జనవరి 16: మాస్కోలో ఒక మిలిటరీ ఇంజనీరింగ్ పాఠశాల స్థాపించబడింది. ఇదే AF మొజైస్కీ మిలిటరీ-స్పేస్ అకాడమీగా అవతరించింది.
జనవరి 26: 18,161 కిలోల బరువున్న గంట, ఓల్డ్ పమ్మెరిన్నువియన్నా లోని సెయింట్ స్టీఫెన్ కేథడ్రల్ లో తొలిసారి మోగించారు. చార్లెస్ VI కు చక్రవర్తిగా పట్టాభిషేకం అయ్యాక, వియన్నా నుండి ఫ్రాంక్‌ఫర్ట్‌కు తొలిసారి వచ్చిన గుర్తుగా దీన్ని మోగించారు. 16 మంది పురుషులు పావుగంట పాటు బెల్ తాడును లాగితే గంట లోని గంటకు తగిలి మోగింది.
ఫిబ్రవరి 10: హుయిలిచే తిరుగుబాటు : చిలీ యొక్క చిలోస్ ద్వీపసమూహంలోని హుయిలిచే ప్రజలు తమకు జరిగుఇన అన్యాయాలకు ప్రతీకారంగా స్పానిష్ ఎన్కోమెండెరోస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు .
ఫిబ్రవరి 30: స్వీడన్ తమ క్యాలెండర్‌ను తాత్కాలికంగా జూలియన్ క్యాలెండర్‌కు తిరిగి మార్చుకుంది.
మార్చి 11: స్వీడన్ తమ క్యాలెండర్‌ను తాత్కాలికంగా జూలియన్ క్యాలెండర్‌కు తిరిగి సర్దుబాటు చేసే రోజుగా అరుదైన ఫిబ్రవరి 30 ను స్వీకరించింది.
మార్చి 30: గ్రేట్ బ్రిటన్ రాణి అన్నే చివరిసారిగా రాయల్ టచ్ (అనారోగ్యాన్ని నయం చేయాలనే ఉద్దేశంతో ఒక కర్మ) నిర్వహిస్తుంది; ఆమె తాకిన 300 మందిలో చివరివాడు శామ్యూల్ జాన్సన్ .
తేదీ తెలియదు: మొట్టమొదటిగా పనిచేసే న్యూకామెన్ ఆవిరి యంత్రాన్ని థామస్ న్యూకామెన్ జాన్ కాలీతో కలిసి నిర్మించాడు. ఇది బ్లాక్ కంట్రీ ఆఫ్ ఇంగ్లాండ్‌లోని గనుల నుండి నీటిని బయటకు తోడివేయడానికి, యాంత్రిక పనిని ఉత్పత్తి చేయడానికి ఆవిరి శక్తిని ఆచరణాత్మకంగా ఉపయోగించిన మొదటి పరికరం.[1]
జననాలు
జనవరి 24: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)
↑Rolt, L. T. C.; Allen, J. S. (1977). "The First Newcomen Engines c1710-15". The Steam Engine of Thomas Newcomen (new ed.). Hartington: Moorland. pp. 44–57. ISBN0-903485-42-7.