సారా అలీ ఖాన్ (ఆంగ్లం: Sara Ali Khan; జననం 1995 ఆగస్టు 12) హిందీ చిత్రసీమకు భారతీయ నటి. ఆమె నటులు అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల కుమార్తె. కొలంబియా యూనివర్శిటీ నుండి హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్‌లో పట్టా పొందిన తర్వాత, ఆమె తన నటనా జీవితాన్ని 2018లో రొమాంటిక్ డ్రామా కేదార్‌నాథ్, యాక్షన్ కామెడీ సింబాలతో ప్రారంభించింది. ఈ రెండు చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. మొదటిది ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది.[2]
1995 ఆగష్టు 12న ముంబైలో పటౌడీ కుటుంబంలో సారా అలీ ఖాన్ జన్మించింది. ఆమె హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు సైఫ్ అలీ ఖాన్, అతని మొదటి భార్య అమృతా సింగ్ కుమార్తె. రుక్సానా సుల్తానా, శివిందర్ సింగ్ విర్క్‌ల మనుమరాలు కూడా. సారా అలీ ఖాన్ 2016లో కొలంబియా యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఆమె తన నటనా జీవితాన్ని 2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన కేదార్‌నాథ్ చిత్రంతో ప్రారంభించింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా పెద్ద విజయాన్నిచ్చింది. పైగా ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది.[2] అలాగే సారా అలీ ఖాన్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు(IIFA) కూడా కైవసం చేసుకుంది.
సారా అలీ ఖాన్ తన రెండవ చిత్రం రోహిత్ శెట్టి యాక్షన్-కామెడీ సింబా (2018), ఇది కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది, ఇందులో ఆమె సరసన రణ్‌వీర్ సింగ్ నటించారు. 2020లో ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ 1లో ఆమె కార్తిక్ ఆర్యన్ సరసన నటించింది. 2021లో వచ్చిన అత్రాంగి రేలో ఆమె నటనతో ప్రేక్షకులను అలరించింది. ఇక సారా అలీ ఖాన్ వరస సినిమాలతో బిజీగా అయింది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ఒక సినిమా నిర్మాణంలో ఉంది. పవన్ కృపాలానీ దర్శకత్వంలో గ్యాస్‌లైట్ (2023) చిత్రంలో ఆమె నటించింది. ఈ చిత్రంలో చిద్రాంగద సింగ్, విక్రాంత్ మస్సేలతో పాటు ఆమె కీలక పాత్రల్లో నటించారు.[3]
2019లో, ఆమె ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చేరింది.[27] రెడ్ఇఫ్.కామ్ (rediff.com) 2021 ఉత్తమ నటీమణుల జాబితాలో, ఆమె 9వ స్థానంలో నిలిచింది.[28] జీక్యూ ఇండియా 2022లో అత్యంత ప్రభావవంతమైన 30 మంది యువ భారతీయుల జాబితాలో ఆమె 7వ స్థానంలో నిలిచింది.[29]
టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో ఆమె అనేక సార్లు చేరింది. ఆమె 2018లో 30వ స్థానంలో, 2019లో 27వ స్థానంలో, 2020లో 24వ స్థానంలో నిలిచింది. ఆమె ఫాంటా, ప్యూమా, పెప్సీ, వీట్, కుర్కురేలతో సహా పలు బ్రాండ్‌లు, ఉత్పత్తులకు ప్రముఖ ఎండోర్సర్‌గా ఉంది.[30][31] 2022లో, ఆమె పాప్-కల్చర్ అపెరల్ బ్రాండ్ అయిన ది సోల్డ్ స్టోర్‌లో ఈక్విటీ భాగస్వామిగా చేరింది.[32]
కోవిడ్-19 మహమ్మారి సమయంలో, అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్‌లను కొనుగోలు చేయడం కోసం ఆమె సోనూ సూద్ ఫౌండేషన్‌కు అధిక మొత్తం విరాళం ఇచ్చింది. 2021లో, తన పుట్టినరోజు సందర్భంగా, కోవిడ్-19 కారణంగా అనాథలైన పిల్లలకు సహాయం అందించడం కోసం ఆమె కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్‌తో జతకట్టింది.[33][34]
↑"Sara Alikhan: రాజ్‌కోట్‌కు పయనం". web.archive.org. 2022-05-27. Archived from the original on 2022-05-27. Retrieved 2022-05-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)