ప్రాచీన శిలాయుగం (Paleolithic Age) లో చివరి దశ (మూడవ దశ) ను "ఉత్తర ప్రాచీన శిలాయుగం" (Upper Paleolithic Age) గా పేర్కొంటారు. భారతదేశంలో ఈ దశ సుమారు క్రీ.పూ. 35,000 సంవత్సరాల కాలం నుండి క్రీ.పూ. 10,000 సంవత్సరాల వరకూ కొనసాగింది.[1] ఈ దశ అంతిమ ప్లీస్టోసిన్ శకం (Late Pleistocene Age) లో కొనసాగింది. ఈ దశలో మనుగడలో వున్న మానవజాతి హోమో సేపియన్స్. క్రీ.పూ. 10,000 నాటికి ప్లీస్టోసిన్ శకం ముగియడం, దానితో పాటు ఉత్తర ప్రాచీన శిలాయుగం కూడా ముగియడం జరిగింది. అంటే క్రీ.పూ. 10,000 నాటికి భారతదేశంలో ప్రాచీన శిలాయుగ సంస్కృతి (Paleolithic Age) అంతమై మధ్య శిలాయుగ సంస్కృతి (Mesolithic Age) ప్రారంభమైంది.
భారతదేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగానికి చెందిన ఇతర స్థావరాలు
భారత దేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగపు మానవులు ఉపయోగించిన శిలా పరికరాలు భారతదేశంలో పలు ప్రదేశాలలో కనిపించాయి. ముఖ్యంగా బెలాన్, నర్మదా, చంబల్, సోన్, సబర్మతి, కృష్ణా, గోదావరి, బ్రాహ్మణీ మొదలగు నదీ పరివాహక ప్రాంతాల లోను, తూర్పు కనుమలలోను, చోటా నాగపూర్, రాయలసీమ పీఠభూములలోను విసృతంగా లభించాయి. భారతదేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగ సంస్కృతికి సంబందించిన ప్రదేశాలు 566 కు పైగా గుర్తించారు.
భారత దేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగ పనిముట్లు లభించిన కొన్ని ముఖ్య ప్రదేశాలు
రాష్ట్రం
ఉత్తర ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన పనిముట్లు బయల్పడిన ప్రదేశాలు
జమ్మూ & కాశ్మీర్
పహల్గామ్ (pahalgam)
ఉత్తరప్రదేశ్
మీర్జాపూర్ లోని లెఖానియ (Lekhania), బెలాన్ లోయ (Belan Valley), సింగ్రౌలి (Singrauli)
భద్రాచలం (ఖమ్మం), ఏలేశ్వరం (నల్గొండ), పాకాల, ఘనాపూర్ (వరంగల్), గౌరిగుండం (కరీంనగర్), చంద్రగుప్త పట్టణం [2] (అచ్చంపేట, మహబూబ్ నగర్ జిల్లా), బుర్జుంగల్ (అచ్చంపేట, మహబూబ్ నగర్ జిల్లా), వాంకిడి (నేరడిగొండ, ఆదిలాబాద్), బోథ్ (ఆదిలాబాద్)
ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి (ప్రాక్ పురాయుగం - క్రీ.పూ. 500 వరకు), MLK మూర్తి, AP History Congress
Indian Archaeology 1988-89 A Review [1],1993 Edited by M.C.Joshi, Published by Director general of Archaeolgical Survey of India, Government of India, New Delhi
మూలాలు
↑R.S, Sharma. India's Ancient Past (2016 ed.). New Delhi: Oxford University Press. p. 56.
↑M.C., Joshi (1993). Indian Archaeology 1988-89 A Review. New Delhi: Director general of Archaeolgical Survey of India, Government of India. p. 2.
Strategi Solo vs Squad di Free Fire: Cara Menang Mudah!