తాసిల్దారుగారి అమ్మాయి

తాసిల్దార్ గారి అమ్మాయి
(12 November 1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం శోభన్ బాబు ,
జమున,
చంద్రకళ,
రాజబాబు,
నాగభూషణం,
రావికొండలరావు
నిర్మాణ సంస్థ సత్యచిత్ర
భాష తెలుగు

కావిలిపాటి విజయలక్ష్మి రచించిన "విధివిన్యాసాలు" నవలాధిరిత చిత్రం. ఇది సత్యచిత్ర పతాకం పై సత్యనారాయణ, సూర్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శోభన్ బాబు తండ్రి కొడుకుల పాత్రలలో శోభన్ బాబు ద్విపాత్రాభినయనం చేసారు.

కథ

బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడిని(శోభన్ బాబు) తాసిల్దారుగారి అమ్మాయి (జమున) ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇష్టం లేకపోయినా.. విధిలేక పెళ్లి చేస్తారు యువతి మేనమామలు, కుటుంబీకులు. ఆ తరువాత వారిద్దరినీ విడగొట్టే ప్రయత్నాలు మొదలవుతాయి. తన భర్త వేరే యువతితో సినిమా చూస్తున్న దృశ్యం తాసిల్దారు అమ్మాయికి చూపించి, అనుమాన బీజాలు నాటతారు. దాంతో ఇద్దరి మధ్య అపోహలు తలెత్తుతాయి. పేదరికంలో ఉన్నవారికి తక్కువ బుద్ధులే ఉంటాయని గేలిచేస్తూ తన తండ్రి తాసిల్దారు కనుక మంచి బుద్ధులు ఉంటాయని, తన కొడుకును వాళ్ల దగ్గర పెంచుతానని మొండికేస్తుంది భార్య. అహం దెబ్బతిన్న భర్త తన కొడుకును కలెక్టర్ చేస్తానని సవాల్ చేస్తాడు. ఆ కారణంగా ఇద్దరూ దూరమవుతారు. చివరకు అనుకున్నది సాధిస్తాడు భర్త. కలెక్టర్ అయిన కొడుకు.. తన తల్లిదండ్రులు చిన్న కారణంతో విడిపోయారని తెలుసుకుని, తిరిగి కలపడానికి చేసిన ప్రయత్నాల్లోనూ సఫలుడవుతాడు.

పాటలు

  1. అల్లరి చేసే వయసుండాలి ఆశలు రేపే మనసుండాలి - పి.సుశీల, జే.వి. రాఘవులు
  2. కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకం - పిఠాపురం
  3. చకచకలాడే నడుము చూడు నడుమును ఊపే నడకలు చూడు - ఘంటసాల, పి.సుశీల , రచన: ఆత్రేయ
  4. జాగిరి జాగరి జాగిరి బావా గాజుల గలగల వింటావా - పి.సుశీల
  5. నీకున్నది నేనని నాకున్నది నీవని- మనమింకా కోరేది వేరేది లేదని - ఘంటసాల, పి.సుశీల , రచన: ఆత్రేయ
  6. పాడమన్నావు పాడుతున్నాను నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను - పి.సుశీల

మూలాలు, వనరులు

Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!