లత (జ. 1953 జూన్ 7) భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె ఎం.జి.ఆర్.లత లేదా లతా సబాపతి గా సుపరిచితురాలు. [1] ఆమె దక్షిణాది భాషలలో 1973 నుండి 1983 వరకు ముఖ్యమైన పాత్రలలో నటించింది. ఆమె తమిళ భాషా సీరియల్స్ లో నటిస్తుంది.
ప్రారంభ జీవితం
ఆమె షణ్ముగ రాజేశ్వర సేతుపతి, లీలారాణి దంపతులకు 1953 జూన్ 7న జన్మించింది. తన అందం, నృత్య నైపుణ్యం కారణంగా తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. ఆమె తన పదిహేనేళ్ళ వయసులో సినిమారంగంలోకి ప్రవేశించింది. ఆమెను ఆమె అత్త, సినిమానటి కోమల కోట్నిస్ ప్రోత్సహించింది.[2] ఆమె మొదటి సినిమా ఉలగం సుట్రమ్ వాలిబాన్ (1973) కు కథానాయకుడు, నిర్మాత ఎం.జి.రామచంద్రన్. [3][4] ఆమె రామ్‌నాద్ రాజరిక కుటుంబంలోని సేతుపతి వంశానికి చెందినది. ఆమె మొదట ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నివాసి. చిన్నతనం నుండి తమిళం, తెలుగు భాషలను నేర్చుకుంది[5]. ఎం.జి.ఆర్ స్వయంగా ఆమెకు స్కీన్ పేరుగా "లత" అని నామకరణం చేసాడు. ఆమె సోదరుడు రాజ్‌కుమార్ సేతుపతి.