అనుబంధాలకు విలువనిచ్చే కుటుంబానికి చెందిన శ్రీను (గోపీచంద్) ఫ్రెండ్స్‌తో జాలీగా తిరుగుతుంటాడు. రైలు ప్రయాణంలో శైలజ (రెజీనా)ని చూసి ప్రేమిస్తాడు. శైలజ కూడా శ్రీనును ప్రేమిస్తుంది. ఒకరోజు శైలజని కిడ్నాప్ అవుతుంది. తండ్రి కృష్ణారావు (ముఖేష్ రుషి) చెప్నడంతో శ్రీను శైలజని వెతకడం మానేస్తాడు. కానీ గతంలో శ్రీనుతో ఉన్న గొడవల కారణంగా భావూజీ (ప్రదీప్ రావత్) మనుషులు శ్రీనును చంపాలనుకుంటారు. అది కుదరకపోవడంతో భావూజీ ప్లాన్ వేసి కలకత్తాలో కింగ్ మేకర్ అయిన పిఆర్ (దేవన్) కూతుర్ని లేపుకు రమ్మని శ్రీనుతో చెప్తాడు. పరిస్థితుల వల్ల భావూజీ మాట మేరకు కలకత్తా వెళ్తాడు. ఆ తురవాత ఏం జరిగిందనేది మిగతా కథ.[4][5]
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. 2015, డిసెంబరు 13న ఒంగోలులో జరిగిన పాటల విడుదల కార్యక్రమంలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[7]
↑123 తెలుగు, రివ్యూ (27 December 2015). "సౌఖ్యం తెలుగు సినిమా రివ్యూ". www.123telugu.com. Retrieved 11 June 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)