వికీపీడియా లోని సమాచారం ధృవీకరించదగినదని నిర్ధారించుకోవడానికి, మూలాల్లేని సమాచారాన్ని ఎవరైనా ప్రశ్నించడానికీ వికీపీడియా ఒక మార్గాన్ని అందిస్తోంది. మీరు చేర్చిన సమాచారానికి మూలం కావాలనే మూసను ఎవరైనా చేర్చితే, దయచేసి నమ్మదగిన మూలాన్ని ఇవ్వండి. అవసరమైతే చర్చించండి.
వికీ మార్కప్‌లో, ఒక సాధారణ {{Citation needed}} అనే మూసను గానీ, లేదా మరింత సమగ్రమైన {{Citation needed|reason=Your explanation here|date=డిసెంబరు 2024}} గానీ చేర్చి మీరు, పాఠ్యం లోని సమాచారాన్ని ప్రశ్నించవచ్చు. ఇందుకు {{ఆధారం}}, {{fact}},{{cn}} అనే మూసలను కూడా వాడవచ్చు. ఇవన్నీ కూడా కిందివిధంగా చూపిస్తాయి:
ఉదాహరణ: 87 శాతం గణాంకాలన్నీ అప్పటికప్పుడు సృష్టించినవే.[citation needed]
వ్యాసాలలో మూలాలను జోడించడం గురించిన సమాచారం కోసం, సహాయం:ప్రారంభకుల కోసం రెఫరెన్సింగ్ చూడండి. ఈ టెంప్లేట్ సందేశాలను ఎప్పుడు తీసివేయాలి అనే సమాచారం కోసం, సహాయం:నిర్వహణ మూసల తొలగింపు చూడండి.
"citation needed" ట్యాగ్ అనేది, వ్యాసం లోని ఏదైనా పాఠ్యం వద్ద మూలాన్ని అందించమని మరొక వాడుకరికి చేసే అభ్యర్థన: పరస్పర సహకారంతో ఉమ్మడిగా పనిచేసే సముదాయ సభ్యుల మధ్య సమాచారాన్ని చేరవేసుకునే పద్ధతుల్లో ఇది ఒకటి. దీన్ని చేర్చినంత మాత్రాన వ్యాసాన్ని "అభివృద్ధి చేసినట్లు" కాదు. ఒక నిర్దుష్టమైన సమాచారానికి/స్టేట్‌మెంటుకు తగు మూలాలతో మద్దతు లేదంటూ "citation needed" మూస ద్వారా పాఠకులకు తెలియజేసినప్పటికీ, కొంతమంది పాఠకులకు ఆ పాఠ్యంపై సందేహం కూడా వచ్చినప్పటికీ, చాలా మంది పాఠకులకు సముదాయం పనిచేసే ఈ విధానం పూర్తిగా అర్థం కాదు. ఇలాంటి మూస;లు ఎప్పటికప్పుడు పరిష్కరించబడవు కూడా. నెలలూ సంవత్సరాల తరబడి అలాగే ఉంటూ, ఇలాంటి పనులు పేరుకు పోతూంటాయి. ఇది ఒక పెద్ద సమస్యగా కూడా రూపొందవచ్చు. ఉత్తమ పద్ధతులుగా క్రింది వాటిని పాటించాలి:
బాగా ఆలోచించి మూసను పెట్టండి. మర్యాదపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. సంబంధిత వాడుకరి మీ ట్యాగ్‌ను గమనించి, మీరు అభ్యర్థించినట్లుగా మూలాన్ని చేరుస్తారని ఆశిస్తున్నాం. మూసను జోడించేటప్పుడు, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ఏ సమాచారానికి మూలాన్ని అడుగుతున్నారో స్పష్టంగా ఉందా? సమాచారం నిజమేనేమో? (అది నిజం కాకపోతే, దానికి మూలం కాకుండా తొలగించడమో, సవరించడమో చెయ్యాలి! ) ఆ సమాచారం, మూలం అవసరమే లేనంత స్పష్టంగా ఉందా? (కొన్ని విషయాలకు మూలం అవసరం ఉండకపోవచ్చు)
కొన్ని ట్యాగులు పెట్టిన వాడుకరులు స్వయంగా తామే తగిన మూలాన్ని వెతికి చేర్చగలిగే సమర్థత ఉన్నవారై ఉండవచ్చు. అదే అయితే, ఈ వ్యాసాలను మీ వీక్షణ జాబితాకు లేదా వర్క్‌లిస్ట్‌కు జోడించడాన్ని పరిగణించండి, తద్వారా ఏదైనా వెరిఫైబిలిటీ సమస్యలను మీరే పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పుడు మీరు ఆ వ్యాసాన్ని మళ్లీ సందర్శించవచ్చు.
జీవించి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివాదాస్పద విషయాలకు, మూలం లేనివాటికి లేదా సరైన మూలం లేనివాటికీ ట్యాగ్ పెట్టవద్దు, వెంటనే తొలగించండి!
WP:DIARY ప్రకారం, మరీ అతిగా ఉన్న సమాచారానికి ట్యాగు పెట్టవద్దు; దాన్ని తొలగించండి.
మీరు ట్యాగు పెట్టదలిచిన స్టేట్‌మెంటు వాస్తవమైనది కాదని మీకు ఖచ్చితంగా తెలిస్తే, అది పై అంశాలలో దేని క్రిందకు రాకపోయినా సరే, ఆ పాఠ్యాన్ని తీసివేయడమే సముచితమైన చర్య కావచ్చు (దాన్ని తీసివేయండి! ). "చాలా సందేహాస్పదంగా ఉంది - ఆ కంటెంట్‌ను తిరిగి పెడితే తగు మూలాన్ని జోడించండి" వంటి దిద్దుబాటు సారాంశాన్ని పెట్టడం మరువకండి. అసలు స్టేట్‌మెంట్ సరైనదే అయితే, మరెరైనా దానిని తిరిగి చేర్చేటపుడు ఈసారి సరైన మూలాలతో పెట్టే అవకాశం ఉంటుంది.
ఒక స్టేట్‌మెంటు ఆమోదయోగ్యమైనదిగా అనిపించి, వ్యాసంలోని ఇతర స్టేట్‌మెంట్‌లకు అనుగుణంగా ఉండి, కానీ అది పూర్తిగా ఖచ్చితమైనది కాదని మీకు సందేహం ఉన్నట్లయితే, మీరే ఒక మూలాన్ని కనుగొనెందుకు సహేతుకమైన ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో, సదరు అంశం గురించి మెరుగ్గా ప్రతిబింబించేలా స్టేట్‌మెంట్‌ను సవరించడం లేదా తొలగించడం అవసరమని మీకు తెలిసి పోవచ్చు.
ఒక వ్యాసంలో లేదా ఒక వ్యాసంలోని విభాగంలో సరిపడినన్ని మూలాలు లేనట్లైతే, సదరు వ్యాసం లేదా విభాగానికి {{Unreferenced}}, {{Refimprove}}, {{Unreferenced section}} వంటి ట్యాగులను పెట్టండి.
పేరా చివరిలో ఉన్న మూలం సాధారణంగా మొత్తం పేరాను సూచిస్తుంది. అదే విధంగా వాక్యం చివరిలో ఉన్న సూచన దాదాపు ఎల్లప్పుడూ మొత్తం వాక్యాన్ని సూచించినట్లుగా భావించవచ్చు. ఒక వాక్యం లోని లేదా పేరా లోని నిర్దుష్ట భాగానికి ప్రత్యేకంగా మూలం అవసరమని అనిపిస్తే, లేదా వాక్యం లేదా పేరా స్థాయిలో పాఠ్యాన్ని చొప్పించినట్లు అనిపిస్తే, ఇప్పటికే ఉన్న పాఠ్యానికి ట్యాగ్‌లను జోడించకుండా అసలు మూలాన్ని పరిశీలించండి. {{Citation needed span}} మూసలో ఉన్న అదనపు పారామితుల ద్వారా ఏ విభాగాన్ని సూచించాలనుకుంటున్నారో దాన్ని సూచించడానికి వీలు కలగవచ్చు.
ఏదో ఒక వాదనను సమర్థించుకునేందుకో, తోటి వాడుకరికి "చెల్లించడానికి" లేదా మీకు ఒక అంశం గాని, ఒక వ్యాసం గాని, ఒక వాడుకరి గానీ నచ్చనందునో "మూలం అవసరం" ట్యాగును పెట్టవద్దు.
ప్రకటనల రచయితలు తరచుగా వికీపీడియాకు అనులేఖనాలతో కూడిన ప్రకటనకు మద్దతు ఇవ్వరు, కాబట్టి ఇతర వికీపీడియా సంపాదకులు ఆ ప్రకటనలను తనిఖీ చేసే పనిని చేయాల్సి ఉంటుంది. WP:ధృవీకరణ అవసరమయ్యే 480,763 స్టేట్‌మెంట్‌లతో, ఏ కథనంలో పని చేయాలో కొన్నిసార్లు ఎంచుకోవడం కష్టం. యాదృచ్ఛిక కథనాలను సూచించడం ద్వారా సైటేషన్ హంట్ సాధనం దాన్ని సులభతరం చేస్తుంది, మీరు సమయోచిత వర్గం సభ్యత్వం ద్వారా క్రమబద్ధీకరించవచ్చు.