ఒక పురిలేని సన్నని దారము చివర బరువైన గోళము కలిగి, ఒక ఆధారము నుండి వ్రేలాడదీయబదిన దానిని సామాన్య లోలకం లేక లఘులోలకం అంటారు.
లోలకం పొడవు
ఆధార బిందువు నుండి లోలక గోళ గురుత్వ కేంద్రం వరకు గల దూరాన్ని లోలక పొడవు అంటారు.
డోలనము
లఘు లోలకం యొక్క గోళమును లాగి వదిలినపుడు అది డోలనములు చేయును. ఒక కంపనము, ప్రతి కంపనము కలిపి ఒక డోలనము అవుతుంది.
డోలనావర్తన కాలం
సామాన్య లోలకం ఒక డోలనం చేయుటకు పట్టు కాలాన్ని డోలనావర్తన కాలం అంటారు.
కంపన విస్తారం
సామాన్య లోలకం కంపనములు చేసే టప్పుడు లోలకం నిశ్చల స్థానం నుండి ఒక వైపుకు కదిలిన అత్యధిక దూరమును కంపన విస్తారం అంటారు.
లోలక సూత్రములు
- స్థిరమైన పొడవు గల లోలకము యొక్క డోలనావర్తన కాలము కంపన పరిమితిపై ఆధారపడి ఉండును.
- స్థిరమైన పొడవు గల లోలకము యొక్క డోలనావర్తన కాలము గోళము బరువు, ఆకారం, పరిమాణము, అది చేయబడిన లోహముపై ఆధారపడి ఉండును.
- లోలక యొక్క పొడవు (l) డోలనావర్తన కాలపు వర్గము (T2) సమసంబంధ సామ్యములో ఉంటాయి. l/T2 = స్థిరసంఖ్య