సుప్రీత్ |
---|
జననం | సుప్రీత్ రెడ్డి |
---|
వృత్తి | నటుడు |
---|
క్రియాశీల సంవత్సరాలు | 2002 - ప్రస్తుతం |
---|
సుప్రీత్ ఒక తెలుగు సినీ నటుడు.[1] ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషిస్తుంటాడు.[2] ఛత్రపతి, మర్యాద రామన్న సినిమాలో ప్రతినాయకుడిగా మంచి పేరు సంపాదించాడు. విక్రమార్కుడు హిందీ రీమేక్ సినిమా రౌడీ రాథోడ్ లో టిట్లా అనే పాత్రతో బాలీవుడ్ లో ప్రముఖ పాత్రలో నటించాడు. అంతకు మునుపు గజినీ హిందీ రీమేక్ లో చిన్న పాత్ర కూడా పోషించాడు.
కెరీర్
సుప్రీత్ చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది. తేజ జయం సినిమాకు ఆడిషన్లు జరుగుతున్నప్పుడు తృటిలో అవకాశం కోల్పోయాడు. తరువాత తేజ అతన్ని కలిసి స్వంతంగా ఆల్బం తయారు చేసుకుని ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. తరువాత పవన్ కల్యాణ్ మొదటి సారిగా దర్శకత్వం వహించిన జాని అనే సినిమాలో అవకాశం వచ్చింది. తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా కోసం రగ్బీలో శిక్షణ కూడా పొందాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడైన భిక్షు యాదవ్ (ప్రదీప్ రావత్) ప్రధాన అనుచరుడిగా నటించాడు.
అతనిలో ప్రతిభను గుర్తించిన రాజమౌళి తన తరువాత సినిమా ఛత్రపతి లో ప్రభాస్ స్నేహితుల్లో ఒకడిగా అవకాశం ఇచ్చాడు. అయితే తర్వాత ఎందుకో కాట్రాజు పాత్ర కోసం ఎంపిక చేశాడు. సుప్రీత్ అయిష్టంగానే అందుకు అంగీకరించినా ఆ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి నటుడుగా నిలబెట్టింది. తరువాత చాలా సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించాడు.[3]
హీరోగా అతనికి అవకాశాలు వచ్చినా తను ఆ పాత్రలకు సరిపడనని అవి చేయలేదు. అతనికి వ్యక్తిగతంగా కోట శ్రీనివాసరావు, మోహన్ బాబు నటన అంటే ఇష్టపడతాడు.
సినిమాలు
మూలాలు