ఇడియట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ, రక్షిత, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన 2002 నాటి తెలుగు ప్రేమకథా చిత్రం. "ఓ చంటి గాడి ప్రేమకథ" అన్నది సినిమాకి ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). సినిమా పోస్టర్లలోనూ, సినిమాలోని కొన్ని డైలాగుల్లోనూ ఇడియట్ అన్న పదానికి "ఐ డూ ఇష్క్ ఓన్లీ తుమ్ సే" (I Do Ishq Only Tumse) అన్న వాక్యంలోని మొదటి అక్షరాల కలయికగా చమత్కరించారు.
కథ
చంటి హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి కొడుకు. కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడూ సాహసాలు చేస్తుంటాడు. ఏదైనా సరే మొహాన్నే చెప్పేయడం ఇతని నైజం. ఒకానొక ప్రమాదంలో ఇతను ఆసుపత్రిలో చేరితో ఒక అమ్మాయి ఇతనికి రక్తదానం చేస్తుంది. ఆ అమ్మాయి మళ్లీ కాలేజీలో చూసి వెంటనే తను ప్రేమిస్తున్నానని చెబుతాడు. తర్వాత ఆ అమ్మాయి నగరంలోకి కొత్తగా వచ్చిన పోలీసు కమీషనరు కూతురని తెలుస్తుంది. అయినా సరే ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని పట్టుపడతాడు.
నిర్మాణం
అభివృద్ధి
పూరీ తెలుగులో తీసినా బాచి సినిమా పెద్దగా ఆడలేదు. అదే సినిమా కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ పెద్ద కొడుకు హీరోగా పెట్టి కన్నడంలో తీస్తే బాగా ఆడింది. అందుకని రాజ్ కుమార్ తన మూడో కొడుకుని హీరోగా ప్రవేశపెట్టడానికి పూరీ జగన్నాథ్ ను పిలిపించాడు. రాజ్ కుమార్ కుటుంబంలో అందరూ పూరీ చెప్పిన కథను విని మెచ్చుకున్నారు. అప్పటికే ఆ కథతో రవితేజ హీరోగా తెలుగులో సినిమా తీయాలనుకున్నాడు. కానీ రాజ్ కుమార్ కు ఈ కథ బాగా నచ్చి ముందుగా కన్నడంలోనే చేయమని కోరాడు. రవితేజ కూడా అందుకు ఎదురు చూస్తామన్నాడు. పూరీ దర్శకత్వంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా అప్పు అనే పేరుతో విడుదలై ఘన విజయం సాధించింది. తరువాత తెలుగులోకి ఇడియట్ పేరుతో రీమేక్ చేశారు.[1]
నటీనటుల ఎంపిక
సినిమాలో కథనాయకునిగా మహేష్ బాబుని అనుకున్నారు దర్శకుడు పూరీ జగన్నాధ్.[2] అయితే వివిధ కారణాల వల్ల ప్రాజెక్టులో మహేష్ పనిచేయలేదు. పవన్ కల్యాణ్ ని కూడా సంప్రదించారు. కానీ అది కూడా కుదర్లేదు.[3] తర్వాత పూరీజగన్నాథ్ రవితేజని ఈ సినిమాలో కథానాయకుని పాత్రకు ఎంచుకున్నారు.
నటవర్గం
సాంకేతికవర్గం .
పాటల జాబితా
1: చూపుల్తో గుచ్చి గుచ్చి, రచన: కందికొండ , గానం. శంకర్ మహదేవన్.
2: లే లేత , రచన: భాస్కర భట్ల, గానం.ఉదిత్ నారాయణ. కౌసల్య
3: సై సర సై, రచన: కందికొండ గానం. చక్రి
4: చెలియ చెలియ, రచన: పెద్దాడ మూర్తి , గానం.రవివర్మ
5: ఈరోజు , రచన; కందికొండ , గానం.కౌసల్య
6: జై వీరాంజనేయ , రచన: భాస్కర భట్ల , గానం.రఘు కుంచె
మూలాలు
బయటి లంకెలు