జీలకర్ర

Cumin
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. cyminum
Binomial name
Cuminum cyminum

చరిత్ర

Cumin seeds

జిలకర్ర పురాతనకాలం నుండి ఉపయోగించబడుతుంది. సిరియన్ లోని టెల్- ఎడ్- డర్ ప్రాంతంలో పురాతత్వ పరిశోధిత త్రవ్వకాలలో జిలకర్ర గింజలు లభించాయి. ఇవి క్రి.పూ 2000 సంవత్సరాల పూర్వంనాటివని భావిస్తున్నారు. ఇవి పలు పురాతనకాల ఈజిప్షియన్ కొత్తరాజ్యాలకు చెందినవని భావిస్తున్నారు. [2] పురాతన ఈజిప్ట్ నాగరికతలో జిలకర్ర మమ్మిఫికేషన్ క్రియలో సంరక్షణాకారి (ప్రిజర్వేటివ్) సుగంధద్రవ్యంగా ఉపయోగించబడిందని [3]

ఆరంభకాలంలో జిలకర్ర ఇరాన్, మధ్యధరా సముద్రం ప్రాంతాలలో పండుంచబడింది., [ఆధారం చూపాలి] జిలకర్ర బైబిల్ పాతనిబంధనలు, కొత్తనిబంధనలలో ప్రస్తావించబడింది. పురాతనకాల జిలకర్రను తమ భోజనమేజా మీద (ప్రస్తుత మిరియాల పొడిలా) ఉంచేవారు. ఈ అలవాటు మొరాకోలో కూడా పొడిగించబడింది. పురాతన రోమన్ వంటకాలలో విస్తారంగా ఉపయోగించబడింది. భారతదేశంలో జిలకర్రను వేయి సంవత్సరాల నుండి సంప్రదాయ వంటసామాగ్రిలో భాగం అయింది. భారతీయులు దీనిని కుర్మా, మసాలా, సూప్, పలు ఇతర వంటకాలలో ఇతర సుగంధద్రవ్యాలతో కలిపి ఉపయోగిస్తుంటారు.

Cuminum cyminum Linn

Cumin was introduced to the Americas by Spanish and Portuguese colonists. Several different types of cumin are known, but the most famous ones are black and green cumin, both of which are used in Persian cuisine.

Today, the plant is mostly grown in China, Uzbekistan, Tajikistan, Iran, Turkey, Morocco, Egypt, Syria, Mexico, Chile, and India. Since cumin is often used as part of birdseed and exported to many countries, the plant can occur as a rare casual[విడమరచి రాయాలి] in many territories.[4] Cumin occurs as a rare casual in the British Isles, mainly in Southern England, but the frequency of its occurrence has declined greatly. According to the Botanical Society of the British Isles' most recent atlas, only one record has been confirmed since 2000.

జీలకర్ర (క్యూమిన్ సీడ్)

జీలకర్ర : జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు (మసాలా) దినుసులలో ఒకటి . దీని శాస్త్రీయ నామము cuminuma cyminum . ఇది సుమారు 30-50 సెంటిమీటర్లు పెరిగే మొక్క. దీని గింజలు గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు . గింజలనే వంటకాల లోనూ, ఔషధము గాను వాడుతారు . ప్రాచీన కాలము నుండి ఇది వాడుకలో ఉంది. హిందూ వివాహంలో త్రేతాయుగం నాటినుంచీ వధూవరులు పెళ్లి ముహూర్త సమయంలో జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టే ఆనవాయితీ ఉన్నదని రామాయణం ద్వారా తెలుస్తోంది. రామాయణంలో శ్రీరాముడు, సీతమ్మ వార్ల వివాహాన్ని వర్ణించేటప్ఫడు జీలకర్ర ప్రస్తావన వస్తుంది.[ఆధారం చూపాలి] నేటికీ భద్రాద్రి ఆలయంలో సీతారాముల కల్యాణంలో జీలకర్ర బెల్లం ఘట్టం ఉంటుంది.[5] భారతీయులు విరివిగా ఆయుర్వేదిక, సాంస్కృతిక, ఆహార పదార్ధాల్లో దీని వినియోగ ప్రాశస్త్యం తెలియజేయడం వల్ల క్రమంగా క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి ముందు మధ్యపాశ్చ దేశాల వాళ్ళు దిగుమతి మొదలుపెట్టుకున్నారు.[ఆధారం చూపాలి]

రోగాలపై జీలకర్ర:

కడుపులో నులిపురుగుల నివారణకు : జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. గుండె నొప్పులు తగ్గుటకు : జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీకి తగ్గుటకూ : శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర - చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. గర్భాశయ బాధలు తగ్గుటకు : జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి.

మూత్ర సంబంధ వ్యాధులకు : జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. నీరసము తగ్గుటకు : ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు+ జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది. పేగులు శుభ్రపరచుట : ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు.

పైత్యరోగాలకు :

జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన, సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే ... తలతిప్పు, కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును .[6]

తేలుకుట్టుకు :

జీలకర్ర, తేనె, ఉప్పు, నెయ్యి కలిపి నూరి తేలుకుట్టిన చొట కట్టు కట్టిన తేలు విషము హరించును .

నీళ్ళవిరోచనాలు తగ్గుటకు :

అరతులము జీలకర్ర ఇనుమూ గరిటెలో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి ... చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి . వాంతులు తగ్గుటకు : వేయించం జీలకర్రతో సమముగా సైంధవలవణము కలిపి నూరి .. సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచముగా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును

జీలకర్ర వంటలలో ఉపయోగించే ఒక విధమైన మసాలా దినుసులు.

లక్షణాలు

Cumin Seeds

జీలకర్ర గింజలు క్యుమినమ్ సైమినమ్ (Cuminum cyminum) అనే ఏకవార్షిక మొక్క నుండి లభిస్తాయి. ఈ మొక్కలు గుల్మాలుగా సన్నని కొమ్మలతో సుమారు 20–30 cm పొడవు పెరుగుతాయి. దీని ఆకులు 5–10 cm పొడవు, pinnate or bipinnate, సన్నని దారాలవంటి పత్రకాలతో ఉంటాయి. ఆవ పువ్వులు చిన్నగా తెలుపు లేదా పింక్ రంగులో ఉంటాయి. దీని పండు కోలగా 4–5 mm పొడవుండి ఒకే ఒక్క గింజని కలిగువుంటాయి.

ఉపయోగాలు

  • జీలకర్ర నల్ల మిరియాలు తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ప్రసిద్ధిచెందిన మసాలా దినుసు.[7] వీటికి గల మంచి వాసన కోసం నేపాల్, భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంక మెక్సికో మొదలైన దేశాలలో విరివిగా వాడుకలో ఉంది. జీలకర్రను పొడిగా గానీ లేదా మొత్తం గింజలుగా ఉపయోగిస్తారు.[8] ఇవి జీర్ణ శక్తిని వృద్ధి చెస్తాయి.[9]
  • జీలకర్రతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి.[10]

వెలుపలి లింకులు

మూలాలు

  1. "Cuminum cyminum information from NPGS/GRIN". www.ars-grin.gov. Archived from the original on 2009-01-20. Retrieved 2008-03-13.
  2. Daniel Zohary and Maria Hopf, Domestication of plants in the Old World, third edition (Oxford: University Press, 2000), p. 206
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; a అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Bird Seed Aliens in Britain
  5. "Vaartha Online Edition తెలంగాణ - నేడు శ్రీరామ పట్టాభిషేకం". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-15. Archived from the original on 2020-09-18. Retrieved 2020-09-18.
  6. జీలకర్ర నిమ్మరసముతో ఉపయొగలు
  7. Food Facts & Trivia: Cumin. Foodreference.com (2007-04-08). Retrieved on 2011-11-26.
  8. జీలకర్ర వల్ల ఉపయొగలు
  9. జీలకర్ర అధికంగా తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స ఉంటాయి
  10. జీరా వాటర్ యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలిసినవి

జీలకర్ర ఉపయోగాలు - దుష్ప్రభావాలు[permanent dead link]

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!