చౌదరి మెహబూబ్ అలీ కైజర్ (జననం 13 మే 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు బీహారు శాసనభకు ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] ఆ తరువాత రెండుసార్లు ఖగారియా నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
మెహబూబ్ అలీ కైజర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిమ్రి భక్తియార్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2000 ఎన్నికలలో రెండోసారి, 2009లో జరిగిన ఉప ఎన్నికలో తిరిగి మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికై 2010 నుండి 2013 వరకు బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశాడు.
మెహబూబ్ అలీ కైజర్ 2014లో లోక్ జనశక్తి పార్టీలో చేరి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖగారియా నియోజకవర్గం నుండి ఎల్‌జేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి కృష్ణ యాదవ్ పై 76,003 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, ప్రైవేట్ సభ్యుల బిల్లులు & తీర్మానాల కమిటీ సభ్యుడిగా, సంప్రదింపుల కమిటీ, పర్యాటక & సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
మెహబూబ్ అలీ కైజర్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖగారియా నియోజకవర్గం నుండి లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వికాశీల్ ఇన్సాన్ పార్టీ అభ్యర్థి ముఖేష్ సహానిపై 2,48,570 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, టేబుల్‌పై వేసిన పేపర్లపై కమిటీ సభ్యుడిగా, రక్షణపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
మెహబూబ్ అలీ కైజర్ 2020 శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఆయన కుమారుడు యూసుఫ్ సలావుద్దీన్‌కు టికెట్ నిరాకరించడంతో అప్పటి ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌తో విభేదాలు ఏర్పడడంతో ఆయన కుమారుడు ఆర్జేడీ అభ్యర్థిగా సిమ్రి భక్తియార్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్ సమక్షంలో ఆర్జేడీతో చేరాడు.[3][4]
మూలాలు