ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై పుప్పాల రమేశ్ నిర్మించిన సినిమా మిరపకాయ్. రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్, ప్రకాష్ రాజ్, నాగేంద్ర బాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జనవరి 13, 2011న విడుదలై ఘనవిజయం సాధించింది.
కథ
రిషి (రవితేజ) ఇంటెలిజెన్స్ శాఖలో ఒక ఇన్స్పెక్టర్. అతనిని తన కొలీగ్స్ మిరపకాయ్ అని పిలుస్తుంటారు. ఆ శాఖ చీఫ్ నారాయణ మూర్తి (నాగేంద్ర బాబు) కిట్టు భాయ్ (ప్రకాష్ రాజ్) తన నేర సామ్రాజ్యాన్ని ఢిల్లీ ద్వారా భారతదేశమంతా వ్యాపించాలనుకుంటున్నాడని తెలుసుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా కమిషనర్ శ్రీనివాస్(సంజయ్ స్వరూప్)ని శంకరన్న (కోట శ్రీనివాసరావు) తన కొడుకు లింగ (సుప్రీత్), కిట్టు భాయ్ కొడుకు (అజయ్) ద్వారా కిట్టు భాయ్ ఆదేశాల మేరన చంపేస్తాడు.ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం మూర్తి రిషిని తన శిష్యుడు, రిషి స్నేహితుడైన కుమార్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శంకరన్న కాలేజిలో హిందీ లెక్చరరుగా జాయిన్ అవుతాడు.
ఆ రాత్రి ఓ గుడిలో వినమ్ర(రిచా గంగోపాధ్యాయ)ని చూసి తొలిచూపులోనే తనని ప్రేమిస్తాడు. శంకరన్న కాలేజిలోనే వినమ్ర చదువుతుంది. రిషి, వినమ్రల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ సమయంలో కిట్టు భాయ్ కూతురు వైశాలి (దీక్షా సేథ్) అదే కాలేజిలో జాయిన్ అవుతుంది. ఈ అవకాశాన్ని వాడుకుని మూర్తి రిషిని వైశాలిని వాడుకుని కిట్టు భాయ్ గురించి సమాచారాన్ని రాబట్టమంటాడు. వైశాలిని ప్రేమలో పడేసి శంకరన్న, లింగలను చంపి వైశాలి ద్వారా కిట్టు భాయిని చేరుకుంటాడు రిషి. కిట్టు భాయ్ మరియూ అతని గ్యాంగుని అరెస్ట్ చేసి వైశాలిని ఇంటరోగేట్ చేస్తాడు రిషి. వైశాలితో ప్రేమాయణం నడిపాడని అపార్థం చేసుకుని అలిగిన వినమ్రని రిషి పెళ్ళికి ఒప్పించడానికి తంటాలు పడుతుండటంతో సినిమా ముగుస్తుంది.
తారాగణం
పాటల జాబితా
అదిగోరా చూడు, రచన: అనంత శ్రీరామ్ , గానం.రవితేజ, కార్తీక్ , రాహుల్ నంబియార్, ఆలప్ రాజ్, రంజిత్
వైశాలి వైశాలి , రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం: ఎస్ ఎస్ తమన్.
గాడి తలుపులు , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.గీతా మాధురి, కార్తీక్ , ఎస్ ఎస్ తమన్
సిలకా , రచన: భాస్కర భట్ల రవికుమార్ గానం.కె ఎస్ చిత్ర , రాహూల్ నంబియార్
దినకు దిన్ రచన: చంద్రబోస్ , గానం.శంకర్ మహదేవన్ ,శ్రేయా ఘోషల్
చిరుగాలే, రచన: సాహితి , గానం.రీటా త్యాగరాజన్ , మేఘ , జననీ , శ్రావణ భార్గవి , వర్థిని, రంజిత్ , నవీన్ మాధవ్
మిరపకాయ్ , రచన: హరీష్ శంకర్ , గానం.రంజిత్ , రీటా త్యాగరాజన్