శ్రీనివాస మంగాపురంతిరుపతికి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.
శ్రీనివాస మంగాపురం తిరుపతి, మదనపల్లి రోడ్డులో తిరుపతికి దగ్గరలో ఉంది. గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆదీనంలో వుండి నిత్య పూజా కార్యక్రమాలకు దూరంగా వుండేది. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణంలో చూడ వచ్చు. ఆ తర్వాత సకల పూజా కార్యక్రమాలు జరుగు తున్నవి. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమలలో వున్న దాని కంటే పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.
మెట్లదారి
గతంలో ఈ మెట్లదారిలో భక్తులతో పాటు చంద్రదిరి పరిసర ప్రాంతాలలో పల్లెవాసులు కూడా నిత్యావసర వస్తువులైన పాలు, పెరుగు, మజ్జిగ, కూరగాయలు మొదలైన వాటిని ఈ మెట్ల దారి గుండా కొండపైకి తీసుకెళ్ళి అమ్మి తిరిగి వచ్చేవారు. కొండపైకి ఇది చాల దగ్గరి దారి. ఒక గంట లోపుల గమ్యస్థానం చేరుకోవచ్చు.
గతంలో మంగాపురంలో రైల్వే స్టేషను కూడా వుండేది. భక్తులు ఇక్కడ దిగి ముందు స్వామివారిని దర్శించుకొని తిరుమలకు వెళ్లేవారు. శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు. చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండా కిందికి దిగేవారు. ప్రస్తుతం మంగా పురంలో రైల్వే స్టేషను లేదు.
తిరుమలకు మెట్ల దారి ద్వారా నడచి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరి వద్ద నుండి శ్రీవారి మెట్టు వద్ద నున్న మెట్ల దారి వరకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. ఉచితముగా భక్తుల సామానులను కొండపైకి తీసుకెళ్ళే సౌకర్యము కూడా ఉంది. నడచి వెళ్ళేభక్తులకు ఇచ్చే ప్రత్యేక టోకన్లు అలిపిరి వద్ద ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఈ మెట్ల దారి (నూరు మెట్లదారి) అతి దగ్గర దారి. ఇది అతి దగ్గరి దారి అయినందున గత కాలంలో ఈ మెట్ల దారి ద్వారా పరిసర పల్లె ప్రజలు పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు మొదలగు వాటిని ఈ మెట్ల దారి ద్వారనే తిరుమల కొండకు చేరవేసే వారు.
చిత్రమాలిక
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, పురావస్తు శాఖ ఫలకం
కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
శ్రీనివాస మంగాపురం గుడిలోని సేవలు
కళ్యాణ వేంకటేశ్వరస్వామి యొక్క ధ్వజ స్తంభం
కళ్యాణ వెంకటేశ్వరాలయము, శ్రీనివాస మంగాపురం. తిరుపతి