సయ్యద్ నజీర్ అలీ (1906 జూన్ 8 - 1975 ఫిబ్రవరి 18) భారత క్రికెట్ తొలి రోజులలో ప్రముఖ ఆటగాడు. [1] తరువాత, అతను పాకిస్తాన్‌కు వలస వెళ్ళి, కొన్ని ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, నిర్వాహకుడయ్యాడు. 1952 నుండి 1968 వరకు టెస్టు సెలెక్టరుగా, 1953-54లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కార్యదర్శిగా పనిచేసాడు. [2]
నజీర్ అలీ అటాకింగ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, ఫాస్ట్-మీడియం బౌలరు, మంచి ఫీల్డరు. అతను వజీర్ అలీకి తమ్ముడు.
MCC 1926/27లో భారతదేశంలో పర్యటించినప్పుడు, అతను MCC కెప్టెన్ ఆర్థర్ గిల్లిగాన్‌ను ఆకట్టుకున్నాడు. అతను ససెక్స్‌కు అర్హత సాధించాలని నజీర్ సూచించాడు. కొన్ని నెలల తర్వాత నజీర్ అలీ సస్సెక్స్ సెక్రటరీని తెల్లవారుజామున 1 గంటలకు నిద్రలేపి, ఆశ్రయం ఇమ్మని కోరాడు. లేదంటే ఆశ్రయం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పంపమని అడిగాడు.
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదవడానికి ఇంగ్లండ్‌కు పంపిన పాటియాలా మహారాజా వంటి పోషకుడు ఉండటం నజీర్ అదృష్టం. అక్కడ అతను ఒకసారి సస్సెక్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతర మ్యాచ్‌లలోనూ ఆడాడు. నాలుగు సంవత్సరాల తర్వాత భారతదేశంలో తన కెరీర్‌ను పునఃప్రారంభించాడు.
అతను 1932లో భారతదేశపు మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆడి 13, 6 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయం పాలయ్యాడు. ఈ పర్యటనలో అతను 1020 పరుగులు చేసి, 23 వికెట్లు తీశాడు. నజీర్‌కు అత్యంత చిరస్మరణీయ ఫీట్ బహుశా ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో చేసిన 52. ఆ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌పై భారత జట్టు చేసిన మొత్తం పరుగులు 66. ఆ ఇన్నింగ్స్‌లో మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా మూడు కంటే ఎక్కువ స్కోరు చేయలేదు. ఒక ఆటగాడు యాభై చేసికూడా జట్టు చేసిన అతి తక్కువ ఫస్ట్ క్లాస్ స్కోరుకు ఇది ఇప్పటికీ రికార్డే. [3]
నజీర్ 1933/34లో మద్రాస్‌లో ఇంగ్లండ్‌తో మరో టెస్టు ఆడాడు. 1947 తరువాత, అతను పాకిస్తాన్లో స్థిరపడి, అక్కడ క్రికెట్ నిర్వాహకుడయ్యాడు.
మూలాలు
↑"Nazir Ali". ESPNcricinfo. Retrieved 10 May 2020.