123తెలుగు.కాం వారు తమ సమీక్షలో, "బాడీగార్డ్ కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ చిత్రం. కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వించగా కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఏడిపిస్తాయి. రెండవ భాగంలో కొన్ని సన్నివేశాలు వదిలేస్తే క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది" అని వ్యాఖ్యానించారు.[1] వన్ ఇండియా వారు తమ సమీక్షలో, "అసభ్యత, హింస లేకుండా ఉండటం, కామిడీ, సెంటిమెంట్ పండటంతో ఈ చిత్రం ఫ్యామిలీలు నిరభ్యంతరంగా చూసే అవకాశం కలిగిస్తుంది. యూత్ కాస్త దూరమైనా, కుటుంబాలు కదిలివస్తే సినిమా మంచి విజయమే సాధిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించారు.[2] తెలుగువాహిని.కాం తమ సమీక్షలో, "సంక్రాంతి సీజన్ కాబట్టి, వెంకటేష్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అండగా నిలబడటానికి కావలసినంత సెంటిమెంట్, యాక్షన్ ఉంది కాబట్టి బాడీగార్డ్ డీసెంట్ హిట్ గా నిలుస్తుంది. మిగతా బాషలలో చూసినవాళ్ళకు ఒకే, కొత్తగా చూస్తే కేకే" అని వ్యాఖ్యానించారు.[3]