వన్ బై టు 2022లో విడుదలైన తెలుగు సినిమా. చెర్రీ క్రియేటివ్ వర్క్స్, వీఐపీ క్రియేషన్స్ బ్యానర్లపై కరణం శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు శివ ఏటూరి దర్శకత్వం వహించాడు. సాయి కుమార్, ఆనంద్ పాండి, శ్రీ పల్లవి, దేవీ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2021 జూలై 27న విడుదల చేసి[1], సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేశారు.[2]