1948లో రచయితగా కలం పట్టిన నంది దాదాపు 200 కథలు, 25 నవలలు రాశారు. కొన్ని నాటకాలు, నాటికలు రాశారు. 'పుణ్యస్థలి' నాటిక రచనతో నాటకరచయిత గా శ్రీకారం చుట్టిననంది 'మరోమొహంజోదారో','ఆరణి' నాటకాలను,'వానవెలిసింది', 'మనిషి చావకూడదు'నాటికలను రచించారు.ఔత్సాహిక నాటకరంగంలోలబ్దప్రతిష్ఠుడైన నాటకరచయితగా, పేరు తెచ్చుకున్నారు. దాదాపు 20 సినిమాలకు రచయితగా పనిచేశారు. సుడిగుండాలు, తాసిల్దారుగారి అమ్మాయి, నోము, పున్నమినాగు వంటి సినిమాలకు ఆయన పనిచేశారు.
'మరోమొహంజోదారో' ఐతిహాసిక (ఎపిక్ థియేటర్), నాటక విధానంతో రాసిన మొదటి నాటకం. మెలోడ్రామాను నియంత్రిస్తూ,రంగస్థల పరికరాలు అవసరంలేకుండాకే వలం నీలి తెరలతోనే ప్రదర్శించగల సౌలభ్యం గల ఈ నాటకం రంగస్థల చరిత్రలో సంచలన కలిగించింది. ప్రదర్శనాపరంగా 'ఫ్రీజ్' టెక్నిక్ (బొమ్మల్లా నిశ్చేష్ఠులై నిలబడి పోవడం) అనే నూతన పద్ధతి ఈ నాటకంతోనే ప్రారంభమైంది. వందల సార్లు, పలుచోట్ల ప్రదర్శింపబడి,వివిధ భాషల్లోకి అనువదింపబడింది. ఈ నాటకం తెలుగు నాటకరంగ కీర్తినినేల నాలుగు చెరగులా విస్తరింపజేసింది.
↑ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 March 2020. Retrieved 27 March 2020.
↑ఎన్.ఆర్., నంది. "ఎన్ ఆర్ నంది". కథానిలయం. కథానిలయం. Retrieved 4 January 2015.