1962 భారత సార్వత్రిక ఎన్నికలు తమిళనాడు లోని 41 స్థానాలకు జరిగాయి. ఫలితాల్లో 31 స్థానాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. మిత్రపక్షాల సహాయం లేకుండానే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ 30 కి పైగా సీట్లు గెలుచుకోవడం ఇదే చివరిసారి. 1967 లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఓటమి తర్వాత కాంగ్రెస్, మద్రాసు/తమిళనాడులో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్ళింది.