మనా గ్రామం, భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రం, చమోలి జిల్లాలో ఉంది. మన గ్రామాన్ని గతంలో భారతదేశం చివరి గ్రామంగా పిలిచేవారు, అయితే సరిహద్దు రోడ్ల సంస్థ ఇటీవల దీనిని "మొదటి భారతీయ గ్రామం" గా ప్రకటించే సైన్ బోర్డును ఏర్పాటు చేసింది.[1] ఈ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల (10,500 అడుగులు) ఎత్తులో ఉంది.[2] ఇది భారతదేశం, టిబెట్ సరిహద్దు నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హిందూ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ నుండి 3 కి.మీ దూరంలో ఉంది. మనా ఉన్ని వస్త్రాలు, శాలువాలు, టోపీలు, మఫ్లర్, తివాచీ వంటి వాటికీ ప్రసిద్ధి చెందింది.[3]
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో దాదాపు 558 గృహాలు, 1214 మంది జనాభా ఉన్నారు.[4] ఇక్కడి ప్రజలు మార్చా, జాడ్ లేదా భోటియా తెగలకు చెందినవారు.[2] ఈ ప్రాంతం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి మొత్తం జనాభా దిగువ ప్రాంతాలకు వెళ్తారు. ఇక్కడి అనేక టీ దుకాణాలలో భారత సరిహద్దులో ఉన్న చివరి టీ దుకాణం తమదని ప్రజలకు తెలియజేసేలా బోర్డులు ఉంటాయి.[5]
పర్యాటక ప్రదేశాలు
వ్యాస గుఫా: ఈ గుహలో మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని రచించాడని నమ్ముతారు.[2]
గణేశ గుఫా
భీమ్ పుల్
నీలకంఠం
మాత మూర్తి ఆలయం
వసుధార
రవాణా
మనా గ్రామానికి 222 కి.మీ దూరంలో ఉన్న డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి, రిషికేష్ రైల్వే స్టేషన్, రిషికేశ్, హరిద్వార్, డెహ్రాడూన్ నుండి టాక్సీ లేదా బస్సులో ఇక్కడికి చేరుకోవచ్చు.