరావృతం అయ్యే) అనగా భ్రమణ, డోలనాల, లేదా తరంగాలలో "పౌనఃపున్యము" అనగా ప్రమాణ కాలంలో చేసిన డోలనాల సంఖ్య. భౌతిక శాస్త్రము, ఇంజనీరింగు విభాగాల్లో అనగా దృశా శాస్త్రము, ధ్వని, రేడియో వంటి రంగాలలో పౌనఃపున్యమును సాధారణంగా లాటిన్ అక్షరం f ద్వారా లేదా గ్రీకు అక్షరం (న్యు) ద్వారా సూచిస్తారు.
గమనిక: కోణీయ వేగమునకు గ్రీకు అక్షరం (ఒమేగా) ద్వారా సూచిస్తారు. SI యూనిట్ రేడియన్స్/సెకను (రేడ్ / సె).
SI పద్ధతిలో పౌనఃపున్యమునకు ప్రమాణం ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త హీన్రిచ్ హెర్ట్జ్ పేరు మీద "హెర్ట్‌జ్" అని సూచించబడింది. ఒక హెర్ట్‌జ్ అనగా ఒక సెకనులో జరిగే సంఘటన. పౌనఃపున్యానికి పూర్వపు ప్రమాణం "సెకనుకు ఆవర్తనాలు". సాంప్రదాయకంగా భ్రమణం చేసే యంత్రాలలో "సెకనుకు చేసే భ్రమణాలు", సంక్షిప్తంగా RPM (నిమిషానికి తిరిగే భ్రమణాలు) తో సూచిస్తారు. 60 RPM ఒక హెర్జ్ సమానం[1].
ఆవర్తన కాలమును సాధారణంగా T తో సూచిస్తారు అనగా ఒక డోలనం లేదా కంపనం చేయటానికి పట్టిన కాలం. అపుడు పౌనఃపున్యము " f "కు సూత్రము:
పునరావృతంగా జరిగే ఒక సంఘటన యొక్క పౌనఃపున్యాన్ని లెక్కించటానికి ముందుగా నిర్ణీత సమయంలో సంఘటన జరిగే సంఖ్యను లెక్కించారు. అపుడు సంఖ్యను సమయంతో భాగిస్తే పౌనఃపున్యము కనుగొనవచ్చు. ఉదాహరణకు 15 సెకెండ్ల కాలములో 71 పునరావృత సంఘటనలు జరిగితే అపుడు పౌనః పున్యము:
అభియోగాలకు సంఖ్య చాలా పెద్ద ఉంటే, అది ఒక నిర్దిష్ట సమయం లోపల సంఘటనలు సంఖ్యను స్పష్టంగా లెక్కించడానికి సమయం విరామం కాకుండా ముందుగా నిర్ణయించిన సంఖ్యను లెక్కించాలి.[2]
తరంగాల పౌనః పున్యము
ఆవర్తన తరంగాలలో పౌనఃపున్యము, తరంగదైర్ఘ్యము విలోమ సంబంధాన్ని కలిగియుంటాయి. కేవలం పౌనఃపున్యము తరంగ దైర్ఘ్యము ( λ లాంబ్డా ) కు విలోమానుపాతంలో యుంటుంది. తరంగ వేగం ( v ) ను తరంగదైర్ఘ్యముచే భాగిస్తే పౌనఃపున్యము f అవుతుంది.
విద్యుదయస్కాంత తరంగాలకు శూన్యంలో తరంగ వేగం v = c, c అనగా శూన్యంలో కాంతివేగం. అటువంటి ప్రత్యేక సందర్భంలో పౌనఃపున్యానికి సమీకరణం:
ఉదాహరణలు
కాంతి యొక్క భౌతిక శాస్త్రము
విద్యుదయస్కాంత వర్ణపటంలో "దృగ్గోచర కాంతి" అనగా అంతరాళంలో కంపిస్తున్న విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలు. దీని తరంగ దైర్ఘ్య అవధి లేదా పౌనఃపున్య అవధి రంగును నిర్ణయిస్తుంది. ఎరుపు రంగు పౌనఃపున్యము 4 × 10 14 Hz, వైలట్ రంగు కాంతి పౌనఃపున్యము 4 - 8 × 10 14 Hz మధ్య అన్ని రంగులు వ్యాపించి యుంటాయి. విద్యుదయస్కాంత తరంగాలలో 10 14 Hz కంటే తక్కువగా పౌనఃపున్య కాంతిని మన కన్ను గ్రహించలేదు. యిటువంటి తరంగాలను పరారుణ వికిరణాలు అంటారు. తక్కువ పౌనఃపున్యము గల తరంగాలు మైక్రో తరంగాలు. అతి తక్కువ పౌనఃపున్యము గల తరంగాలు రేడియో తరంగాలు. అదే విధంగా ఒక విద్యుదయస్కాంత తరంగం 8 × 10 14 Hz ఉండవచ్చు. యివి కూడా మనకు కనిపించవు. ఈ తరంగాలను అతినీలలోహిత కిరణాలు అంటారు. వీటి కంటే ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలు X-కిరణాలు, గామా కిరణాలు.
విద్యుదయస్కాంత తరంగాల వ్యాప్తి అతి తక్కువ పౌనఃపున్యము గల రేడియో తరంగాలనుండి అతి ఎక్కువ పౌనఃపున్యము గల గామా కిరణాల వరకు ఉంటుంది. ఈ వర్ణపటంలో గల అన్ని తరంగాలు శూన్యంలో కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయి. విద్యుదయస్కాంత తరంగాలలో తరంగ దైర్ఘ్యం, వాటి పొనఃపున్యానికి విలోమానుపాతంలో యుంటుంది. అనగా వీటిలో ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలకు తక్కువ తరంగ దైర్ఘ్యము ఉంటుంది..
ధ్వని
ధ్వని కంపించే వస్తువు నుండి పుట్టి యానకం గుండా ప్రయాణిస్తుంది. పౌనఃపున్యము అనునది ధ్వని పిచ్ ను నిర్ణయించే ముఖ్యమైన లక్షణం.[3]. మానవుల చెవి నిర్ధిష్ట అవథి కల పౌనఃపున్యాలను మాత్రమే వినగలదు. ధ్వని ప్రయాణించగలిగే పదార్థాలను అనగా వాయువులు, ద్రవాలు, ఘనాలు, ప్లాస్మాలు లను యానకం అంటారు. ధ్వని యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది. శూన్యంలో ప్రయాణించదు. మానవుని శ్రవ్య అవధి 20 Hz నుండి 20,000 Hz (20 kHz). కొన్ని శునక జాతులు 60,000 Hz పౌనఃపున్యము వరకు వినగలవు.[4]