వి. దొరస్వామి రాజు సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & రాజకీయ నాయకుడు. ఆయన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా 1994 నుండి 1999 వరకు పని చేశాడు.
సినీ జీవితం
వి. దొరస్వామి రాజు 1978లో వీఎంసీ (విజయ మల్లీశ్వరి కంబైన్స్) ఆర్గనైజేషన్‌ను నటుడు యన్.టి.రామారావు చేతుల మీదుగా తన సంస్థను ప్రారంభింప జేశాడు. ఆయన 1987లో కిరాయి దాదా సినిమా ద్వారా నిర్మాతగా మరి, 1991లో అక్కినేని నాగేశ్వరరావుతో ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాను నిర్మించి, ఈ సినిమాకు గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.
వి.దొరస్వామి రాజు వీఎంసీ ప్రొడక్షన్స్, వీఎంసీ పిక్చర్స్, వీఎంసీ ఫిలింస్, వీఎంసీ1 కంపెనీ, వీఎంసీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, వీఎంసీ పిక్చర్ ప్యాలెస్ సంస్థల ద్వారా టెలీ ఫిలింస్, టెలీ సీరియల్స్, తమిళ్ డబ్బింగ్, హిందీ డబ్బింగ్ సినిమాలను నిర్మించాడు. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 750 పైగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా, డిస్ట్రిబ్యూషన్ కౌన్సెల్ ప్రెసిడెంట్‌గా, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పని చేశాడు.
నిర్మించిన సినిమాలు
- కిరాయి దాదా
- సీతారామయ్యగారి మనవరాలు
- మాధవయ్య గారి మానవాడు
- ప్రెసిడెంట్ గారి పెళ్లాం
- అన్నమయ్య
- ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు
- భలే పెళ్లాం
- సింహాద్రి
- కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను (2005)
- వెంగమాంబ (2009)
- ఉయ్యాలే (2009)
- శ్రీ వాసవి వైభవం (2012)
- విజేత (2016)
- పంపిణీదారుడిగా (డిస్ట్రిబ్యూటర్) పలు సినిమాలు
- సింహబలుడు
- డ్రైవర్ రాముడు
- వేటగాడు
- యుగంధర్
- గజదొంగ
- ప్రేమాభిషేకం
- కొండవీటి సింహం
- జస్టిస్ చౌదరి
రాజకీయ జీవితం
దొరస్వామి రాజు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చెంగారెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలై, టిటిడి బోర్డు సభ్యునిగా పని చేశాడు.
అవార్డ్స్
- ఫిలింఫేర్ అవార్డ్స్
- నంది అవార్డ్స్
- సినిమా ఎక్ష్ప్రెస్స్ అవార్డ్స్
మరణం
వి.దొరస్వామి రాజు గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో చేరి 18 జనవరి 2021న మరణించాడు.[5][6]
[7]
మూలాలు